Read more!

శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్ (Shivashtottara Satha nama Stotram)

 

శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్

(Shivashtottara Satha nama Stotram)

శివో మహేశ్వర శ్శంభు: పినాకినీ శశిశేఖర: వామదేవో విరూపాక్ష: కపర్దీ నీలలోహిత

శంకర శ్సూలపాణి ఖట్వాంగీ విష్ణువల్లభ: శివ విష్ణోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల:

భవశ్శర్వ స్త్రీలోకేశ శ్శితికంఠ శ్శివప్రియ: ఉగ్ర : కపాలీ కామారి రన్దకాసుర సూదన:

గంగాధరో లలాటాక్ష కాలకాల: కృపానిధి: భీమ: పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధర:

 

కైలాసవాసీ కవచీ కఠోర స్త్రీ పురాన్తక: వృషాంకోవృషభారుడో భస్మోద్దూళిత విగ్రహ:

సామప్రియ స్స్వమయ స్త్రయీమూర్తిరనీశ్వర: సర్వజ్ఞ: పరమాత్మా చ అసోమ సూర్యాగ్ని లోచన

హవిర్యజ్ఞమయస్సోమ: పంచవక్త్రస్సదాశివ: విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి:

హిరణ్యరేతా దుర్ధర్షో గిరీశోగిరీశో నఘ: భుజంగ భూషణ భర్గో గిరిధన్వా గిరిప్రియ:

 

కృత్తివాసా: పురారాతి: భగవాన్ ప్రమాధాధిప: మృత్యంజయ స్సూక్ష్మతను: జగద్వ్యాసీ జగద్గురు

వ్యోమకేశో మహాసేన జనజశ్చారు విక్రమ: రుద్రోభూతిపతిస్స్థాణు రహిర్భుద్న్యోదిగంబర:

అష్టమూర్తి రనేకాత్మ సాత్త్విక శ్శుద్ద విగ్రహ: శాశ్వత:ఖండపరుశు రజ : పాశవిమోచన:

మృడ పశుపతి ర్దేవో మహాదేవో వ్యయో హరి: పూషదన్తభిదవ్యగ్రో దక్షా ధ్వర హరో హర:

ఏవం శ్రీ శంభు దేవస్య నామ్నామష్టోత్తరం శతమ్ శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణమ్

 

మల్లికార్జున మంగళాశాసనమ్

ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీ గిరీశాయ దేవాయ మల్లికార్జున మంగళమ్

సర్వమంగళ రూపాయ శ్రీ నాగేంద్ర నివాసినే గంగాధరాయ నాథాయ శ్రీ గిరీశాయ మంగళమ్

సత్యానంద స్వరూపాయ నిత్యానంద విధాయనే స్తుత్యాయ శ్రుతిగమ్యాయ శ్రీ గిరీశాయ మంగళమ్

ముక్తిప్రదాయ ముఖ్యాయ భక్తానుగ్రహకారిణే సుందరేశాయ సౌమ్యాయ శ్రీ గిరీశాయ మంగళమ్

 

శ్రీ శైలే శిఖరేశ్వరం గణపతిం శ్రీ హట కేశం పున స్సారంగేశ్వర బిందుతీర్థమమలం ఘంటార్క సిద్ధేశ్వరమ్

గంగాం శ్రీ భ్రమరాంబికాం గిరిసుతా మారామవీరేశ్వరం శంఖం చక్రవరాహ తీర్థమనిశం శ్రీశైలనాథం భజే

హస్తేకురంగం గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానుషంగమ్

మూర్దేందుగంగం మదనాంగ భంగం శ్రీ శైలలింగం శిరసానమామి


  శివమంగళాష్టకమ్

 

భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాల కాలాయ రుద్రాయ, నీలగ్రీవాయ మంగళమ్

వృషా రూడాయ భీమాయ, వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్

భస్మోద్దూళితదేహాయ, నాగయజ్ఞోపవీవీతే రుద్రాక్షమాలా భూషయ, వ్యోమకేశాయ మంగళమ్

సూర్యచంద్రాగ్ని నేత్రాయ,నమ: కాలాస వాసినే సచ్చిదానందరూపాయ, ప్రమథేశాయ మంగళమ్

 

మృత్యంజయాయ సాంబాయ సృష్టి స్థిత్యంతకారిణే త్ర్యంబకాయ ప్రశాంతాయ, త్రిలోకేశాయ మంగళమ్

గంగాధరాయ సోమాయ, నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురఘ్నాయ, వామదేవాయ మంగళమ్

సద్యోజాతాయ శర్వాయ, భవ్య జ్ఞాన ప్రదాయినే ఈశానాయ నమస్తుభ్యం, పంచవక్త్రాయ మంగళమ్

సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ అఘోరాయ చ ఘోరాయ, మహాదేవాయ మంగళమ్

 

మహాదేవస్య దేవస్య య: పఠేన్మంగాళాష్టకమ్

సర్వార్థ సిద్ధి మాప్నోతి స సాయుజ్యం తత: పరమ్