హనుమంతుడికి సింధూరం అంటే ఎందుకు అంత ఇష్టం..
హనుమంతుడికి సింధూరం అంటే ఎందుకు అంత ఇష్టం..
హిందూ మతంలో హనుమంతుడికి చాలా ప్రత్యేకత ఉంది. హనుమంతుడిని చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ పూజిస్తారు. హనుమంతుడు నిస్వార్థ భక్తుడు. ఆయన గొప్ప శక్తికి చిహ్నం. ఆయనను ప్రధానంగా మంగళవారాలు, శనివారాల్లో పూజిస్తారు. హనుమంతుడికి సిందూరం సమర్పించే సంప్రదాయం ఉంది. కానీ ఆయనకు సిందూరం సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? దీని వెనుక ఉన్న వివరణ తెలుసుకుంటే..
హనుమంతుడికి సిందూరం సమర్పించడం వెనుక ఒక పౌరాణిక కథ ఉంది. వాల్మీకి రామాయణం, స్కంద పురాణం ప్రకారం.. ఒక రోజు హనుమంతుడు సీతాదేవి తన పాపిట సిందూరం పూసుకోవడం చూసి, "మాతా! సిందూరం ఎందుకు పూసుకుంటున్నావు?" అని అడిగాడు.
అప్పుడు సీత మాత.. ఇది శ్రీరామునికి ఆయుష్షును , అదృష్టాన్ని పెంచుతుంది అని బదులిచ్చింది.
అది వినగానే హనుమంతుడు తన శరీరం అంతటా సింధూరం పూసుకున్నాడు. ఇది శ్రీరాముడిని భావోద్వేగానికి గురిచేసి, సంతోషపరిచింది. హనుమంతుడికి సింధూరం సమర్పించే భక్తుడు శ్రీరాముడి ఆశీస్సులను సులభంగా పొందుతాడని నమ్ముతారు.
హనుమంతుడికి సింధూరం సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు..
హనుమంతుడికి సింధూరం సమర్పించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. శత్రు అడ్డంకులు తొలగిపోతాయి. ఎవరైనా చేతబడి చేసి ఉంటే, హనుమంతుడికి సింధూరం సమర్పించడం వల్ల ఉపశమనం లభిస్తుంది. దీనితో పాటు, మంగళవారం నాడు సింధూరం సమర్పించడం వల్ల అప్పులు, ఆర్థిక సంక్షోభం నుండి విముక్తి లభిస్తుంది.
ఎర్రటి రంగులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని అంటారు. హనుమంతుడి విగ్రహంపై సింధూరం పూయడం వల్ల మానసిక ప్రశాంతత, వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. దీనితో పాటు, స్వచ్చమైన భక్తితో దేవునికి సింధూరాన్ని సమర్పిస్తే ఏ భక్తుడి కోరికలైనా నెరవేరుతాయి. జాతకంలో మంగళ లేదా శని దోషం ఉన్నవారు హనుమంతుడికి సింధూరం తప్పక సమర్పించాలని చెబుతారు.
మత గ్రంథాలలో సింధూరాన్ని సమర్పించడం గురించి ప్రస్తావన ఉంది. హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించడం గురించి అనేక మత గ్రంథాలలో ప్రస్తావించబడింది. ఇది ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు, లోతైన ఆధ్యాత్మిక శక్తికి మూలం కూడా. హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించడం వల్ల అంతర్గత బలం పెరుగుతుందట, అలాగే హనుమంతుని ఆశీర్వాదం కూడా లభిస్తుంది అంటున్నారు.
*రూపశ్రీ.