Top Stories

పులివెందులలో జగన్ అరాచకాల నుంచి ప్రజలు బయటపడుతున్నారు : సీఎం చంద్రబాబు

  పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయి. కాబట్టే 11 మంది నామినేషన్లు వేశారు. 30 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగరాశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఓటు వేశామనే స్లిప్పులు పెట్టారు. అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఆలోచించాలి. జగన్ అరాచకాల నుంచి పులివెందుల ప్రజలు ఇప్పుడే బయటపడుతున్నారు. ఈ విజయం పట్ల నేతలంతా స్పందించాలిని సీఎం చంద్రబాబు ఆదేశించారు.జగన్ అరాచకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారని చంద్రబాబు చెప్పారు.  పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,035 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కకపోవడంతో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మరోవైపు  లతారెడ్డిని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అభినందించారు. చాలా అద్బుత విజయం సాధించారు. సంతోషంగా ఉంది. మీ విజయంతో పార్టీలో చాలా జోష్ ఇంకా ఎక్కువ కదా. అందరం తెలుగు దేశం పార్టీ ఫ్యామిలీ అని భువనేశ్వరి లతారెడ్డితో ఫోన్‌లో అన్నారు. స్వయంగా సీఎం భార్య ఫోన్ చేసి అభినందించడంతో లతారెడ్డి సంతోషంలో మునిగిపోయారు.  
పులివెందులలో జగన్ అరాచకాల నుంచి ప్రజలు బయటపడుతున్నారు : సీఎం చంద్రబాబు Publish Date: Aug 14, 2025 2:47PM

చరిత్రను తిరగరాసిన పులివెందుల ఎన్నిక.. లతారెడ్డికి చంద్రబాబు అభినందన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత  నారా చంద్రబాబునాయుడు పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం విజయాన్ని మూడు దశాబ్దాల తరువాత చరిత్రను తిరగరాయడంగా అభివర్ణించారు. పులివెందులలో విజయం సాధించిన తెలుగుదేశం అభ్యర్థి మారెడ్డి లతారెడ్డిని అభినందించిన ఆయన ఈ విజయాన్ని  మీడియా, సోషల్ మీడియా వేదికల ద్వారా   హైలైట్ చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. మూడు దశాబ్దాల తరువాత పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని పేర్కొన్న చంద్రబాబు.. ఈ ఎన్నికలో పోటీ చేయడానికి 11 మంది ఔను సరిగ్గా 11 మంది నామినేషన్లు వేయడమే ఇందుకు తార్కానమని చెప్పారు. పదకొండు సంఖ్యను నొక్కి చెప్పడం ద్వారా పరోక్షంగా గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీకి వచ్చిన స్థానాలను వ్యంగ్యంగా ప్రస్తావించారు. ఈ సందర్బంగా బ్యాలెట్ బాక్సులో ఓ ఓటరు తన ఓటుతో పాటు.. 30 ఏళ్లలో తొలి సారి ఓటు వేస్తున్నా.. అందరికీ దండాలు అంటూ ఒక స్లిప్ కూడా వేయడాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. పులివెందుల రాజకీయాలలో ఈ జడ్పీటీసీ ఎన్నిక ఒక చరిత్ర అని చంద్రబాబు పేర్కొన్నారు.  
చరిత్రను తిరగరాసిన పులివెందుల ఎన్నిక.. లతారెడ్డికి చంద్రబాబు అభినందన Publish Date: Aug 14, 2025 2:45PM

అసెంబ్లీకి గైర్హాజరై.. ప్రజాస్వామ్యం గురించి కబుర్లేంటి.. జగన్ పై అయ్యన్న ఫైర్

ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పే మీరు అసలు అసెంబ్లీకి వస్తారో రారో క్లారిటీ ఇవ్వండంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్ పై ఫైర్ అయ్యారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారా? రారా క్లారిటీ ఇవ్వాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల తీరు వల్ల ప్రశ్నలు మురిగిపోతున్నాయని మండి పడ్డారు.   ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి.. ముందు ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని  సూటిగా ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి, ఆయన పార్టీ సభ్యులు ప్రజాస్వామ్య దేవాలయం లాంటి అసెంబ్లీకి ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు.  జగన్ హయాంలో అసెంబ్లీలోని ప్రింటర్లలాగత ఐదేళ్లలో అసెంబ్లీలోని ప్రింటర్లు తుప్పు పట్టినట్టే సభ కూడా తుప్పు పట్టింది. జగన్ ఐదేళ్ల హయాంలో అసెంబ్లీ కేవలం 75 పనిదినాలు మాత్రమే నడిచిందన్న ఆయన తెలుగుదేశం కూటమి హయాంలో ఇప్పటికే  31 రోజులు సమావేశాలు జరిగాయన్నారు. ఈ నెల 17 లేదా 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలన్న కనీస స్ఫృహ లేని వైసీపీ అధినేత జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అయ్యన్న పాత్రుడు విమర్శించారు. 
అసెంబ్లీకి గైర్హాజరై.. ప్రజాస్వామ్యం గురించి కబుర్లేంటి.. జగన్ పై అయ్యన్న ఫైర్ Publish Date: Aug 14, 2025 2:28PM

మంగళగిరిలో నారా బ్రహ్మణి పర్యటన.. రెస్పాన్స్ మామూలుగా లేదుగా?

మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న స‌తీమ‌ణి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కుమార్తె  నారా బ్రాహ్మ‌ణి బుధవారం (ఆగస్టు 13) పర్యటించారు. ఆ సందర్భంగా ఆమె నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. తన భర్త ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంపై మమకారంతో ఆమె ఇప్పటికే అక్కడ తన స్వంత ఖర్చుతో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో ముఖ్యంగా  మహిళల కోసం స్త్రీ శక్తి  కుట్టు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశారు. అలాగే, స్థానిక పార్కులో పిల్లలకు ఆటసామగ్రిని తన స్వంత ఖర్చుతో ఏర్పాటు చేశారు.  వీటన్నిటినీ ఆమె ఈ పర్యటనలో సందర్శించారు.  అలాగే చేనేత కార్మికులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప‌రిశీలించారు. నూత‌నంగా తీసుకువ‌చ్చిన డిజైన్ల‌ను ప‌రిశీలించారు.  ‘స్త్రీ శ‌క్తి’ కుట్టు శిక్ష‌ణా కేంద్రాల‌ను ప‌రిశీలించి, శిక్షణ సాగుతున్న తీరును ఆరా తీశారు.  ఇప్ప‌టి వ‌ర‌కు మూడు బ్యాచ్‌లుగా శిక్ష‌ణ పొందిన వారు సొంత‌గానే కుట్టు కేంద్రాలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా స్థిరత్వం పొందుతున్న తీరు పట్ల సంతోషం వ్యక్తం చేశారు.  పార్కులో స్వ‌యంగా తాను సొంత ఖ‌ర్చుతో ఏర్పాటు చేయించిన పిల్ల‌లు ఆడుకునే ప‌రిక‌రాలు.. వ‌స్తువుల‌ను నారా బ్రాహ్మ‌ణి ప‌రిశీలించారు. అలాగే మంగళగిరిలోని ప్ర‌సిద్ధ‌ పాన‌కాల‌స్వామి ఆల‌యాన్ని  నారా బ్రాహ్మ‌ణి సంద‌ర్శించారు.  నారా లోకేష్ సొంత ఖ‌ర్చుతో కొనుగోలు చేసి ఇచ్చిన ఉచిత బ‌స్సులో కొద్ది సేపు ప్రయాణించి, తోటి ప్రయాణీకులతో సంభాషించారు.  నారా బ్రహ్మణి పర్యటనకు జనం నుంచి అద్భుత స్పందన వచ్చింది. కాగా నారా బ్రహ్మణి మంగళగిరిలో పర్యటించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా అమె పలుమార్లు నియోజకవర్గంలో పర్యటించిన సంగతి తెలిసిందే.  
మంగళగిరిలో నారా బ్రహ్మణి పర్యటన.. రెస్పాన్స్ మామూలుగా లేదుగా? Publish Date: Aug 14, 2025 12:54PM

