శివుడిని ఇలా ఆరాధిస్తే వ్యాధులు నయం అవుతాయి..!

 

శివుడిని ఇలా ఆరాధిస్తే వ్యాధులు నయం అవుతాయి..!


శివుడిని ఆరాధిస్తే ఆయన అన్నీ ఇస్తాడు అంటారు. అయితే చాలామంది అనారోగ్యంతో బాధపడేవారు ఉంటారు.  ఇలాంటి వారు శివుడిని సోమవారం రోజు ప్రత్యేక పద్దతిలో ఆరాధించాలి. ఇది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. శివుడిని  ఎలా పూజించాలో తెలుసుకుంటే..

శివుడిని వ్యాధి నివారణ కోసం పూజించే విధానాలు..


అభిషేకం.. రుద్రాభిషేకం..

రుద్రాభిషేకం చేసే రోజు చాలావరకు ఉపవాసం ఉండటం మంచిది.  ముఖ్యంగా ఉల్లి,  వెల్లుల్లి,  ఉప్పు, మిరపకాయలు ఈ రోజు ఆహారంలో తీసుకోకూడదు.  

పాలు, నీరు, గంగాజలం, తేనె, చక్కెర, గంధం, కర్పూరం, బిల్వపత్రం, ద్రాక్ష, పెరుగు మొదలైన పదార్థాలతో  శివలింగానికి అభిషేకం చేయాలి. ఇది  చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.

“ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం | ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ||”

ఈ మహామృత్యుంజయ మంత్రంతో అభిషేకం చేస్తే రోగ నివారణం త్వరగా కలుగుతుందని పండితుల మాట.

రుద్రాభిషేకం కూడా చాలా మంచి ఫలితం ఇస్తుంది.  ఏమీ లేకపోయినా శివనామస్మరణ చేస్తూ పంచాక్షరీ మంత్రం జపం చేస్తూ శివలింగం మీద ధారగా నీటితో అభిషేకం చేస్తే శివుడు సంతృప్తి చెందుతాడు.

మహామృత్యుంజయ జపం..

ప్రతి రోజు లేదా గురువారం లేదా సోమవారం రోజుల్లో 108 సార్లు మహామృత్యుంజయ మంత్రం  జపించాలి. దీన్ని జపించడం వలన శరీర బలహీనత, అనారోగ్యం తొలగి దీర్ఘాయుష్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

బిల్వపత్రం..

ప్రతి సోమవారం శివలింగానికి మూడు ఆకులు కలిసిన బిల్వపత్రం సమర్పించాలి. “బిల్వదళం పాపనాశనం, వ్యాధినివారణకరం” అని శాస్త్రోక్తం.

ఉపవాసం, ప్రదక్షిణం..


సోమవారం ఉపవాసం చేస్తూ శివాలయంలో ప్రదక్షిణం చేయాలి. ఇలా ప్రదక్షిణ చేసే సమయంలో  “ఓం నమః శివాయ” జపం చేస్తే రోగాలు తొలుగుతాయి.

వైద్యనాథేశ్వర స్వరూపం..

శివుడి వైద్యనాథ రూపం గురించి అందరికీ తెలిసిందే.  ఆయన వైద్యుని రూపం తీసుకుని మరీ వ్యాధులను నాశనం చేస్తాడని  నమ్మకం.  అందుకే వైద్యనాథుడిని  ధ్యానిస్తూ పూజిస్తే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అనారోగ్యాలు ఉన్నవారు ఇంట్లో శివుడిని వైద్యనాథ రూపం చిత్రాన్ని ఉంచుకుని పూజ చేస్తున్నా మంచి ఫలితం ఉంటుంది.

శివ సహస్రనామ పారాయణం..

“శివ సహస్రనామం” పారాయణం చేయడం వలన దేహ బలహీనత తగ్గి, మానసిక శాంతి పెరుగుతుంది.

                                  *రూపశ్రీ.