Read more!

రుద్ర నామ రహస్యం, అర్థం తెలుసా?

 

రుద్ర నామ రహస్యం, అర్థం తెలుసా?

పరమేశ్వరుడిని రుద్రుడు అని కూడా అంటారు. అయితే రుద్రుడు అంటే ఏంటి?? రుద్ర నామానికి అర్థం ఏమిటి? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. నిజానికి ఆ రుద్రుడిని పూజించే ఎవరికీ కూడా రుద్రుడు అనే పేరుకు సరైన అర్థం కూడా తెలియదు. కేవలం అలా ఆచరిస్తూ వెళుతుంటారు.  రుద్రుడు అంటే రోదనము కలిగించువాడు, కరిగించువాడు, నమస్కరించిన వారి దుఃఖం పోగొట్టేవాడు అని అర్థం. 

రుద్ర నామానికి పైన చెప్పుకున్న అర్థమే కాకుండా తత్త్వపరమైన అర్థం కూడా ఉంది.  రుద్రుడు అనే పేరులో…  'ర'కారం అగ్ని బీజం (పంచ భూతాల్లో ఒకటి అయిన అగ్ని కాదు, ఇది అన్నిటికీ మూలం అయిన చిదగ్ని), 'ద'కారం సోమ తత్త్వం, వెరసి అమ్మ, అయ్యా కలిపితే రుద్ర తత్త్వం. (అగ్నీసోమాత్మకం జగత్ అని అంటారు)

ఇకపోతే రుద్రుడి గురించి తపస్సు చేసేవారు, ధ్యానం చేసేవారు చాలామంది ఉంటారు. అయితే రుద్రుడు ఎవరి ధ్యానానికి తొందరగా దర్శనం ఇచ్చాడు అంటే….  ఈయన ఋషులు ధ్యానానికి కూర్చోగానే వెంటనే దర్శనం ఇచ్చాడు.

పరమేశ్వరుడి గురించి అందరికీ తెలుసు కానీ ఆయన ఆవిర్భావం గురించి తెలియదు. రుద్రుడిగా పిలవబడే ఈయన ఆవిర్భావం గురించి కూడా తెలియదు.  రుద్రుడు ఎక్కడనుండి ఆవిర్భవించాడంటే…   బ్రహ్మ గారి భ్రూ మధ్య స్థానం నుండి ఆవిర్భవించాడు.

ఇకపోతే రుద్రులు అని కొందరున్నారు. వారు ఎంతమంది? వారు ఎవరు? అనే విషయం తెలుసుకుంటే…  ఏకాదశ రుద్రులు- కపాలి, పింగళుడు, భీముడు, చండుడు, భవుడు, విరూపాక్షుడు, విలోహితుడు, శాస్త్ర, అజాపత్, శంభుడు, అహుర్బుధ్నణ్యుడు. వీరందరూ రుద్రులే...

పరమశివుడు వైద్యనాథుడిగా వెలిశాడు. ఆయన్ను స్మరించుకోవడం ఎంతో పుణ్యదాయకం.  వైద్యనాథ మంత్రం…

  శ్రీ బాలాంబికేశాయ నమః

  శ్రీ వైద్యేశాయ నమః 

  శ్రీ భవరోగహరాయ నమః

  శ్రీమృత్యుంజయాయనమః.

పై మంత్రాన్ని ధ్యానం చేయడం ఎంతో మంచిది. 

పరమేశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. అయితే ఆ  లింగములు ఎన్ని రకములు అవి ఏవో తెలుసా….

పరమేశ్వసర లింగములు మూడు రకములు 

1 మానుష లింగములు 

2 సిద్ధ లింగములు 

3 స్వయంభూ లింగములు.

రుద్రం ఆరాధన ఎన్ని రకాలు ఉంటుందంటే… మూడు రకాలుగా ఉంటుంది. ఆ మూడు రకాలు ఏవంటే…. పంచాక్షరీ జపం, శివకార్యాలు శివప్రీతిగా చెయ్యడం, శివక్షేత్రాలు దర్శించడం, మంత్రజపం చేయడం. 

అందరూ  శివ గంగ అని అంటూ ఉంటారు. అయితే శివ గంగ అంటే ఏమిటంటే… శివక్షేత్రాలలో ఉన్న జలాన్ని శివగంగ అని అంటారు. 

రుద్రుడు ఆరాధన మూడురకాలుగా చేయవచ్చని అంటారు అయితే వాటిలో ఒకటైన శివకార్యాలు అంటే ఏమిటి అనే సందేహం చాలామందిలో ఉంది.   శివునికోసం పూలు సమకూర్చడం. ఆలయాలు శుభ్రపరచడం శివునికోసం చేసేప్రతిపని కూడా శివకార్యమే అవుతుంది. 

శివకార్యాలు చేయడంలో క్రియా యోగం  చర్యా యోగం అని ఉంటాయి.  శరీరం ఉపయోగించి ఆలయాలు శుభ్రపరచడం పూలు కోయడం లాంటివి చర్యా యోగం అని అనబడతాయి. ఇక ధ్యానం, పూజ లాంటివి క్రియా యోగం అనబడతాయి. 

రుద్రుడిని ఆరాధించడం వల్ల ఏమి జరుగుతుందో తెలుసా….రుద్రారాధన వల్ల కార్మిక, మాయిక మలములను తొలగించుకోవచ్చు.

క్షేత్రాలకి వెళ్ళినప్పుడు చెయ్యవలసిన విధులు తప్పకుండా తెలుసుకోవాలి. ఊరికే క్షేత్రాలు దర్శించి రావడం వల్ల తగిన పలితం సబాబుగా ఉండదు. క్షేత్రాలు దర్శించినప్పుడు తీర విధులు మరణించిన పెద్దవారిని ఉద్దేశించి చెయ్యాలి..

మనం చేసేకర్మలలో మూడు భాగాల కర్మలు ఉంటాయి.  అవి బీజ వృద్ధి, భోగ, అంశ. వీటిని రుద్రుడిని ఆరాధించడం ద్వారా పోగొట్టుకోగలము.

అలాగే  క్షేత్రానికి వెళ్ళినపుడు చెయ్యకూడని పనులు కొన్ని ఉంటాయి. వాటిలో ముఖ్యంగా  ఇతరులను నిందించకూడదు తిట్టకూడదు ఇవి తప్పనిసరిగా పాటించాలి.

ఇదీ రుద్రుడి పేరుకు, అందులో ఉన్న రహస్యానికి అర్థం.

                                       ◆నిశ్శబ్ద.