Prema Pandem part 27

 


ఓ.... పరమోత్తమరావు! రా.... అన్నాడు ఆత్మానందం గుమ్మానికి అడ్డు తోలగుతూ. నా పేరు పరమోత్తమరావ్ కాదండీ! సర్వోత్తమరావ్ అన్నాడు అతను లోనికి అడుగుపెడుతూ. ఏదో ఒకటి....! మొత్తానికి ఉత్తమరావే కదా... అన్నాడు నవ్వుతూ. రాంబాబు గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. సర్వోత్తమరావ్ వెనక్కి తిరిగి అతని వంక చూశాడు. లోపలి రావోయ్ అన్నాడు. రా బాబూ అన్నాడు ఆత్మానందం కూడా. అతను మొహమాటంగా లోపలి వచ్చాడు. ఈ అబ్బాయి గురించేనా నువ్వు ఫోన్ లో చెప్పింది? సర్వోత్తమరావుని అడిగాడు ఆత్మానందం. అతను అవునన్నట్లు తలూపాడు. హాల్లో సోఫాలో తను కూర్చుంటూ కూర్చోండి అన్నాడు ఆత్మానందం ఇద్దరూ అతనికి ఎదురుగా కూర్చున్నారు. రెండు నిమిషాలదాకా సర్వోత్తమరావు కుటుంబ సభ్యల గురించి కుశల ప్రశ్నలు వేసి వారి వివరాలనూ కనుక్కున్నాడు ఆత్మానందం. ఏంటి సార్....ఏమైంది...? కంగారుగా అడిగాడు సర్వోత్తమరావు.

ఏం లేదులే! ఫ్యామిలీ మేటర్ అని ఇంట్లోకి చూస్తూ ఏమేవ్ చెప్పడం మరిచా మా కోసం కాఫీలూ గట్రా చేయ్యకు శుద్ధ వేస్ట్ మేము బయటికేళ్తున్నాం అంటూ అరిచాడు ఆత్మానందం. అలాగే.... అలాగే... నేనెందుకు చేస్తానూ ఎవరైనా ఇంటికొస్తే మీరు ఇంట్లో ఏమీ తీసుకోరుగా లోపల్నుండి కూడా ఓ ఆడ కంఠం అరిచింది. ఆత్మానందం తేలిగ్గా ఊపిరి పీల్చుకుని రాంబాబు వంక చూశాడు ఆ..... ఏంటి నీ ప్రాబ్లెం? అదే సార్! ఆఫీసులో నా లోన్ శాంక్షన్ చేయనన్నారు సార్ వినయంగా అన్నాడు రాంబాబు. ఓ... అవునవును లోన్ గురించి కదో? వాళ్ళేవరోయ్ నీకు శాంక్షన్ చేయనని అనడానికి? వాళ్ళు అని బహువచనం అక్కర్లేదు సార్ ఒక్కడే సార్ నందివర్థనరావు సార్. అబ్బా సర్లేవయ్యా అతనొక్కడే.... కానీ అతనేవరయ్యా లోన్ శాంక్షన్ చేయానని అండానికి? మా మేనేజర్ సార్ మెల్లగా అన్నాడు రాంబాబు. హబ్బా... నొసలు మీడ్డ అరచేత్తో ఫటేల్ మని కొట్టుకున్నాడు ఆత్మానందం. నా ఉద్దేశం అతని పేరేంటీ. చేసే పనేంటీ అని కాదయ్యా.... అతను నీకు వీల్లేదని చెప్పడానికి వీల్లేదు. నీ లోన్ నేను శాంక్షన్ చేయిస్తాను మొహం చిట్లిస్తూ అన్నాడు ఆత్మానందం.

థాంక్యూ సార్ ఉబ్బితబ్బిబ్బవుతూ అన్నాడు రాంబాబు. ఇంక మనం బయల్దేరదామా? సోఫాలోంచి లేస్తూ అడిగాడు ఆత్మానందం. ఎక్కడికి సార్ అమాయకంగా అడిగాడు రాంబాబు. ఆత్మానందం సర్వోత్తమారావు వంక చూసి మొహం చిట్లించాడు. ఎక్కడికేంట్రా నీ మొహం .... మనం ఇప్పుడు రెస్టారెంట్ కి వెళుతున్నాం అన్నాడు సర్వోత్తమరావు రాంబాబు డొక్కలో పొడిచి లేచి నిలబడుతూ. రాంబాబు కూడా లేచి నిలబడ్డాడు. ముగ్గురూ ఇంట్లోంచి బయటికి వచ్చారు. ఆత్మానందం వీళ్ళిద్దరి కంటే నాలుగడుగులు ముందున్నాడు. పాపం ఈయన చాలా మంచోడిలా వున్నాడు. పని చేసి పెట్టడం కాకుండా రెస్టారెంట్లో కూడా తినిపిస్తున్నాడు మెల్లగా అన్నాడు రాంబాబు. నీ బొంద... ఇప్పుడు బిల్లు కట్టాల్సింది నీవు తినాల్సింది ఆయన ఇందాక చెప్పాను మర్చిపోయావా? విసుగ్గా మొహం పెట్టి అన్నాడు సర్వోత్తమరావు.