శరన్నవరాత్రులలో 9 రోజులలో దుర్గా సప్తశతి పారాయణ చేస్తే కలిగే ఫలితాలు ఇవే!

 

శరన్నవరాత్రులలో దుర్గా సప్తశతి పారాయణ చేస్తే కలిగే ఫలితాలు ఇవే!


నవరాత్రులు అంటే శక్తి ఆరాధనకు అత్యంత శ్రేష్టమన కాలం. ఇవి మహాలయ అమావాస్య ముగిసిపోయిన తరువాత ప్రారంభవుతాయి. ఈ 9 రోజులు దుర్గామాత వివిధ రూపాలలో తన భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారి ఆరాధన చేయడానికి, ఆ అమ్మ శక్తిని మనలో ఆవాహనం చేసుకోవడానికి ఉత్తమ సమయం ఇదే.. ఈ సందర్భంలో దేవీ మహాత్మ్యం లేదా  దుర్గా శప్తశతి  పారాయణం చాలా పవిత్రమైనది. అసలు నవరాత్రులలో దుర్గా సప్తశతి పారాయణ చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి? ఎందుకు పారాయణ చేయాలి?  తెలుసుకుంటే..

 దుర్గా శప్తశతి ప్రత్యేకత..

ఇది మార్కండేయ పురాణంలో ఉన్న 13 అధ్యాయాలు, మొత్తం 700 శ్లోకాల సమాహారం. అందుకే దీన్ని  శప్తశతి అని అన్నారు.

ఇందులో మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతి రూపాలలో దుర్గామాత అసురులను సంహరించిన కథలు ఉంటాయి.

దీన్ని పారాయణ చేయడం వలన మనిషిలోని  అంతర్గత శక్తులు మేల్కొంటాయి. చెడు శక్తులు తొలగిపోతాయి.

దుర్గా శప్తశతి  పారాయణ చేస్తే కలిగే ఫలితాలు..


శత్రు నాశనం, రక్షణ..

“అయోధ్యకాండ” లో చెప్పినట్లు దేవీ స్తుతి చేస్తే  శత్రువులు నశిస్తారు. చెడు శక్తుల నుంచి, దృష్టిదోషం, అడ్డంకులు, కోర్టు కేసులు, వ్యాపార శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది.

ఆర్థిక స్థిరత్వం, ఐశ్వర్యం..

శ్రీ మహాలక్ష్మి రూపం ఆరాధన కావడంతో ద్రవ్యాభివృద్ధి, ధనప్రాప్తి చేకూరుతుంది. అప్పుల నుండి విముక్తి కలుగుతుంది.

ఆరోగ్యం, దీర్ఘాయుష్షు..

శప్తశతి లోని "అపరాజిత స్తుతి", "నారాయణీ స్తుతి" జపం చేస్తే వ్యాధి నాశనం, ఆయుష్షు పెరుగుతాయి.

మనోబలం,  ధైర్యం..

దుర్గామాతను “శక్తి స్వరూపిణి”గా ఆరాధించడం వలన మానసిక బలహీనత, భయం, ఆందోళన తొలగిపోతాయి. కష్టాలను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది.

విద్య, జ్ఞానం..

మహాసరస్వతి రూపం కరుణ వలన విద్య, కళలు, వాక్పటుత్వం పెరుగుతాయి.

పాప విమోచనం..

గత జన్మ లేదా ఈ జన్మలో చేసిన పాపాల ప్రభావం తగ్గిపోతుంది. పితృదోషం, దురదృష్టం తగ్గుతుంది.

ఆధ్యాత్మిక పురోగతి..

శప్తశతి చదువుతుంటే మనసు అంతరంగ శుద్ధి పొందుతుంది. మంత్ర శక్తి ద్వారా భక్తి, శ్రద్ధ, సమాధానం కలుగుతాయి.

నవరాత్రులలోనే ఎందుకు చేయాలి?

నవరాత్రుల కాలంలో దేవీ తత్త్వం భూలోకంలో అత్యంత శక్తివంతంగా ప్రబలిపోతుంది. అప్పుడు పఠించిన శప్తశతి జపానికి సహస్ర గుణ ఫలం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.  ఒకసారి నవరాత్రిలో చేసిన పారాయణం వందల సార్లు చేసిన పఠనానికి సమానం.


                                       రూపశ్రీ.