రాహుల్ పై జగన్ వ్యాఖ్యలు.. షర్మిల రియాక్షన్ తట్టుకోలేమంటూ వైసీపీ బెంబేలు

పులివెందుల ఓటమి జగన్ ప్రతిష్టను పాతాళానికి పడిపోయేలా చేసిందన్న మాటలు వైసీపీ వర్గాల నుంచే వినపిస్తున్నాయి. అయితే ఆ పాతాళం కంటే ఆయన ప్రతిష్ఠ దిగజారిపోయే పరిస్థితి ముందుందని అంటున్నారు. పులివెందుల ఓటమిని ముందుగానే అంచనా వేసిన జగన్.. ఆ ఓటమికి అధికార తెలుగుదేశం అధికార దుర్వినియోగమే కారణమని ఆరోపణలు కౌంటింగ్ కు ముందు రోజే గుప్పించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికను రద్దు చేసి కేంద్ర బలగాల పర్యవేక్షణలో తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. అక్కడితో ఆగి ఉంటే పాపం కొంచం ఆబోరైనా దక్కేదేమో.. కానీ జగన్ ఈ వ్యవహారంలోకి రాహుల్ గాంధీని లాగారు. ఓట్ చోరీ అంటూ హంగామా చేస్తున్న ఆయనకు ఏపీలో జరిగిన ఎన్నికల అక్రమాలు కనిపించలేదా? అని ప్రశ్నించడమే కాకుండా, ఏపీ వ్యవహారంపై ఆయన మాట్లాడకపోవడానికి చంద్రబాబుతో నిత్యం హాట్ లైన్ లో టచ్ లో ఉండటమే అందుకు కారణమని ఆరోపించారు.  జగన్ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వైసీపీయులను గాభరా పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, జగన్ కు సొంత చెల్లి అయిన షర్మిల జగన్ వ్యాఖ్యలకు రియార్ట్ అయితే తమ పరిస్థితి, జగన్ పరిస్థితి ఏమిటని బెంబేలెత్తిపోతున్నారు.  జగన్ వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ మామూలుగా ఉండదనీ, ఆమె సంధించే ప్రశ్నలు, చేసే విమర్శలతో జగన్ కు దిమ్మతిరిగి బొమ్మకనబడటం ఖాయమన్న మాటలు వైసీపీ నుంచే వినవస్తున్నాయి.  ఇటు బీజేపీ ఎన్డీయే లో భాగంగా ఉంటూ మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో బాబు హాట్ లైన్ లో ఉన్నారు అంటూ పులివెందుల పంచాయితీలోకి రాహుల్ లాగడం ద్వారా జగన్ తన చెల్లి షర్మిలను రెచ్చగొట్టారని అంటున్నారు.   ఇక ఇప్పుడు షర్మిల నోరు విప్పితే..పులివెందుల ఓటమితో బీటలు మాత్రమే వారిన జగన్ కోట బద్దలైపోవడం ఖాయమని అంటున్నారు. పులివెందుల పంచాయతీలోకి రాహుల్ ను లాగి జగన్ కొరివితో తలగోక్కున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.  
రాహుల్ పై జగన్ వ్యాఖ్యలు.. షర్మిల రియాక్షన్ తట్టుకోలేమంటూ వైసీపీ బెంబేలు Publish Date: Aug 14, 2025 11:54AM

పులివెందులలో డిపాజిట్ కోల్పోయిన వైసీపీ

అంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను సంచలనం నమోదైంది. నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివెందుల కోట బద్దలైంది. జగన్ సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఘనంగా ఎగిరింది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది.  డిపాజిట్ కూడా కోల్పోయి కుదేలైంది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఈ నెల 12న ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. పులివెందుల చరిత్రలోనే తొలిసారిగా ప్రజాస్వామ్యయుతంగా జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఏకగ్రీవమే తప్ప ఎన్నిక ఎరుగని పులివెందుల ఓటర్లు ఈ పరిణామంలో ఓటువేసేందుకు ఉత్సాహంతో పోటెత్తారు. పోలింగ్ సమయంలో ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేయడానికి వీలులేని పరిస్థితులు కల్పించేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలను పోలీసులు సమర్ధంగా అడ్డుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరగేలా చూశారు. దీంతో ఎన్నిక సజావుగా సాగింది.  మొత్తం పోలైన ఓట్లలో తెలుగుదేశం అభ్యర్థికి  6716ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. జగన్ అడ్డాలో ఆయన పార్టీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. 
పులివెందులలో డిపాజిట్ కోల్పోయిన వైసీపీ Publish Date: Aug 14, 2025 11:15AM

పులివెందులలో తెలుగుదేశం ఘన విజయం

కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి ఘన విజయం సాధించారు. తెలుగుదేశం అభ్యర్థి  6 వేల 52 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పులివెందుల తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి సతీమణి  లతారెడ్డి ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.   ఓట్ల లెక్కింపు ప్రారంభమైన క్షణం నుంచీ తెలుగుదేశం కు ఇక్కడ స్పష్టమైన ఆధిక్యత కనిపించింది. ఏ దశలోనూ వైసీపీ అభ్యర్థి పుంజుకునే పరిస్థితి కనిపించలేదు. తెలుగుదేశం అభ్యర్థికి  6735 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 683 ఓట్లు వచ్చాయి. పరాభవాన్ని, పరాజయాన్ని ముందుగానే అంచనా వేసిన వైసీపీ బహిష్కరణ  అంటూ పలాయనం చిత్తగించింది.  
పులివెందులలో తెలుగుదేశం ఘన విజయం Publish Date: Aug 14, 2025 10:42AM

ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం ఎన్నవది.. 78 లేదా 79?

భారతదేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం ను జరుపుకుంటుంది . 2025లో ఇది శుక్రవారం నాడు వస్తుంది.  ఆగస్టు 15, 1947న 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వలస పాలన నుండి భారతదేశం విముక్తి పొందినందుకు గుర్తుగా స్వాతంత్ర్యదినోత్సవంను  జరుపుకుంటారు.  స్వాతంత్ర్యదినోత్సవం అనేది దేశమంతా కలిసి జరుపుకునే పండుగ. భారతీయులు ఈ రోజును చాలా  ఉత్సాహంగా జరుపుకుంటారు, విద్యాసంస్థలు, కార్యాలయాలు,  ప్రభుత్వ సంస్థలు జెండా ఎగురవేయడం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం మొదలైనవి చాలా గొప్పగా చేస్తాయి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 2025 78వ స్వాతంత్ర్య దినోత్సవమా లేక 79వ స్వాతంత్ర్య దినోత్సవమా అనే దానిపై గందరగోళం ఉంది. ముఖ్యంగా పాఠశాలలు,  విద్యాసంస్థలు, వివిధ కార్యాలయాలలో ఇది చాలా గందరగోళం ఏర్పరుస్తుంది.  ముఖ్యంగా ఉపన్యాసాలు,  వక్తృత్వ పోటీలలో ఈ అంశాన్ని ప్రస్తావించే విషయంలో చాలా అయోమయానికి గురవుతూ ఉంటారు. దీనికి చెక్ పెట్టేందుకు.. అలాగే ప్రతి ఏడాది స్వాతంత్ర్యదినోత్సవం నాడు దేశ ప్రభుత్వం ఒక థీమ్ ప్రకటించి దాని లక్ష్యసాధన దిశగా అడుగులు వేయడం జరుగుతుంది. ఈ ఏడాది థీమ్ ఏంటనేది కూడా తెలుసుకుంటే.. చాలా మంది 1947 (భారతదేశం బ్రిటిష్ వలసవాదుల నుండి స్వాతంత్ర్యం పొందిన సంవత్సరం) ను 2025 నుండి తీసివేస్తారు. దీని వల్ల  78 వస్తుంది. ఈ కారణంగా గందరగోళం తలెత్తుతుంది. వారు మొదటి వేడుకను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల ఈ తప్పు జరుగుతుంది. కాబట్టి సరైన మార్గం ఆగస్టు 15, 1947 - భారతదేశం స్వాతంత్ర్యం పొందిన రోజు - మొదటి స్వాతంత్ర్య దినోత్సవంగా లెక్కించడం. కాబట్టి, 2025 భారతదేశ స్వాతంత్ర్య వేడుక 79వ సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారత ప్రభుత్వం ఇంకా అధికారిక థీమ్ ను ప్రకటించలేదు. ప్రతి సంవత్సరం, ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ థీమ్ ను  ఐక్యత, దేశభక్తి, సామాజిక పురోగతి,  భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుల సహకారాలపై కేంద్రీకరిస్తుంది. ఈ సంవత్సరం థీమ్ జాతీయ అభివృద్ధి,  సమిష్టి బాధ్యతపై ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి విలువలను అనుసరిస్తుందని భావిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశ ప్రజలకు మన స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను,  వారి విలువలను నిలబెట్టుకోవడాన్ని గుర్తుచేస్తాయి కాబట్టి అవి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ప్రతి సంవత్సరం భారతదేశం అంతటా వేడుకలు జరుపుకుంటారు, రాష్ట్ర రాజధానులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు,  సంఘాలు జెండా ఎగురవేయడం,  కవాతులు,  సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహిస్తాయి. ప్రధానమంత్రికి సాయుధ దళాలు,  ఢిల్లీ పోలీసులు గౌరవ వందనం సమర్పించడంతో అధికారిక స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జాతీయ గీతం,  21 తుపాకీల వందనంతో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు ఎర్రకోటపై పూల వర్షం కురిపిస్తాయి.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేస్తారు.                                 *రూపశ్రీ.
ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం ఎన్నవది.. 78 లేదా 79? Publish Date: Aug 14, 2025 10:39AM

శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. భారీగా వస్తున్న వరద నీటి కారణంగా అధికారులు జలాశయం 7 గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  గేట్ల ఎత్తి లక్షా 87 వేల 208 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ఇక ప్రాజెక్టుకు జూరాల నుంచి 70 వేల 802 క్యూసెక్కుల నీరు, సుంకేసుల నుంచి 42 వేల 669,  హంద్రీ నుంచి 3,750 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది.   శ్రీశైలం జలాశయం పూర్తిస్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.10 అడుగులుగా ఉంది.  పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 199.2737 టీఎంసీలుగా నమోదైంది.  శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతుంది.
శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న వరద Publish Date: Aug 14, 2025 10:32AM

మోకాళ్లను సంవత్సరాల తరబడి సేఫ్‌గా ఉంచే సూపర్ టిప్స్ ఇవి..!

  వయసు పెరిగే కొద్దీ  ఎముకలు పెళుసుగా,  బలహీనంగా మారతాయి. అయితే అనుసరించే జీవనశైలి,  అలవాట్లు బలమైన ఎముకలకు,  శరీరం  సాఫీగా కదలడానికి దోహదం చేస్తాయి. చాలా మంది మోకాళ్ సమస్య వచ్చేవరకు మోకాళ్ల గురించి అస్సలు ఆలోచించరు. కానీ శరీర బరువును మోసేవి కాళ్లు. ఆ భారం ఎక్కువగా మోకాళ్ల మీద ఉంటుంది. అందుకే ఒక వయసు దాటగానే మోకాళ్లు నొప్పులు రావడం,  లేక ఇతర మోకాళ్ల సంబంధ సమస్యలు రావడం జరుగుతుంది.  అయితే మోకాళ్లను సంవత్సరాల తరబడి ఎలాంటి సమస్యలు చట్టు ముట్టకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ పాటించాలి. ఇవన్నీ లైప్ స్టైల్ అలవాట్లలో భాగమే.. అవేంటో తెలుసుకుంటే.. బరువు.. కొంచెం అదనపు బరువు ఉన్నా అది  మోకాళ్లపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రతి అడుగుతో  శరీర బరువుకు నాలుగు రెట్లు ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం వల్ల ఈ ఒత్తిడి తగ్గుతుంది.  దీర్ఘకాలిక గాయం అయ్యే అవకాశాలు తగ్గుతాయి. మూవ్ మెంట్.. తరచుగా కదలికలు చేయడం వల్ల  మోకాళ్లను సరళంగా ఉంచుకోవచ్చు. అంతేకాదు  కీళ్ళు కూడా  మంచి స్థితిలో ఉంటాయి. నడక, ఈత, సైక్లింగ్ లేదా యోగా వంటి తక్కువ ప్రభావ వ్యాయామాలు మోకాళ్లకు సున్నితంగా  ఉంటాయి. మోకాళ్ల మీద ఒత్తిడి ఉండదు.  కానీ మోకాళ్లను  బలంగా మారుస్తాయి. కండరాల సపోర్ట్.. దృఢమైన కాళ్ళ కండరాలు, ముఖ్యంగా  హామ్ స్ట్రింగ్స్,  క్వాడ్స్,  మోకాళ్ల నుండి ఒత్తిడిని తగ్గిస్తాయి.  వ్యాయామ నియమావళిలో బాడీ వెయిట్ స్క్వాట్‌లు, లెగ్ రైజ్‌లను చేర్చడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.  ఇవన్నీ చేసేటప్పుడు గాయం కాకుండ ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలు బిగుతుగా ఉండటం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయి. ప్రతిరోజూ స్ట్రెచింగ్స్, ముఖ్యంగా  తొడలు, పిక్కలు,  తుంటిని వదులుగా,  స్ట్రయిట్ గా   ఉంచుతుంది. వ్యాయామం తర్వాత లేదా  రోజు చివరిలో వేగవంతమైన స్ట్రెచింగ్ ను  డైలీ రొటీన్ లో భాగం చేసుకోవాలి. షూస్..  నడవడం లేదా వ్యాయామం చేయడం వంటివి చేసేటప్పుడు  మంచి ఆర్చ్ సపోర్ట్,  కుషనింగ్ ఉన్న బూట్లు ధరించాలి. బాగు్నాయి కదా అని పాత షూస్ ను వర్కౌట్స్ కు సరిపడకపోయినా వేసుకుంటే ఆ తరువాత నష్టాలు ఎదురుచూడాల్సి రావచ్చు. మరొక విషయం ఏమిటంటే.. ఎక్కువసేపు హీల్స్ ధరించకూడదు. ఫోజ్ మార్చుకోవాలి.. ఫోజ్ ను భంగిమ అని కూడా  అంటారు.  సరైన భంగిమ కాకుండా వ్యాయామం చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు ఫోజ్ లు పెడుతుంటే అది   వీపును గాయపరచడమే కాకుండా,  మోకాలి అమరికను కూడా దెబ్బతీస్తుంది. నిటారుగా నిలబడాలి, నిటారుగా కూర్చోవాలి. అలాగే వ్యాయామం అయినా వాకింగ్ అయినా, యోగా అయినా వాటికి తగిన విధంగా శరీరాన్ని బ్యాలన్స్ చేయాలి. అలాగే  బరువులు ఎత్తేటప్పుడు కూడా ఫోజ్ చూసుకోవాలి.                        *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
మోకాళ్లను సంవత్సరాల తరబడి సేఫ్‌గా ఉంచే సూపర్ టిప్స్ ఇవి..! Publish Date: Aug 14, 2025 10:24AM

