Prema Pandem part 30

 


రాంబాబు సర్వోత్తమ రావు చేతి మీద తట్టాడు. సర్వోత్తమరావు అతని వంక చూసి ఏమిటి అన్నట్లు కళ్ళు ఎగిరేశాడు. మరేమో ఏదైనా హోటల్ లో టిఫిన్ తిని కాఫీ త్రాగామనుకో... అప్పుడు బిల్లు ఏ వంద రూపాయలో అయ్యాయనుకో... కానీ ఆ డబ్బులు మన దగ్గర లేవనుకో... అప్పుడు హోటల్ వాళ్ళు ఏం చేస్తారు? అడిగాడతను ఏ పప్పో రుబ్బించి పంపించేస్తారు చెప్పాడు సర్వోత్తమరావు. మరి ఇలాంటి రెస్టారెంట్లో అయితేనో;...? ఇక్కడ బిల్లు వేల కొద్దీ అవుతుంది కదా? మెత్తగా చితక్కొట్టి పంపిస్తారు... అయ్యానా ఎన్టీ పిచ్చి వాగుడు... మేం తాగితే నీకు మత్తేక్కినట్టుందే! మత్తేక్కడం కాదు... పిచ్చేక్కేలా వుంది అన్నాడు రాంబాబు. అప్పుడే బేరార్ బిల్ తీసుకొచ్చి వీళ్ళ ముందు పెట్టాడు అది చూసి రాంబాబు కెవ్వు మని గట్టిగా అరిచాడు రెస్టారెంట్ లోని తలకాయలన్నీ ఇటు వైపు తిరిగాయ్. ష్... ఏమిటా పిచ్చి కేకలు అన్నాడు సర్వోత్తమరావు. బిల్లు మూడు వేల ఆరు వందల్ యాభై అయింది? ఏడుపు మొహం పెట్టి అన్నాడతను.

అయితే అయ్యింది... నీ పని కావడం ముఖ్యం కదా. నిజమే గానీ ప్రస్తుతం నా జేబులో ఐదు వందల రూపాయలే వున్నాయి. ఇంత బిల్లు అవుతుందని నేననుకోలేదు. ఇప్పుడెలా....? మన ముగ్గుర్నీ తంతారా? నన్నోక్కడినే తంతారా? ఎవరూ తన్నులు తినక్కర్లేదులే... నా దగ్గర డబ్బులున్నాయ్.... నేను డబ్బులు కడతాను. సర్వోత్తమ రావు జేబులోంచి పర్సు తీసి బేరార్ కి డబ్బులు ఇచ్చేశాడు. బేరర్ వెళ్ళిపోయాడు. రేపు ఆఫీసుకు నా డబ్బులు నాకు తెచ్సివ్వాలి! మర్చిపోకూడదు అన్నాడు సర్వోత్తమరావు. రాంబాబు తల వూపాడు. ఇంతలో ఆత్మానందం అక్కడికి వచ్చాడు. ఇంక పోదామా? అన్నాడు అతను. అలాగే అన్నాడు సర్వోత్తమరావు. ముగ్గురూ రెస్టారెంట్ లోంచి బయటపడ్డారు. ఇక్కడ ఇలా వుంటే అక్కడ...

సరోజ ఇంట్లో... ఆమె తండ్రి వ్యాఘ్రేశ్వరరావు ఫోన్ డయల్ చేస్తూ వున్నాడు ఒక నెంబర్ కోసం. ఆయన అలా అయిదు నిమిషాలుగా ఆ నెంబర్ కోసం ప్రయత్నిస్తున్నాడు. చివరికి నెంబర్ దొరికింది అవతల రింగ్ అవుతూంది. రాంబాబూ ... నీ పని చెప్తా... మనసులో అనుకున్నాడు. అవతల ఫోన్ ఎత్తారు. హలో! హలో... నేను వ్రాఘ్రేశ్వరరావుని అన్నాడు. సోఫాలో వెనక్కి జారబడుతూ. ఆ మర్నాడు.... ఆఫీసులో రాంబాబుకు పనిమీద మనసు లగ్నం కావడమే లేదు. మనసంతా ఆత్మానందం జనరల్ మేనేజర్ తో తన గురించి మాట్లాడాడా లేదా? మాట్లాడితే జనరల్ మేనేజర్ వెంటనే నందివర్తనరావుని పిలిపించి తనకు లోన్ శాంక్షన్ చేయ్యమనియా చెప్తాడా లేదా? నిజంగా ఆత్మానందం తన పని చేసి పెడతాడా లేక పొతే రెస్టారెంట్ లో పీకలదాకా మరో మూడు నాలుగు సార్లు మింగి ఊర్కుంటాడా? అలా అని సర్వోత్తమరావు దగ్గర తన సందేహాన్ని వ్యక్త పరిస్తే అతనికి కోపం వస్తుంది. ఆఫీసుకు వచ్సినప్పటి నుండీ అతనికి ఇవే ఆలోచనలు. అప్పటికి మధ్యాహ్నం మూడు గంటలైంది. సర్వోత్తమరావు సీటు దగ్గరకి మెల్లగా వెళ్లాడు రాంబాబు. సర్వోత్తమరావు దీక్షగా ఓ చిన్న పుస్తకంలోకి చూస్తున్నాడు. అది రేసుల పుస్తకం.