Read more!

బుధాదిత్య రాజయోగం.. ఈ నాలుగు రాశుల వారి జీవితంలో ఊహించని మలుపులు

 

బుధాదిత్య రాజయోగం.. ఈ నాలుగు రాశుల వారి జీవితంలో ఊహించని మలుపులు

సూర్యుడు నవగ్రహాలలో ప్రముఖమైన గ్రహం.  సూర్యుని  కదలికను బట్టి  అన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. ఈ గ్రహ సంచారం కారణంగా ఆయా రాశుల వారికి ఆరోగ్య, ఆర్థిక తదితర ఫలితాలు ఉంటాయి. అయితే  కర్కాటక రాశిలో సూర్యుని సంచారము జూలై 16, 2023 ఉదయం 04:59 గంటలకు మొదలవుతుంది. ఇది ఆగస్టు 17, 2023,  మధ్యాహ్నం 01:27 వరకు  ఉంటుంది. బుధ గ్రహం ఇప్పటికే కర్కాటకంలో సంచరిస్తోంది. ఇప్పుడు  సూర్యుడు,  బుధుల కలయిక కొన్ని రాశులవారికి రాజయోగాన్ని తెచ్చిపెడుతోంది. దీన్ని  బుధాదిత్య రాజయోగం అని అంటారు. కర్కాటక రాశిలో సూర్యుని సంచారము కొన్ని రాశుల వారి జీవితాలలో చాలా మెరుగుదలను తెస్తుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుంటే..

మేషం..
 
కర్కాటక రాశిలో సూర్యుని సంచారం మేషరాశి వారికి గొప్ప  మలుపుగా మారుతుంది. మేషం సూర్యునిచే పాలించబడుతుంది.  ఈ సంచారం మేష రాశి వారి  జీవితంలో గొప్ప శుభవార్త తెస్తుకొస్తుంది. వీరికి    ప్రమోషన్ అవకాశాలు  ఎక్కువగా ఉంటాయి. ఇది ప్రభుత్వ రంగంలో పనిచేసే వ్యక్తులకు అదనపు పురోగతిని ఇస్తుంది.  ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశాలు  ఎక్కువగా ఉన్నాయి. జులై, ఆగష్ట్ నెలల కాలంలో ఎన్నో మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయి.

మిథున రాశి..

సూర్య సంచారం వల్ల మిథున రాశి వారికి మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయి.  ముఖ్యంగా ద్వితీయ రాశిలో సంచరించడం వల్ల మిథునరాశి వారికి సోదర సోదరీమణుల మద్దతు లభిస్తుంది. స్నేహితుల నుండి కూడా సపోర్ట్ లభిస్తుంది.  జీవితంలో,  సమాజంలోని వివిధ సమస్యలను అధిగమించడానికి పట్టుదలతో ఉంటారు.  ప్రస్తుత ఉద్యోగంలో ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలున్నాయి. అదృష్టం ముంగిట్లో ఉందనే చెప్పవచ్చు. సమయానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిరోజూ సూర్యునికి అర్ఘ్యం  సమర్పించడం వలన జీవితంలో సమస్యలు తొలగిపోతాయి.

కర్కాటక రాశి...

సూర్యుడు కర్కాటకరాశిలో  ప్రవేశించగానే రెండవ ఇంటిలో  గ్రహానికి అధిపతి అవుతాడు. ఈ కారణంగా  ఈ రాశి వారికి మెరుగుదల బాగుంటుంది.  గ్రహ గమనం వల్ల రాశి వారికి శుభ ఫలితాలు లభిస్తాయి.  ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. ఇది వివాహంలో సమస్యలను తొలగిస్తుంది.  వ్యాపారంలో కూడా సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగం విషయంలో స్థానచలనం కావాలని అనుకునేవారికి మంచి సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార గణాంకాలలో గణనీయమైన పురోగతి ఉంటుంది. నెట్‌వర్కింగ్ అవకాశాలు పెరుగుతాయి. ఇది వ్యక్తి   నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించి,  వైవాహిక జీవితంలో ఇబ్బందులను తగ్గిస్తుంది.

తుల రాశి..

తుల రాశి వారికి సూర్యుడు పదకొండవ ఇంటికి అధిపతి. ఇది ఈ రాశుల వారి కెరీర్ అవకాశాలను ప్రభావితం చేస్తుంది. జీతం పెరిగే అవకాశం సానుకూలంగా ఉంది. సూర్య సంచారము వలన  చాలా ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో సఫలమవుతారు.  కీర్తి మెరుగుపడటంలోనూ, అప్పగించిన పనులను నమ్మకంగా పూర్తీ చేయడంలోనూ సఫలమవుతారు.  కుటుంబంతో సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.  వివాదాలు సులువుగా ఎదుర్కొంటారు.   క్రమం తప్పకుండా  సూర్య నమస్కారం, సూర్యుడి ఆరాధన చేయడం వల్ల తుల రాశి వారికి సానుకూల ఫలితాలు లభిస్తాయి.

                                                                      *నిశ్శబ్ద.