వచ్చే ఎన్నికల్లో జగన్ పోటీ అనుమానమే అంటున్న పయ్యావుల

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలు లేవనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  వివిధ కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ కు శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని గతంలో ఒక ఇంటర్వ్యూలో మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అనుమానం వ్యక్తంచేశారు.  అది వాస్తవ రూపం దాల్చే అవకాశం బలంగా కనిపిస్తోంది.  రాష్ట్ర ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ మాటలు దీని బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై విలేకరుల సమావేశంలో చంద్రబాబు పై మాట్లాడిన జగన్మోహనరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన కేశవ్ వచ్చే ఎన్నికల్లో జగన్ పోటీకి అర్హత ఉంటుందా అనే బాంబు పేల్చారు.  ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం గతంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలపై పక్కా ఆధారాలతో కేసులు నమోదు చేస్తోంది. ప్రధానంగా లిక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ ను అరెస్ట్ చేయడానికి పెద్ద ప్లాన్ వేసినట్లుగా సమాచారం. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై విలేకరులతో మాట్లాడిన జగన్, చంద్రబాబుకు జీవితంలో ఇవే చివరి ఎన్నికలు అవుతాయనీ,  చనిపోయాక నరకానికి పోతారని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేశవ్ చంద్రబాబు మరో పదేళ్లు రాజకీయాల్లో కీలకంగా, క్రియాశీలంగా  ఉంటారని చెప్పారు. ఇదే సమయంలో జగన్ వచ్చే ఎన్నికల్లో పోటీచేయడానికి అర్హత ఉంటుందా అంటూ వ్యాఖ్యానించారు. అంటే త్వరలోనే జగన్ ను అరెస్టు  చేసి శిక్ష పడేవిధంగా చర్యలు ఉంటాయని నర్మగర్భంగా చెప్పారు. దీంతో జగన్ పట్ల కూటమి ప్రభుత్వం పెద్ద ప్లాన్ తోనే ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతల  విషయంలో ప్రభుత్వం కేసుల నమోదుకు ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొందరు నేతలు అరెస్ట్ ల భయంతో కొంతకాలం పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తమను ఎప్పడు అరెస్టు చేస్తారోనని భయంతో వణికిపోతున్నారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ పోటీ  అనుమానమే అంటున్న పయ్యావుల Publish Date: Aug 14, 2025 10:22AM

మూసీ వరద ముప్పు.. అధికారులు అప్రమత్తం

ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీకి వరద పోటెత్తుతోంది.  అలాగే హిమాయత్ సాగర్ కు అన్ని గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  దీంతో మూసీ నది ప్రవాహం ఉధృతంగా ఉంది.  అధికారులు అప్రమత్తమై మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు.   మూసీనదికి ఆనుకొని ఉన్న కాలనీ వాసులందరూ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు చేశారు. లోతట్టు ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.  వరద పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరో 24 గంటల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే స్కూళ్లకు హాఫ్ డే సెలవు ప్రకటించారు.  
మూసీ వరద ముప్పు.. అధికారులు అప్రమత్తం Publish Date: Aug 14, 2025 10:13AM

దోమ, పాలేపల్లి రహదారిపై రాకపోకలు బంద్

భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలలో రోడ్డు చెరువులను తలపిస్తున్నాయి. వాగులూ, వంకలూ పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలు స్తంభించిపోయాయి. వికారాబాద్ జిల్లా దోమ మండలంలో   గొడుగనిపల్లి పెద్దవాగు ,బడెంపల్లి పెద్దవాగులు  , దోమ పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో దోమ, పాలేపల్లి రహదారిపై రాకపోకలు బంద్ అయ్యాయి. అలాగే పగిరి, మహబూబ్ నగర్ గడి సింగాపూర్ రామిరెడ్డిపల్లి గ్రామాలకు రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. రెండు వాగులూ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ రహదారులపై పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు.  
దోమ, పాలేపల్లి రహదారిపై రాకపోకలు బంద్ Publish Date: Aug 14, 2025 9:57AM

రీపోలింగే కాదు.. కౌంటింగూ బహిష్కరణే.. పాపం వైసీపీ

కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 12న జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ఆరంభమైంది. గురువారం (ఆగస్టు 14) ఉదయం ఎనిమిది గంటలకు కడపలోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ  పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.  జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, జేసీ అదితిసింగ్, డిఆర్వో విశ్వేశ్వర నాయుడు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ,  జెడ్పి సీఈవో ఓబులమ్మ, ఏఆర్వోలు రంగస్వామి, వెంకటపతి, ఆర్డీవోలు జాన్ ఇర్విన్, చిన్నయ్య లు పర్యవేక్షిస్తున్నారు.కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పులివెందులకు  సంబంధించి 10 టేబుళ్లలో  ఒక రౌండ్,  ఒంటిమిట్టకు సంబంధించి పది టేబుళ్లలో మూడు  రౌండ్లు ప్రకారం ఓట్ల లెక్కింపు చేపట్టారు . ఒక్కో టేబుల్ కు ఒక్కో సూపర్వైజర్ ,ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లను ఏర్పాటు చేశారు.మొత్తం వంద మందితో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించగా ఇందులో 30 మంది,సూపర్వైజర్లు 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, ముగ్గురు స్టాటస్టికల్ అధికారులు ఉన్నారు  ఇలా ఉండగా వైసీపీ ఈ కౌంటింగ్ ను బహిష్కరించింది. వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఆదేశాల మేరకు కౌంటింగ్ ను బహిష్కరించినట్లు పార్టీ నేతలు చెప్పారు. కాగా పులివెందుల జడ్పీటీసీ లోని రెండు పోలింగ్ కేంద్రాలలో బుధవారం ( ఆగస్టు 13) జరిగిన రీపోలింగ్ ను కూడా వైసీపీ బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ బహిష్కరణలపై తెలుగుదేశం వైసీపీని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నది. ఓటమిని ముందే అంగీకరించేసి తప్పుకుంది పాపం అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  
రీపోలింగే కాదు.. కౌంటింగూ బహిష్కరణే.. పాపం వైసీపీ Publish Date: Aug 14, 2025 9:46AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో భక్తుల రర్దీ అధికాంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. గురువారం (ఆగస్టు 14) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 28 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. టైమ్ స్లాట్ భక్తులకు శ్రీవారి దర్శనానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతుండగా,  300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతోంది.  ఇక బుధవారం (ఆగస్టు 13) శ్రీవారిని మొత్తం 75 వేల 859 మంది దర్శించుకున్నారు. వారిలో  33 వేల 344 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 31 లక్షల రూపాయలు వచ్చింది. 
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ Publish Date: Aug 14, 2025 9:34AM

కృష్ణా నదికి వరద.. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

ఎగువ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా  కురుస్తున్నవర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగింది.   విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. దీంతో  ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి 3,63,438 క్యూసెక్కుల నీటిని దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.     వరద ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో  కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ   హెచ్చరికలు జారీ చేసింది. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.  ఇలా ఉండగా శ్రీశైలం జలాశయానికి కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం పోటెత్తున్న కారణంగా  ఏడు గేట్లు   ఎత్తి  నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎత్తున వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది.  
కృష్ణా నదికి వరద.. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక Publish Date: Aug 14, 2025 6:52AM

కొత్త పేట ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం

కొత్తపేట ఎమ్మెల్యే, తెలుగుదేశం నాయకుడు బండారు సత్యానందరావు కు తృటిలో పెను ప్రమాదం తప్పింది.  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో బుధవారం (ఆగస్టు 13) ఆలమూరులో జరిగిన రైతు సంబరాలకు విచ్చేసిన ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది.   వేలాదిగా తరలివచ్చిన రైతుల మధ్యన ఆయన ఎడ్ల బండి ఎక్కి నినాదాలు చేస్తున్నారు. సరిగ్గా అదే  సమయంలో ఎడ్లబండికి బండికి కట్టిన బెలూన్లు పేలాయి. దీంతో ఎద్దులు ఒక్కసారిగా బెదిరి కదిలాయి. దీంతో ఆ బండి మీద ఉన్న ఎమ్మెల్యే సహా  రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ,  కోనసీమ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు చిలువూరి సతీష్ రాజు తదితరులు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో చిలువూరి సతీష్ కు కాలు ఫ్యాక్చర్ అయ్యింది. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్యే కూడా స్వల్పంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదం తరువాత కూడా ఆయన  రైతు సంబరాల్లో పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.  రాగా ప్రమాద వార్త తెలుసుకున్న మంత్రులు నారా లోకేష్, అచ్చెంనాయుడు ప్రమాద వార్త తెలిసిన వెంటనే విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చంనాయుడు  ఫోన్లో ఎమ్మెల్యే బండారును పరామర్శించారు.
కొత్త పేట ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం Publish Date: Aug 14, 2025 6:34AM

