హనుమాన్ చాలీసాను పోలి ఉండే అతిశక్తివంతమైన హనుమాన్ స్తోత్రం.. 

 


 హనుమాన్ చాలీసాను పోలి ఉండే అతిశక్తివంతమైన హనుమాన్ స్తోత్రం.. 

 

హనుమంతుడు సప్త చిరంజీవులలో ఒకరు. ఆయన ఎప్పుడూ రాముడి బంటుగా గుర్తింపబడటానికే ఇష్టపడతాడు.  చిన్న పిల్లలు కూడా హనుమంతుడిని చాలా ఇష్టపడతారు. వారంలో మంగళవారం, శనివారం హనుమంతుడి ఆరాధనకు చాలా శ్రేష్టం అని చెబుతారు. అయితే ఈ శ్రేష్టమైన రోజులలో విశేషమైన స్తోత్రాలు పారాయణ చేస్తే ఆయా దేవతల అనుగ్రహం తొందరగా లభిస్తుంది. సాధారణంగా హనుమాన్ చాలీసా పఠనం అందరూ చేస్తారు.  హనుమాన్ చాలీసాను పోలి ఉండి దానికంటే ఎక్కువ శక్తివంతమైన హనుమాన్ స్తోత్రం ఉంది. అదే హనుమాన్ బజరంగ్ బాణం.. దీన్ని బజరంగ్ బాన్ అని పిలుస్తారు. ఇది ఎక్కువగా సంస్కృతం, హిందీ మూలంలో లభిస్తుంది.  ఇతర రాష్ట్రాల్లో దీన్ని ఎక్కువగా పఠిస్తారు. అసలు హనుమాన్ బజరంగ్ బాన్ ను తులసీదాసు ఎప్పుడు రచించారు? దీన్ని మంగళవారం రోజు పఠిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి? తెలుసుకుంటే..

హనుమాన్ బజరంగ్ బాన్..

హనుమాన్ బజరంగ్ బాన్ ను బజరంగ్ బాణం అని కూడా పిలుస్తారు.  దీన్ని తులసీదాసు రచించారు. తులసీదాసు మీద దుష్టశక్తులు ప్రయోగించినప్పుడు హనుమంతుడిని ఎంతో ఆర్తిగా, బాధతో ప్రార్థించారట. అప్పుడు హనుమంతుడే స్వయంగా తులసీదాసు మీద జరిగిన ప్రయోగాన్ని విచ్చిన్నం చేశారని పురాణాలలో కథనాలు చెబుతున్నాయి.

హనుమాన్ బజరంగ్ బాణం స్తోత్రం కాస్త హనుమాన్ చాలీసాకు దగ్గరగా ఉంటుంది. ఇందులో వాక్యాలు కూడా హనుమాన్ చాలీసాను పోలి ఉంటుంది.  అయితే రెండు వేర్వేరు.  బజరంగ్ బాణం అంటే వజ్రం లాంటి దేహం కలిగిన హనుమంతుడు బాణం లాంటి వేగంతో శత్రుసంహారం చేస్తారని అర్థం. దీనికి తగినట్టుగానే బజరంగ్ బాణం స్తోత్రం పఠించే వారికి హనుమంతుడి అనుగ్రహం చాలా తొందరగా లభిస్తుంది.  స్వయంగా హనుమ భక్తుల దగ్గరకు వచ్చి వారిని కష్టాల నుండి గట్టెక్కిస్తాడని చెబుతారు.

బజరంగ్ బాణం పఠిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

మంగళవారం హనుమంతుడి ఆరాధనకు చాలా ముఖ్యమైనరోజు. ఈరోజు బజరంగ్ బాణం పఠిస్తే కలిగే ప్రయోజనాలు చాలా అధ్బుతంగా ఉంటాయి.

శత్రు నాశనం ..  విఘ్నకారులు, అదే పనిగా పనులలో ఆటంకాలు కలిగించేవారు, చెడు మనస్కులు దూరమవుతారు.

దుష్టశక్తుల నివారణ..   భూతప్రేతబాధ, మంత్రతంత్ర ప్రభావాలు తొలగుతాయి.

అడ్డంకుల తొలగింపు..   పని మధ్యలో ఆగిపోతే, ఆపదలో ఉన్నప్పుడు మార్గం సుగమం అవుతుంది.

ధైర్యం, ఆత్మవిశ్వాసం..  భయపడే మనసుకు అచంచలమైన బలం వస్తుంది.

ఆరోగ్య ప్రయోజనం ..  భయాలు, ఆందోళనల వల్ల కలిగే మానసిక బాధలు తగ్గుతాయి.

రక్షణ .. ఇది హనుమంతుడి రక్షణ  కవచంలా పనిచేస్తుందని విశ్వాసం.

కాబట్టి మంగవారం రోజు తప్పకుండా హనుమంతుని బజరంగ్ బాణం లేదా బజరంగ్ బాన్ ను పఠించండి. హనుమ అనుగ్రహానికి పాత్రులు కండి.

                                  *రూపశ్రీ.