భగవద్గీతలో పేర్కొన్న ఈ శ్లోకాలు జీవితాన్ని అద్భుతంగా మారుస్తాయి..!

 

భగవద్గీతలో పేర్కొన్న ఈ శ్లోకాలు  జీవితాన్ని అద్భుతంగా మారుస్తాయి..!


 జీవితం సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.  సంతోషం అనేది చాలా వరకు మనిషి చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయో.. ఆ పరిస్థితులకు మనిషి ఎలా స్పందిస్తున్నాడో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనిషి జీవితానికి ఒక గొప్ప మార్గాన్ని భోధించడంలో భగవద్గీతకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.  భగవద్గీతలో కూడా చెప్పిన కొన్ని విషయాలు పాటిస్తే జీవితం అద్బుతంగా ఉంటుంది. ఆ విషయాలను భగవధ్గీతలో  శ్లోకాల ద్వారా అద్బుతంగా చెప్పాడు శ్రీకృష్ణుడు.   అదేంటో తెలుసుకుంటే..

శ్లోకం..

ధ్యాయతో విషయాంపుంసః సంగస్తేమాపజాయతే|
సంగత్సంజయతే కామాః కామత్ర్కోభిజాయతే|

భావం..

శ్లోకానికి భావాన్ని తెలుసుకుంటే.. మనం ఏదైనా చూసినప్పుడల్లా దానిని కొనాలనే కోరిక, అది కావాలనే కోరిక మనసులో పుడుతుంది. దాని కోసం ప్రయత్నిస్తాం కూడా. కానీ అది నెరవేరనప్పుడు మనస్సు కోపంగా మారుతుంది. మనసు కోపంతో ఉంటే కలిగే ప్రబావం ఎప్పుడూ మంచిది కాదు. అందుకే మనిషి ఎప్పుడూ కోరికలను నియంత్రించుకోవాలి.

శ్లోకం..

క్రోధాద్బవతి సమోహాః సమోహాతస్మృతివిభ్రమః|
స్మృతిభ్రంశద్భుద్దినాశో బుద్దినశత్ర్పణశ్యతి||

కోపం వస్తే ఒక వ్యక్తి హృదయం నాశనం అవుతుంది.  ఆ హృదయమే మనస్సు. అంటే.. కోపం వస్తే మనస్సు నాశనం అవుతుంది.  మనస్సు నాశనం అయితే ఆ మనసు అన్ని తర్ఖాలను కోల్పోతుంది.  తర్కం కోల్పోయినప్పుడు మనిషి విచక్షణ లేకుండా నిర్ణయాలు తీసుకోవడం,   విచక్షణ లేకుండా పనులు చేయడం చేస్తాడు.  కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.  కోపం వచ్చినా వెంటనే నిర్ణయాలు తీసుకోకూడదు.  కోపం తగ్గేవరకు మనిషి నిర్ణయాలకు దూరంగా ప్రశాంతంగా మారేంతవరకు మౌనంగా ఉండాలి.

                                      *రూపశ్రీ.