మధ్యాహ్నానికల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ బైపోల్ ఫలితాలు

కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు గురువారం (ఆగస్టు 14) వెలువడనున్నాయి. ఈ ఉప ఎన్నికలను తెలుగుదేశం, వైసీపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సార్వత్రిక ఎన్నికలకు మించిన ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రచారం, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఓ రేంజ్ లో సాగాయి. ముఖ్యంగా పిలివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్ సందర్భంగా యుద్ధవాతావరణం కనిపించింది. అయితే పోలింగ్ రోజునే వైసీపీ చేతులెత్తేసి ఓటమిని అంగీకరించేశామంటూ పరోక్షంగా అంగీకరించేసిందని పరిశీలకులు ఆ పార్టీ నేతల ప్రకటనలు, ఆరోపణలను ఉదహరిస్తూ విశ్లేషిస్తున్నారు. ఆఖరికి వైసీపీ అధినేత జగన్ కూడా పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికను రద్దు చేసి కేంద్ర బలగాల పర్యవేక్షణలో తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేయడంతోనే.. ఆ పార్టీ మానసికంగా ఓటమికి సిద్ధమైపోయిందని అవగతమైపోయందని అంటున్నారు. ఏది ఏమైనా గురువారం (ఆగస్టు 14) ఓట్ల లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నానికి ఫలితం వెలువడుతుంది. ఈ నేపథ్యంలో  పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీస్థానాలలో గెలిచేదెవరు? ఓడేదెవరు? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఈ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లా కేంద్రమైన కడపలో అన్ని ఏర్పాట్లూ చేశారు.   కడపలోని  పాలిటెక్నిక్ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరగనుంది.  పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒకే రౌండ్ లో ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుంది. పులివెందులలో మొత్తం పది వేల 601 ఓట్లకు గాను 8 వేల 103 ఓట్లు పోలయ్యాయి.  ఇక ఒంటిమిట్ట విషయానికి వస్తే.. ఈ జడ్పీటీసీ స్థానం ఓట్ల లెక్కింపునకు కూడా పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఒంటిమిట్టలో మొత్తం 24 వేల 606 ఓట్లు ఉండగా, పోలైనవి 20 వేల 681. 
మధ్యాహ్నానికల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ బైపోల్ ఫలితాలు Publish Date: Aug 14, 2025 6:17AM

తిరుమల గెస్ట్‌హౌస్‌ పేరిట ఫేక్ వెబ్‌సైట్లు..వాటిని నమ్మొద్దు : పోలీసులు

  తిరుమలలో  శ్రీవారి దర్శనం, వసతుల పేరిట ఇంటర్నెట్‌లో నకిలీ వెబ్‌సైట్లు పెరుగుతున్నాయి. వాటిని నివారించడానికి తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్‌రాజు ఆదేశాల మేరకు తిరుమల పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని.. ఇప్పటి వరకు 28 నకిలీ వెబ్‌సైట్లను తొలగించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా శ్రీవారి దర్శనం, తిరుమలలో వసతులు కల్పిస్తామంటూ ఇంటర్నెట్‌లో 30కిపైగా నకిలీ వెబ్‌సైట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిని సెర్చ్‌ ఇంజిన్‌ నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. ఇప్పటి వరకు 28 నకిలీ వెబ్‌సైట్లను తొలగించినట్లు పేర్కొన్నారు. భక్తులు ఎవరైనా తిరుమలలో వసతుల కోసం ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేసినప్పుడు.. సప్తగిరి గెస్ట్‌హౌస్‌, నందకం గెస్ట్‌హౌస్‌, పద్మావతి గెస్ట్‌హౌస్‌.. ఇలా కొన్ని గెస్ట్‌హౌస్‌ల పేరుతో వెబ్‌సైట్లు కనిపిస్తే అవి నకిలీవిగా గుర్తించాలని పోలీసులు తెలిపారు.  తిరుమల శ్రీవారి దర్శనం, వసతులు, సేవల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.tirumala.orgను మాత్రమే సందర్శించాలని చెప్పారు. వాట్సప్‌ కాల్‌, క్యూఆర్‌ కోడ్‌ పంపించి పేమెంట్‌ చేయాలని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దన్నారు. ఇలాంటివి అనుమానాస్పదంగా కనిపిస్తే దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌/100/టోల్‌ ఫ్రీ నంబర్‌ 18004254141ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.  
తిరుమల గెస్ట్‌హౌస్‌ పేరిట ఫేక్ వెబ్‌సైట్లు..వాటిని నమ్మొద్దు : పోలీసులు Publish Date: Aug 13, 2025 9:48PM

భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

  రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో  నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, సీఎస్ విజయానంద్ తదితరులు హాజరయ్యారు. విపత్తు నిర్వహణ, వ్యవసాయం, జలవనరుల శాఖ  ఉన్నతాధికారులు కూడా ఈ అత్యవసర సమీక్షలో పాల్గొన్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రాగల రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తత చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.  కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో వాగులు వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువన ఉన్న ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం కృష్ణా నదిలో రేపటికల్లా 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి 3.09 లక్షల క్యూసెక్కుల నీరు 35 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. కాలువలకు 5 వేల క్యూసెక్కుల మేర నీరు విడిచిపెట్టినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం ప్రకాశం బ్యారేజికి దిగువన ఉన్న ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరోవైపు ఎగువన నాగార్జునసాగర్, పులిచింతల గేట్లను కూడా ఎత్తినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తక్షణం తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.  వరద నీటిని సద్వినియోగం చేయండి ఎగువ నుంచి వస్తున్న నీటిని  సద్వినియోగం చేసుకునేలా రోజుకు నాలుగు టీఎంసీల చొప్పున తరలించి సోమశిల, కండలేరు ప్రాజెక్టులను నింపాలని సీఎం ఆదేశించారు. వరద నీటిని వృధాగా సముద్రంలోకి పోనీయకుండా సద్వినియోగం చేసుకునేలా సమర్ధ నీటి నిర్వహణ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మైలవరం సహా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం బుడమేరు, వెలగలేరులకు పెద్ద ఎత్తున వస్తోందని.. ఈ నీరు కృష్ణా నదిలోకి డిశ్చార్జి చేస్తున్నట్టు తెలిపారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్టు వివరించారు. వరద నిర్వహణా పనుల్లో భాగంగా రూ.40 కోట్లతో బుడమేరు- వెలగలేరు యూటీ నిర్మాణాన్ని చేపట్టేందుకు ముఖ్యమంత్రి అనుమతి మంజూరు చేశారు.  గండ్లు పడకుండా గట్లు పటిష్ట పర్చాలి మరోవైపు భారీవర్షం కారణంగా కొండవీటి వాగు, పాల వాగులకు వస్తున్న నీటిని కృష్ణా నదిలోకి నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తి పోస్తున్నామని  అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వర్షకాల సీజన్ లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలువల్లో నీటి ప్రవాహాలు సక్రమంగా వెళ్లేందుకు వీలుగా గుర్రపు డెక్క, తూడును తొలగించాలని ముఖ్యమంత్రి జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.  అలాగే కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా గట్లను పటిష్టం చేయాలని సీఎం సూచించారు. జిల్లాల్లో వర్షాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండి రైతులకు తక్షణ సమాచారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో భూగర్భ జలాలను రీఛార్జి చేసేలా నిర్మాణాలను చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులు ఆయా ట్రెంచ్ లను ఎక్కడెక్కడ చేపట్టాలో ప్రణాళిక చేసుకోవాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ట్రెంచ్ లను తవ్వేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష Publish Date: Aug 13, 2025 9:05PM

సబితా ఇంద్రారెడ్డికి బిగ్ షాక్..ఎందుకంటే?

  మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి  సీబీఐ అధికారులు షాక్ ఇచ్చారు.. ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు  నిర్దోషిగా ప్రకటించింది. సిబిఐ కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ.. సీబీఐ అధికారులు హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేసింది..  సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ఆమెపై విచారణకు ఆదేశించాలని హైకోర్టుని కోరింది.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది..ఓఎంసీ కేసులో సబితను నిర్దోషిగా ప్రకటించడాన్ని   హైకోర్టు లో సీబీఐ సవాల్ చేసింది.. సబితతోపాటు మాజీ ఐఎస్ఐ అధికారి కృపానందంపైనా కూడా సీబీఐ పిటిషన్‌ వేసింది.  సిబిఐ వేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.. కేసు విచారణ వాయిదా వేసింది..ఓఎంసీ కేసులో సబిత, కృపానందంలను గతంలో నిర్దోషులు గా ప్రకటించిన సీబీఐ కోర్టు..గాలి జనార్దన్‌రెడ్డి సహా ఇతర నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ సీబీఐ కోర్టు గతంలోనే తీర్పించింది..  ఇప్పటికే ఐఏఎస్ శ్రీలక్ష్మి పాత్రపై మళ్లీ విచారణ జరపాలని గతంలో హైకోర్టు ఆదేశం జారీ చేసింది.. ఇప్పుడు సబిత, కృపానందం ల కేసు పైన హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.  
సబితా ఇంద్రారెడ్డికి బిగ్ షాక్..ఎందుకంటే? Publish Date: Aug 13, 2025 8:44PM

స్నాతకోత్సవంలో తమిళనాడు గవర్నర్‌కు అవమానం

  తమిళనాడులోని ఎంఎస్‌యూ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్ ఆర్.ఎన్. రవి చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టా స్వీకరించేందుకు ఓ విద్యార్థిని నిరాకరించారు. గవర్నర్‌ను దాటుకుని నేరుగా వైస్-ఛాన్సలర్ వద్దకు వెళ్లి ఆమె డిగ్రీని స్వీకరించారు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది.  తిరునల్వేలిలోని మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయం 32వ స్నాతకోత్సవం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమానికి 650 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వేదికపై ఉన్న గవర్నర్ ఆర్.ఎన్. రవి నుంచి విద్యార్థులు ఒక్కొక్కరిగా పట్టాలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో నాగర్‌కోయిల్‌కు చెందిన పరిశోధక విద్యార్థిని జీన్ జోసెఫ్ వంతు వచ్చింది. ఆమె వేదికపైకి వెళ్లి గవర్నర్‌ను పట్టించుకోకుండా దాటి వెళ్లిపోయారు.  నేరుగా వైస్-ఛాన్సలర్ ఎన్. చంద్రశేఖర్ వద్దకు వెళ్లి ఆయన చేతుల మీదుగా తన పీహెచ్‌డీ పట్టాను స్వీకరించారు.తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి మధ్య పెండింగ్‌ బిల్లులతోపాటు పలు అంశాలపై విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే నాగర్‌కోయిల్ డిప్యూటీ సెక్రటరీ ఎం రాజన్ భార్య అయిన పీహెచ్డీ విద్యార్థిని జీన్ జోసెఫ్ ఇలా వ్యవహరించింది. గవర్నర్‌ చేతుల మీదుగా డిగ్రీ పట్టా అందుకునేందుకు ఆమె తిరస్కరించింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.
స్నాతకోత్సవంలో తమిళనాడు గవర్నర్‌కు  అవమానం Publish Date: Aug 13, 2025 8:26PM

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పలు విమానాలు దారి మళ్లింపు

  శంషాబాద్ ఎయిర్‌ఫోర్టులో పలు విమానలు అధికారులు దారి మళ్లించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఎనిమిది విమానాలను దారి మళ్లించినట్లు తెలిపారు. హైదరాబాద్‌కు రావాల్సిన విమానాలను విజయవాడ, బెంగళూరు, తిరుపతికి మళ్లించినట్లు పేర్కొన్నారు. విజయవాడకు ఐదుకు, బెంగళూరుకు మూడు, తిరుపతికి ఒక విమానాన్ని మళ్లించినట్లు తెలిపారు.  హైదరాబాద్‌ నుంచి బయలుదేరాల్సిన విమానాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ వ్యాప్తం పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నగరాన్ని మొత్తం కారు మేఘాలు కమ్మేశాయి. ఈ క్రమంలోనే విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే.  
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పలు విమానాలు దారి మళ్లింపు Publish Date: Aug 13, 2025 6:45PM

ముగిసిన మంచు లక్ష్మి ఈడీ విచారణ

  దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్ కేసులో ఈడి విచారణ కొనసాగుతున్నది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసిన ప్రముఖులందరికీ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే దగ్గుపాటి రానా, విజయ్ దేవరకొండ , ప్రకాష్ రాజ్ లను ఈడి విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఈరోజు సినీనటి మంచు లక్ష్మి ని కూడా ఈడి విచారణ చేస్తు న్నారు. మంచు లక్ష్మి గేమింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లుగా అధికా రులు గుర్తించారు. ఈజీగా డబ్బు సంపాదించుకో వచ్చు అంటూ సోషల్ మీడియాలో మంచు లక్ష్మి ప్రమో షన్లు చేసినట్టుగా గుర్తించిన ఈ డి ఆమెకు నోటీసులు జారీ చేశారు.  ఈ క్రమంలోనే మంచు లక్ష్మి ఈరోజు ఉదయం 11:30 గంటల ప్రాంతం లో ఈడి కార్యాల యానికి చేరుకు న్నారు. ఇంకా విచారణ కొనసా గుతున్నది. మంచు లక్ష్మి yolo 247 బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసిన ట్లుగా ఆరోపణలు నేపథ్యంలో అధికారులు వాటి ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీల వివ రాలు సేకరిస్తు న్నారు.. మంచు లక్ష్మిపై పలు ప్రశ్నల వర్షం కురిపిస్తు న్నారు. ఇదిలా ఉండగా మరోవైపు దేశ వ్యాప్తంగా ఉన్న పలు బెట్టింగ్ యాప్ సంస్థల కార్యాల యాల్లో ఈడి సోదాలు చేసింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, జైపూర్, మదురై తదితర 15 ప్రాంతాల్లో సోదాలు చేసి....అంతర్జాతీయ స్పోర్ట్స్, బెట్టింగ్ సంస్థ పరిమ్యాచ్ పేరుట అక్రమంగా బెట్టింగ్ నిర్వహిస్తు న్నట్లుగా ఈడి గుర్తించింది.  దాదాపు 2000 కోట్ల లావాదేవీలు చోటు చేసుకున్నట్లుగా ఈడి ప్రాథమిక దర్యాప్తులో వెల్ల డైంది.దీంతో ఈడి దేశవ్యాప్తంగా బెట్టింగ్ ఆప్ కేసులో పలువురిని  విచారణ చేస్తుంది..  ఈ క్రమంలోనే 1XBET యాప్ ప్రమోట్ చేసినం దుకు క్రికెటర్ సురేష్ రైనాను అధికారులు ఢిల్లీలో విచారిస్తు న్నారు. ఇప్పటికీ రణధీర కపూర్, కపిల్ వర్మ, హుమా ఖురేషి, హీనా ఖాన్ లతోపాటు పలు వురు సెలబ్రిటీలకు సమన్లు జారీ చేసింది. అధికారులు క్రికెటర్ యువరాజ్ సింగ్,  హర్భజన్ సింగ్ , సినీ నటుడు సోను సూద్ లను త్వరలో విచారించనున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రకటనలో అనుమతించినందుకు ఫేస్బుక్ (మెటా) గూగుల్ సంస్థలకు కూడా ఈడి సమన్లు జారీ చేసింది.
ముగిసిన మంచు లక్ష్మి ఈడీ విచారణ Publish Date: Aug 13, 2025 6:00PM

