పులివెందులలో తెలుగుదేశం ఘన విజయం

కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి ఘన విజయం సాధించారు. తెలుగుదేశం అభ్యర్థి  6 వేల 52 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పులివెందుల తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి సతీమణి  లతారెడ్డి ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.  

ఓట్ల లెక్కింపు ప్రారంభమైన క్షణం నుంచీ తెలుగుదేశం కు ఇక్కడ స్పష్టమైన ఆధిక్యత కనిపించింది. ఏ దశలోనూ వైసీపీ అభ్యర్థి పుంజుకునే పరిస్థితి కనిపించలేదు. తెలుగుదేశం అభ్యర్థికి  6735 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 683 ఓట్లు వచ్చాయి. పరాభవాన్ని, పరాజయాన్ని ముందుగానే అంచనా వేసిన వైసీపీ బహిష్కరణ  అంటూ పలాయనం చిత్తగించింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu