Read more!

పాదరస శివలింగ పూజామహిమ ?

 

పాదరస శివలింగ పూజామహిమ ?

 

 

పాదరస మహిమ:

పాదరసానికి ఎఅసరాజు అని పేరు. ఇది సిద్ధమై మనయర పురస్సరంగా దేవతా మూర్తుల రూపంలో నిర్మించబడి చైతన్య మంత్రాత్మకమై, శివలింగ, లక్ష్మీ, గణేశ, దుర్గ మొదలైన రూపాల్లో మలచబడి విగ్రహం ఇంట్లో స్థాపిస్తే ఆ ఇంట్లో సమృద్ది, సుఖశాంతులు పుష్కలంగా నెలకొంటాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే నాలుగు పురుషార్థాలు వ్యక్తికీ సిద్ధిస్తాయి. వ్యక్తి జీవితంలో భౌతికంగా సుఖ వాతావరణం, ఆధ్యాత్మికంగా ఉన్నతి కలుగుతుంది. పాదరసం స్వయంసిద్ధ ధాతువు. పూర్నత్వానికి ప్రతీక. శతాబ్దాల్ నుండి దీనిపై పరిశిధన జరిగింది. ఆయుర్వేదంలో దీని ప్రాముఖ్యత విశేషంగా చెప్పబడుతుంది. కేవలం ఔషధంగా మాత్రమే కాక, పాదరసాన్ని మర్థనానికి, భస్మరూపంగా ప్రాణదాయకమైన అనేక రసాలుగా వాడతారు, తంత్రశాస్త్రంలో దీని ప్రాముఖ్యత విశేషంగా చెప్పబడింది.

 

పాదరస శివలింగంతో అనుభవగత ప్యాయోజనాలు :

వాస్తుదోష నివారణ :

విద్వాంసుడైన తాన్త్రికుని చేత శుభముహూర్తంలో పాదరస శివలింగం నిర్మింపజేసి, తీసుకునివచ్చి స్థాపించి ఇంటి యజమాని విద్యుక్తంగా ప్రతిరోజూ అభిషేకం, అర్చన చేయాలి. ఇంట్లో ఏ వాస్తుదోషణ్ ఉన్నా తొలిగిపోతుంది.

తాంత్రికదోషనివారణ :

గిట్టనివారు, అసూయపరులు అప్పుడప్పుడు వ్యాపారం మందగించటానికి లేదా కుటుంబసభ్యులకు హాని కలిగించడానికి ప్రయోగాలు వంటివి చేయటం వల్ల ఇంట్లో ఒత్తిడి, గృహక్లేశం, మానసికఅశాంతి వ్యాపిస్తాయి. ఒక్కోసారి మృత్యువు వంటి ఘోరమైన ఆపద కూడా జరగవచ్చు. అలంటి సందేహం లేదా భయం కలిగితే వెంటనే పాదరస శివలింగాన్ని తీసుకువచ్చి విద్యుక్తంగా పూజించటం ప్రారంభించాలి. ఈ కార్యక్రమం ప్రారంభించిన క్షణం నుండి ఇంట్లో మానసికంగా ధైర్యం, శాంతి ఏర్పడుతుంది. అనతికాలంలోనే శత్రు ప్రయోగం విరుగుడు అవుతుంది. పాదరస శివలింగం ఉన్నచోట దుష్ప్రభావాలు పనిచేయవు.

 

పితృదోషం :

ఏ విధమైన పితృదోషం ఉన్నా పాదరస శివలింగార్చన దాన్ని తొలగిస్తుంది.

రోగవిముక్తి :

తీవ్రమైన వ్యాధులతో బాధపడేవారికి ఔషధసేవనం, చికిత్సతో పాటు పాదరస శివలింగానికి అభిషేకం చేసిన తీర్థం ప్రతిరోజూ ఒక చెంచాడు తాగిస్తే శీఘ్రంగా కోలుకుంటారు.

వివాహబాధ :

ఇంట్లో ఎవరైనా అవివాహితులు ఉండి వివాహప్రయత్నాలు విఫలం అవుతుంటే పాదరస శివలింగ సాధన చేయించాలి. శ్రద్ధ, విశ్వాసాలతో ప్రార్థించాలి. సాధారణంగా ఈ సాధన ప్రారంభించిన 21 రోజుల్లో వివాహ సంబంధం నిశ్చయం అవుతుంది.