Prema Pandem part 28

 


సర్వోత్తమరావూ, రాంబాబు, ఆత్మానందం బ్లూఫాక్స్ రెస్టారెంట్ కి ఆటోలో వెళ్లారు. రెస్టారెంట్ లో ఒక మూల టేబుల్ దగ్గర కూర్చున్నారు. దారి పొడుగునా ఆత్మానందం రాంబాబుకి భరోసా ఇస్తూనే వున్నాడు. రెస్టారెంట్ పూర్తి రద్దీగా లేదు ఓ మోస్తరు జనం వున్నారు. ఏం తిందాం సార్? ఆత్మానందం వంక చూస్తూ అడిగాడు రాంబాబు అంతలోనే అలా అనొచ్చో లేదోనని డవుటోచ్చి నాలుక కరచుకుని అంటే నా ఉద్దేశం మీరేం తింటారో అని సార్ అన్నాడు రాంబాబు. అప్పుడే తిండా.... హ...హ...హ... భలేవాడివే... ముందు కార్యక్రమం కాకుండానే. హ హ హ.... అన్నాడు ఆత్మానంద. ఆయన మాటలకి రాంబాబు కూడా హాయిగా నవ్వేశాడు. ఓహో, కార్యక్రమమా?... అంటే రెస్టారెంట్ లో గజల్సూ, సినిమా పాటలు పాడుతుంటారూ?... అదా?... అయినా ఈ రోజు అటువంటి కార్యక్రమం ఉన్నట్టెం కనబడడం లేదు. ఒకవేళ ఉన్నా ఆ ప్రోగ్రాం కావాలంటే పది దాటుతుందేమో? హబ్బా!... ఆత్మానందం నొసలు మీద చేత్తో కొట్టుకున్నాడు. మీ ఫ్రండు మరీ ఇంత అమాయకుడేంట్యా బాబూఅన్నాడు ఆత్మానందం.

కార్యక్రమం అంటే అది కాదులే నవ్వుతూ అన్నాడు సర్వోత్తమరావు రాంబాబుతో. మరి ఇంకేమిటి? అమాయకంగా అడిగాడు రాంబాబు. అతని ప్రశ్నకి జవాబు చెప్పకుండా బేరార్ అంటూ పిలిచాడు సర్వోత్తమరావు. అటుగా వెళుతున్న బేరార్ హడావిడిగా వీళ్ళ దగ్గరికి వచ్చాడు. ఏమిటి మేము వచ్చి అయిదు నిమిశాలయినా ఎవరూ మా దగ్గరికి రారేం? అధికారికంగా అడిగాడు సర్వోత్తమరావు. సారీ సార్... మీకేం కావాలో చెప్పండి అన్నాడు బేరార్. సర్వోత్తమరావు ఆత్మానందం వంక చూశాడు. నాకు రాయల్ ఛాలెంజ్... లార్జ్ చెప్పాడు ఆత్మానందం. మా ఇదరికీ కూల్ డ్రింక్స్... థమ్స్ అప్ వుందా? అన్నాడు సర్వోత్తమరావు. ఆత్మానందం ఆశ్చర్యంగా చూశాడు. అదేంటోయ్... థమ్స్ అప్ ఏమిటి...? ఏదైనా హాట్ డ్రింక్ తీస్కో అన్నాడు. అబ్బే... ఎందుకులెండి... వద్దుసార్... అన్నాడు సర్వోత్తమరావు.

నేనేం మీ నాన్నగారికి చెప్పనులే.... హ హ హ .... నవ్వుతూ అన్నాడు ఆత్మానందం. అబ్బే.... అందుక్కాదు సార్... మొహమాటపడకోయ్ బార్ కి వచ్చిన తర్వాత చిన్నా పెద్దా మధ్యాతరం ఏమీ వుండదు ఏం ఫర్వాలేదు తీస్కో అని బేరార్ టో మూడు లార్జ్ రాయల్ ఛాలెంజ్ అని చెప్పాడు. బాబోయ్... నా కొద్దండీ కంగారుగా అన్నాడు రాంబాబు. వాడికస్సాలు అలవాటు లేదు. వాడిని వదిలేద్దాం సార్ అన్నాడు సర్వోత్తమరావు. అలాగే ... ఎవర్నీ బలవంతం చెయ్యడం నా పాలసీ కాదు. హహహ.... నాకు ఒక థమ్స్ అప్ కావాలి బేరార్ కి చెప్పాడు రాంబాబు. మంచింగ్ కి ఏం కావాలి సార్? ముగ్గుర్నీ ఉద్దేశించి అడిగాడు బెరర్. అయి వినగానే ఆత్మానందం తడుముకోకుండా చెప్పాడు ఒక చికె సిక్సిటీ ఫైవ్, ఒక చికె మంచూరియా, చికెన్ టిక్కా, ఫ్రైడ్ ఫ్రైడ్ ఫ్రాన్స్ ఒఅక్తి, ఫిష్ ఫ్రై ఒక ప్లేట్.... అమ్మో... అవేమీ నేను తినలేనండి... నాకు ఫింగర్ చిప్స్ చాలు కంగారుగా అన్నాడు రాంబాబు.

ఆత్మానందం అతని వంక అదో మాదిగా చూశాడు. ఇప్పుడు చెప్పినవన్నీ నా కోసం చెప్పను... మీకేం కావాలో చెప్పండి అన్నాడు. రాంబాబు కళ్ళు తిరిగే. నాకు చికెన్ పకోడా ఒక ప్లేటు కావాలి బేరార్ తో చెప్పాడు సర్వోత్తమరావు నీకు ఫింగర్ చిప్పే చెప్పెయ్యనా? అతడ్ని అడిగాడు . అలాగే.... నీరసంగా అన్నాడతను. అయిదు నిమిషాలలో బేరార్ డ్రింక్స్ తెచ్చిపెట్టాడు. చీర్స్... ఆత్మానందం తన గ్లాస్ ఎత్తి అన్నాడు. సర్వోత్తమరావు తన గ్లాస్ కూడా పైకెత్తి ఆత్మానందం గ్లాస్ కి తాకిస్తూ, చీర్స్...! అన్నాడు. రాంబాబు తన కూల్ డ్రింక్ గ్లాస్ పైకెత్తి చీర్స్ అనాలో వద్దో గొప్ప సందేహం వచ్చింది. ఏం చేయాలో తెలీక కాస్సేపు తటపటాయించి చివరికి తన కూల్ డ్రింక్ గ్లాస్ కూడా పైకెత్తి వాళ్ళకి వినబడి వినబడనట్టు ఛీర్స్... అంటూ మెల్లగా గొణిగాడు.