Prema Pandem part 29

 


ఆత్మానందం, సర్వోత్తమరావూ గ్లాసులోని విస్కీని మెల్లగా చప్పరించాసాగారు. ఉండీ ఉండీ వాళ్ళ ఊరి విశేషాలు ఒకటీ అరా మాట్లాడసాగారు. బేరార్ చికెన్ సిక్స్ టీ ఫైవ్, చికెన్ మంచూరియా వగైరాలనీ పది నిమిషాలలో తెచ్చి పెట్టాడు. ఆత్మానందం వాటన్నిటి మీద ఆబగా పడ్డాడు. ఎప్పుడూ తిండి మొహం ఎరగని వాడిలా రెండు చేతులతో తినేయసాగాడు. గ్లాసులు ఖాళీ అయిపోతున్నాయ... ప్లేటు కూడా ఖాళీ అయిపోతున్నాయి. రాంబాబు గుండెకాయ్ పీచు పీచుమంటూంది. ఆత్మానందం వ్యవహారం చూస్తుంటే బిల్లు చాలానే అయ్యేట్టు వుంది అతను జేబులో ఐదు వందలు వేసుకుని వచ్చాడు. అంతకుమించి అవుతుందని అనుకోలేదు అతను. అతని రాక్షస తిండి, తాగుడూ చూస్తుంటే బిల్లు రెండొందలు దాటేలాగే వుంది. ఇప్పుడెలా...? ఎలా ? ఎలా? అనుకున్నాడు. అతనికి ఒక ఐడియా వచ్చింది. ఊర్కే బిల్లు ఎంతవుతుందో ఎంతవుతుందో అని హైరానా పడేకంటే మెనూ చూసి లెక్క కడితే సరిపోతుందిగా....!

ఆ ఆలోచన రాగానే అతను బేరార్ ని పిలిచాడు ఓ సారి మెనూ తీసుకురా అని అడిగాడు. బేరార్ మెనూ తీసుకుని వచ్చి అతని ముందు పెట్టాడు. అతను మెనూ పేజీలు చక చకా త్రిప్పసాగాడు.... ప్రతి ఐటమ్ ఎదురుగా రెట్లు రాసి వున్నాయి. అతని మెదడు చురుకుగా పనిచేయసాగింది. ఫింగర్ చిప్స్..., చికెన్ పకోడీ, చికెన్ మంచూరియా, చికెన్ సిక్స్ టీ ఫైవ్, ఫ్రాన్స్ ఫ్రై థమ్స్ ఆఫ్, రాయల ఛాలెంజ్... ఇప్పటి దాకా ఎన్ని పెగ్గోలూ? టకటకా లెక్కలు కట్టాడు.. అప్పటికి మొత్తం రెండు వేళ ఐదు వందలు అయింది. అతనికి దుఃఖం వచ్చింది. ఏంటోయ్ రాంబాబు. ఏం చూస్తున్నావ్? ఏ... మేనూనా? ఏదీ ఏమైనా కొత్త వెరైటీలు వున్నాయేమో చూద్దాం అంటూ అతని చేతిలోని మెనూని లాక్కున్నాడు ఆత్మానందం.

అతని గుండె పొట్టలోకి జారిపోయింది. ఆ మెనూ చూసి ఇంకా ఇమేమి ఆర్డర్ చేస్తాడో ఏమిటో... అనవసరంగా బేరార్ ని మెనూ తెమ్మని అన్నందుకు తనని తానూ చేడ తిట్టుకున్నాడు. ఆ మెనూ చూసి మరో రెండు ఐటమ్స్ ఆర్డర్ చేశాడు ఆత్మానందం. పది నిమిషాల తరువాత ప్లేట్లూ ఖాళీ అయిపోయే, గ్లాసులు ఖాళీ అయిపోయాయి. ఏం సార్.... ఇంకో పెగ్ తెమ్మంటారా? ఖాళీ అయ్యాన గ్లాసు వంక చూస్తూ అడిగాడు బేరార్. వద్దులేవోయ్... ఇంక అయిపోయింది అన్నాడు ఆత్మానందం. రాంబాబు మనసులోనే హమ్మయ్య అని అనుకున్నాడు. కానీ అంత లోనే బాంబు పేల్చాడు ఆత్మానందం. ఇంక డిన్నర్ తెచ్చేయ్ ఏం కావాలియా సార్? చికెన్ బిర్యానీ, బట్టర్ చికెన్, ఎగ ఫ్రైడ్ రైస్ వరసగా ఆర్డర్ చేయసాగాడు ఆత్మానందం. రాంబాబుకి కళ్ళు తిరిగాయ్. కుర్చీలోంచి తూలీ డామ్మనీ నేల మీద పడ్డాడు. అదేంటి?... మనం తాగితే మీ ఫ్రండుకి మత్తు వచ్చేస్తూందా... అట్లా తూలీ పడిపోతున్నాడు... ఆ ...? హహహ .... గట్టిగా నవ్వాడు ఆత్మానందం.

అతను క్రింద నుండి లేచి కుర్చీలో సర్దుకుని కూర్చున్నాడు. ఏం లేదు... కుర్చీ లెగ్స్ అనీ వెన్ గా వున్నాయన్న మాట....! కుర్చీ కాస్త వూగితే నేను బ్యాలెన్స్ తప్పి పడ్డానన్నమాట!... హి.... హి హి.... బలవంతంగా నవ్వడతాను. మరో అరగంటికి డిన్నర్ పూర్తి అయింది. బిల్ తెమ్మంటారా సార్? అడిగాడు భేరార్. ఒక ప్లేటు చికెన్ బిర్యానీ, చిల్లీ చికెన్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ పార్శిల్ చేసుకురా బేరార్ తో చెప్పాడు ఆత్మానందం. బేరార్ వెళ్ళిపోయాడు. నేను సుష్టుగా భోం చేసి మా ఆవిడ కోసం ఏం తీస్కేళ్లకపోతే తప్పుకాడూ? రాంబాబుతో అన్నాడు ఆత్మానందం. అవునవును.. తప్పే... మరో నాలుగు ఐటమ్స్ పార్శిల్ చేయిస్తే బాగుండేది...హి అన్నాడు అతను. మనసులో మాత్రం తేరగా వస్తే పెళ్ళానికేం ఖరం... ఇంటి చుట్టుపక్కల వాళ్లకి కూడా పార్సిల్స్ కట్టించుకుని వెళ్తావ్... అనుకున్నాడు. బేరార్ పార్సిల్ తీసుకొచ్చి ఆత్మానందం ముందు వుంచాడు. బిల్ తీసుకురా చెప్పాడు ఆత్మానందం. అలాగే సార్ బేరార్ వెళ్ళిపోయాడు. ఇక్కడ టాయ్ లెట్స్ లేవా?? దిక్కులు చూస్తూ ముదముద్దగా అన్నాడు ఆత్మానందం. అదిగోండి సార్... ఆ ప్రక్కనే వుంది... చూపించాడు సర్వోత్తమరావు. ఆత్మానందం కుర్చీలోంచి లేచి తూలుకుంటూ టాయ్ లెట్స్ వైపు నడిచాడు.