కృష్ణా నదికి వరద.. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

ఎగువ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా  కురుస్తున్నవర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగింది.   విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. దీంతో  ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి 3,63,438 క్యూసెక్కుల నీటిని దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.    

వరద ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో  కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ   హెచ్చరికలు జారీ చేసింది. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 
ఇలా ఉండగా శ్రీశైలం జలాశయానికి కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం పోటెత్తున్న కారణంగా  ఏడు గేట్లు   ఎత్తి  నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎత్తున వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu