కెరీర్ లో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారా... హనుమంతుడిని ఇలా పూజించండి..!

 

కెరీర్ లో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారా... హనుమంతుడిని ఇలా పూజించండి..!

 

ప్రతి వ్యక్తి జీవితంలో కెరీర్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కెరీర్ బాగుంటే జీవితంలో చాలా సమస్యలు  తొందరగా పరిష్కారం అవుతాయి.  అయితే చాలా మంది కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కుంటారు.  ఎంత ప్రయత్నం చేసినా దాన్ని సరైన దారిలోకి తీసుకురాలేకపోతారు.  ఇలాంటి వారికి మంగళవారం హనుమంతుడిని పూజించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.   మహా వీర విక్రమ భజరంగి అని హనుమాన్ చాలీసాలో పేర్కొంటారు. అలాంటి హనుమంతుడు కెరీర్ లో సమస్యలను ఎలా తొలగిస్తాడు?  ఇందుకోసం హనుమంతుడిని ఎలా పూజించాలి? తెలుసుకుంటే..

హనుమంతుడి పూజ..

సాధారణంగా ఏ దేవుడికి అయినా పూజ చేయాలి అనుకుంటే ఎలాగైతే స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి పూజ చేస్తామో.. అలాగే హనుమంతుడిని కూడా పూజించాలి.  

హనుమంతుడికి సింధూరం అంటే చాలా ఇష్టం.  అందుకే ఆయనకు మంగళవారం రోజు సింధూరం అర్పించడం మంచిది.  అలాగే ఆకుపచ్చ మూలికలు,  మల్లె,  రజనిగంధ పువ్వులతో పూజ చేయాలి.  

హనుమకు నైవేద్యంగా వడపప్పు, బెల్లం పెట్టడం చాలా మంచిది.  ఇది హనుమకు ఎంతో ఇష్టమని చెబుతారు. ధూప, దీప, నైవేద్యం అనంతరం భక్తిగా, శ్రద్దతో హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణ చేయడం మంచిది.

హనుమాన్ చాలీసా ప్రాముఖ్యత..

హనుమాన్ చాలీసాలో ఉన్న ప్రతి దోహా మనలో ధైర్యం, శక్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దీనిని భక్తితో పఠిస్తే అడ్డంకులు తొలగిపోవడం, శత్రువుల ఆటంకాలు తగ్గడం, భయం పోవడం జరుగుతుంది. కెరీర్‌లో అవసరమైన ధైర్యం, దృఢ సంకల్పం, మనశ్శాంతి కలుగుతుంది.

సుందరకాండ ప్రాముఖ్యత..

సుందరకాండలో హనుమంతుడి శౌర్యం, భక్తి, సమస్యల పరిష్కార శక్తి వివరంగా ఉంటుంది.  దీన్ని పఠించడం వలన ఆత్మవిశ్వాసం పెరగడం, పెద్ద సమస్యలకు పరిష్కారం దొరకడం, మనసులో స్థైర్యం రావడం జరుగుతుంది.  కెరీర్‌లో ఎదురయ్యే పెద్ద అడ్డంకులు తొలగించుకోవడానికి ఇది అత్యంత శక్తివంతమైన మార్గం.

ఎక్కువ సమయం లేకపోతే ప్రతి రోజు హనుమాన్ చాలీసా పారాణం చేయడం మంచిది.  అట్లాగే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం ప్రతి వారం మంగళవారం రోజు సుందరకాండ పారాయణ చేయడం మంచిది.  ఎందుకంటే సుందరకాండ ఎక్కువ సమయం తీసుకుంటుంది.

                                      *రూపశ్రీ.