రాజకీయ అక్కసుతోనే తెలంగాణకు అన్యాయం : మంత్రి శ్రీధర్ బాబు

  పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణకు రాజకీయ అక్కసుతోనే కేంద్రం అన్యాయం చేస్తోందని  రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ ప్రాజెక్టు కేటాయింపులో వివక్ష చూపించి, రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమను చూపిస్తుందంటూ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో మండిపడ్డారు.  ‘ప్రపంచ స్థాయి అధునాతన సిస్టమ్ అండ్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 10 ఎకరాల భూమి కేటాయించాం. అన్ని రకాల సబ్సిడీలకు ఆమోదం తెలిపాం. రికార్డు సమయంలో అన్ని అనుమతులిచ్చాం. ఇండియా సెమీకండక్టర్ మిషన్ తుది ఆమోదం లభిస్తే పనులు మొదలు పెట్టేందుకు సదరు ఇన్వెస్టర్ సిద్ధంగా ఉన్నారు. అయినా... కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు’ అని విమర్శించారు.  * కనీస సంసిద్ధత లేని ఏపీకెలా కేటాయిస్తారు..?   అన్ని రకాలుగా అర్హతలున్నా తెలంగాణను విస్మరించి కనీస సంసిద్ధత లేని ఏపీకి ప్రాజెక్టును ఎలా కేటాయిస్తారని మంత్రి శ్రీధర్ బాబు కేంద్రాన్ని ప్రశ్నించారు. ‘తర్కానికి అందని, న్యాయ విరుద్ధమైన ఈ నిర్ణయం పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలను పంపే ప్రమాదముంది. ఇలాంటి రాజకీయ ప్రేరేపిత నిర్ణయాలు దేశ పారిశ్రామికాభివృద్ధికి మంచిది కాదు. అందుకే ఈ నిర్ణయాన్ని మరోసారి పున:పరిశీలించాల్సిన అవసరముంది. వాస్తవ పరిస్థితులను పరిగణలోనికి తీసుకుని తెలంగాణకు మేలు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి’ డిమాండ్ చేశారు.  *కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలి   కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకుని తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. న్యాయం జరిగేలా చొరవ చూపాలి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన తెలంగాణ బీజేపీ ఎంపీలు చోద్యం చూస్తున్నారు. ఇప్పటికీ స్పందించకపోతే తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారు’ అని హెచ్చరించారు.  
రాజకీయ అక్కసుతోనే తెలంగాణకు అన్యాయం : మంత్రి శ్రీధర్ బాబు Publish Date: Aug 13, 2025 5:26PM

పులివెందుల పులి.. పిల్లి కూతలు

నా ఘోష ఎవరికీ పట్టదా అంటూ జగన్ బేల మాటలు కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ అన్నారు చలం. ఆయనే ఇప్పుడు బతికి ఉంటే కృష్ణశాస్త్రి బాధ కాదు, జగన్ బాధ ప్రపంచానికి బాధ అని అని  ఉండేవారు. ప్రపంచం అంతా తనకు మద్దతుగా నిలవాలనీ, అందరూ తనకు సానుభూతి చూపాలనీ, చంద్రబాబు కుట్రలు, కుతంత్రాల వల్లే జనం మద్దతు దండిగా ఉన్నా గత ఏడాది ఎన్నికలలో తనకు ఘోర పరాజయం ఎదురైందనీ జగన్ బాధపడటమే కాదు... అందరూ, అన్ని పార్టీల వారూ కూడా తనకు మద్దతుగా ఆ బాధపడాలని గట్టిగా కోరుకుంటారు. అలా తనకు మద్దతుగా నిలవని వారంతా చంద్రబాబుకు దగ్గర అనీ, ఆయనతో కుమ్మక్కు అయ్యారనీ గట్టిగా నమ్మడమే కాకుండా ప్రపంచం కూడా నమ్మాలని కోరుకుంటారు జగన్.  తన అడ్డా అనుకున్న పులివెందులలో వైసీపీ చతికిల పడటం, తన ఖిల్లా అనుకున్న పులివెందుల బీటలు వారడంతో ఆయన ఇక తనకు ఉగాదులు లేవు, ఉషస్సులు లేవన్న నిర్వేదంలో పడిపోయారు  జగన్.  ఇప్పుడు ఆయన  ప్రపంచం అంతా తనపై పగబట్టిందన్న భ్రమల్లో మునిగిపోయారు. దీంతో కోడిగుడ్డుకు, బోడిగుండుకు ముడిపెడుతున్న చందంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ బుధవారం (ఆగస్టు 13) మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా జగన్ తనకూ, తన పార్టీకీ అన్యాయం జరుగుతున్నా ఎవరూ వచ్చి  ఖండించడం లేదని ఆక్రోశం వెలిబుచ్చారు. కాంగ్రెస్ కీలక నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా ఎవరూ కూడా తనకు జరిగిన అన్యాయాన్ని, పులివెందులలో తన పార్టీ పట్టు కోల్పోవడాన్ని ఎందుకు ఖండించడం లేదని నిలదీస్తున్నారు. ఇంత కాలం తాను దత్తపుత్రుడిగా సహకారం అందించిన ప్రధాని మోడీసైతం మౌనంగా ఉండటాన్ని ప్రశ్నిస్తున్నారు. అంతే కానీ.. రాష్ట్రంలో ఇప్పుడు తన పరిస్థితికి కానీ, వైసీపీ పతనానికి కానీ కారణం తానేనన్న విషయాన్ని ఇసుమంతైనా గుర్తించడానికి నిరాకరిస్తూ.. తనకు మద్దతుగా నిలవని వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. శాపనార్ధాలు పెడుతున్నారు. అయితే పిల్లి శాపనార్ధాలకు ఉట్టితాళ్లు తెగిపడవన్న సమెతను గుర్తుకు తెచ్చేలా మాట్లాడుతున్నానని గ్రహించలేకపోతున్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు చంద్రబాబుతో నిత్యం హాట్ లైన్ లో మాట్లాడుకుంటూ.. తన పతనానికి కుట్రలు చేస్తున్నారని పులివెందుల ఎమ్మెల్యే యువజన శ్రామిక రైతు పార్టీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలు నవ్వు తెప్పిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆయన సొంత చెల్లి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు నిత్యం జగన్ పై చేస్తున్న విమర్శలకు జగన్ ముందుగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు.   అయినా జగన్ కు ఎవరైనా ఎందుకు మద్దతుగా నిలుస్తారని ప్రశ్నిస్తున్నారు. జగన్ గత ఏడాది ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ సహా బీజేపీయేతర పార్టీలన్నీ మద్దతుగా నిలిచాయి. అయితే అదే  బీజేపీయేతర పార్టీలు మోడీకి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలకు జగన్ ఇసుమంతైనా మద్దతు ఇవ్వలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.  అంతే కాదు.. ఇప్పుడు పులివెందులలో రిగ్గింగు, పోలింగ్ బూత్ ల మార్పు అంటూ గగ్గోలు పెడుతున్న జగన్.. రాహుల్ గాంధీ ఓట్ల చోరీకి వ్యతిరేకంగా హస్తినలో చేపట్టిన ఆందోళనలో పాల్గొనడం అటుంచి కనీసం మద్దతు కూడా ప్రకటించలేదన్న విషయం ఎలా మరచిపోయారు?
పులివెందుల పులి.. పిల్లి కూతలు Publish Date: Aug 13, 2025 5:09PM

కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు

  సుప్రీంకోర్టు సంచలన తీర్పు  ఇచ్చింది.  గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ కోదండరాం, అలీ ఖాన్ నియామకం రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. తమ అభ్యర్థిత్వాన్ని  గవర్నర్ వ్యతిరేకించడం కొత్తగా వీరిని నియమించడాన్ని సవాల్ చేస్తు బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్ లపై సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది.  తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. ఖళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాల్లో నామినేషన్లు తమ తుది తీర్పుకు లోబడే ఉంటాయిని సుప్రీం పేర్కొన్నాది. వీరిద్దరూ తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియామకం అయిన విషయం తెలిసిందే. అయితే, వీరి నియామకం అక్రమంగా జరిగిందని.. విచారణ జరిపి నియామకాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టు, సత్యనారాయణలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు
కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు Publish Date: Aug 13, 2025 5:00PM

మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం

  తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ తాజాగా ప్రకటించిన ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ – 2025 జాబితాలో ఆయనకు చోటు లభించింది. తమ సమర్థవంతమైన నాయకత్వం, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహామిస్తూ భారత్ ను ఏఐ రంగంలో అగ్రగామిగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్న వ్యక్తులకు ఇందులో చోటు కల్పించారు.  విధాన రూపకర్తల విభాగంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, పీయూష్ గోయల్, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఇండియా ఏఐ మిషన్ సలహాదారు ఆకృత్ వైష్, ఇండియా ఏఐ మిషన్ సీఈవో, ఎన్ఐసీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, ఎన్ పీసీఐ సీఈవో దిలీప్ అస్బే, నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్, నాస్కామ్ మాజీ అధ్యక్షులు దేబజాని ఘోష్ తదితర ప్రముఖులను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. * ఏఐ రంగంలో రోల్ మోడల్ గా తెలంగాణ * మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో ఏఐ రంగంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ మారిందని, అందుకే ఆయనను ఈ జాబితాలో చేర్చినట్లు అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ నిర్వాహకులు ప్రకటించారు. ‘బాధ్యతాయుతమైన ఏఐ అమలు కోసం సమగ్ర ఏఐ ఆధారిత తెలంగాణ స్ట్రాటజీ అండ్ రోడ్ మ్యాప్ ను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించారు. గుడ్ గవర్నెన్స్, నూతన ఆవిష్కరణలు, సురక్షితమైన డేటా షేరింగ్‌ను ప్రోత్సహించేలా దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్ ను ప్రారంభించేందుకు చొరవ చూపారు’ అని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబును కొనియాడారు.  ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్ నిర్వహణలోనూ మంత్రి శ్రీధర్ బాబు కీలకంగా వ్యవహరించారు. తెలంగాణలో ఏఐ ఎకో సిస్టమ్ ను మరింత బలోపేతం చేసేలా 2025–26లో 100 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఆర్ అండ్ డీ, నూతన ఆవిష్కరణలు, అత్యంత నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేయాలనే సంకల్పంతో ఏర్పాటు కానున్న ఏఐ యూనివర్సిటీ విషయంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు’ అని ప్రశంసించారు. ఏఐ రంగంలో తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమయ్యేలా మంత్రి శ్రీధర్ బాబుకు దక్కిన ఈ గుర్తింపు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. * సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహాంతోనే ఈ గుర్తింపు : మంత్రి శ్రీధర్ బాబు  ఇది నా ఒక్కడికి లభించిన గుర్తింపు కాదు. యావత్తు తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం. సమ్మిళిత వృద్ధి, మెరుగైన జీవితాలను అందించేందుకు ఏఐని వినియోగించాలన్న మా ప్రభుత్వ సుదూర దృష్టికి ఈ గుర్తింపు నిదర్శనం. సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతోనే నాకు ఈ జాబితాలో చోటు దక్కింది. ఆయన నాయకత్వంలో తెలంగాణను ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్ గా తీర్చిదిద్దేలా పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. నూతన ఆవిష్కరణలకు సమానత్వాన్ని జోడించి, సాంకేతిక పురోగతి ఫలితాలు రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.  
మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం Publish Date: Aug 13, 2025 4:40PM

చైతన్యపురి మెట్రో స్టేషన్‌కు జప్తు నోటీసు

  హైదరాబాద్‌లో చైతన్యపురి మెట్రో స్టేషన్‌కు విద్యుత్ శాఖ అధికారులు జప్తు నోటీసులు జారీ చేశారు. రూ. 31,829  కరెంట్ బకాయి ఉన్నట్లు విద్యుత్ సంస్థ పేర్కొంది. 2015 జులై 23వ తేదీన మెట్రో పనుల కోసం విద్యుత్తు కనెక్షన్‌ను మెస్సర్స్ థేల్స్ ఇండియా ప్రైవేటు ఏజెన్సీ తీసుకుంది. ఆ తర్వాత ఆ ఏజెన్సీ వెళ్లిపోయింది.  2021 డిసెంబరు నాటికి బకాయి పడిన వినియోగదారుల నుంచి వసూలుకు టీజీ ఎస్పీడీసీఎల్ చర్యలు చేపట్టింది. మెట్రో కోసం పని చేసిన ఈ ఏజెన్సీ మెస్సర్స్ థేల్స్ చిరునామా, నంబరును గుర్తించడానికి జప్తు నోటీసును విద్యుత్ సంస్థ అధికారులు చైతన్యపురి మెట్రో రైలు స్టేషన్‌‌లో అంటించారు. విద్యుత్ కనెక్షన్‌కు రూ.31,829 బకాయిలు తీసుకున్న థేల్స్ కంపెనీ అడ్రస్ తెలియకపోవటంతో  జప్తు నోటీసును మెట్రో స్టేషన్‌కు ఇచ్చారు  
 చైతన్యపురి మెట్రో స్టేషన్‌కు జప్తు నోటీసు Publish Date: Aug 13, 2025 4:31PM

డిసెంబర్ 31 లోగా జిల్లాల పేర్లు, సరిహద్దులు ప్రకటన

  అమరావతి  సచివాలయంలో జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై మంత్రుల బృందం ఇవాళ తొలిసారిగా సమావేశం నిర్వహించారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులపై సెప్టెంబర్ 15వ తేదీ నాటికి తుది నివేదిక ఇవ్వాలని మంత్రుల భేటిలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 29, 30 తేదీల్లో ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో పర్యటించి ప్రజా ప్రతినిధులు, ప్రజల నుండి మంత్రుల బృందం వినతులు స్వీకరించనున్నారు. ఈలోపు కూడా ప్రజలు తమ వినతులను జిల్లా కలెక్టర్ కు పంపించవచ్చుని వారు తెలిపారు.  సెప్టెంబర్ రెండో తేదీ వరకు మాత్రమే ప్రజలు, ప్రజాప్రతినిధుల నుండి వినతులు స్వీకరిస్తారు. గత వైసీపీ ప్రభుత్వం గందరగోళంగా చేసిన జిల్లాల పునర్వీభజనను సరిచేసేందుకే మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపిన మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. డిసెంబర్ 31లోపు జిల్లాల పేర్లు, సరిహద్దుల  మార్పులు ప్రక్రియ ముగిస్తామని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా మార్పులు  కోసం కసరత్తు చేస్తామని వారు పేర్కొన్నారు.  రెవెన్యూ గ్రామాలు, మండలాలు, డివిజన్లు, జిల్లాలకు సంబంధించిన మార్పులపైన మంత్రుల  బృందం పని చేస్తుందని వెల్లడించారు. నియోజకవర్గాల జోలికి వెళ్లబోమన్న మంత్రి అనగాని స్పష్టం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని కూడా తాము పరిశీలిస్తామని...అయితే పరిపాలనా సౌలభ్యమే గీటురాయి అన్న  మంత్రి అనగాని తెలిపారు.ఈ సమావేశానికి  మంత్రులు అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, వంగలపూడి అనిత, బిసి జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ పాల్గోన్నారు.
డిసెంబర్ 31 లోగా జిల్లాల పేర్లు, సరిహద్దులు ప్రకటన Publish Date: Aug 13, 2025 3:58PM