హనుమంతుడు తొందరగా ప్రసన్నం కావాలంటే.. ఈ ఒక్క పని చేయండి చాలు..!
హనుమంతుడు తొందరగా ప్రసన్నం కావాలంటే.. ఈ ఒక్క పని చేయండి చాలు..!
హనుమంతుడు భారతీయ హిందూ దేవతలలో ప్రముఖులు. హనుమంతుడు శక్తి సంపన్నుడు, ధైర్యవంతుడు, చతురత కలిగిన వాడు.. ఇలా చెప్పడం కంటే.. రామ భక్తుడు అని చెబితే ఆయన చాలా సంతోషిస్తాడు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ భయం అనే మాట మనసులో వస్తే వెంటనే హనుమంతుడిని తలుస్తారు. కష్టాలను గట్టెక్కించడంలో, భయాలను పారద్రోలడంలో హనుమంతుడు చాలా శక్తిమంతుడు. అయితే హనుమంతుడు ప్రసన్నం అయితే ఆయన తన భక్తులను ఆదుకుంటాడు. హనుమంతుడిని తొందరగా ప్రసన్నం చేసుకోవడానికి ఒక మార్గం ఉంది. దాని గురించి తెలుసుకుంటే..
కదలి అలంకారం..
కదలి అంటే అరటి పండు.. అరటి పండ్లను హనుమంతుడి అలంకారం కోసం ఉపయోగిస్తే, తదనంతంరం పూజ చేస్తే అద్బుతం చూస్తారు.
కదలి అలంకారం ఎలా చేస్తారు?
అరటిపండ్లను గెలలుగా తీసుకుంటారు. ఈ అరటిపండ్లు చక్కగా మగ్గినవై ఉండాలి. పసుపు వర్ణంలో ఉండాలి. ఈ గెలను ఆంజనేయ స్వామి మూల విగ్రహానికి ఇమిడిపోయేలా అతికించాలి. విగ్రహం పైన, విగ్రహం చుట్టూ అరటి ఆకులతో అలంకరణ చేయాలి. తర్వాత పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ధూపం, దీపం పువ్వులు సమర్పించాలి. ఇలా చేసి హనుమంతుడికి ఎదురుగా కూర్చుని ఉపాసన చేయాలి.
ఇలా హనుమంతుడికి కదలి అలంకారం చేసి పూజిస్తే.. ఉపాసన చేస్తే.. హనుమంతుడు ప్రసన్నుడు అవుతాడు. హనుమంతుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అక్కడికి వచ్చి అరటిపండ్లు తీసుకుని వెళతారు. ఇలా జరిగితే మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుంది.
*రూపశ్రీ.