మోకాళ్లను సంవత్సరాల తరబడి సేఫ్‌గా ఉంచే సూపర్ టిప్స్ ఇవి..!

 

వయసు పెరిగే కొద్దీ  ఎముకలు పెళుసుగా,  బలహీనంగా మారతాయి. అయితే అనుసరించే జీవనశైలి,  అలవాట్లు బలమైన ఎముకలకు,  శరీరం  సాఫీగా కదలడానికి దోహదం చేస్తాయి. చాలా మంది మోకాళ్ సమస్య వచ్చేవరకు మోకాళ్ల గురించి అస్సలు ఆలోచించరు. కానీ శరీర బరువును మోసేవి కాళ్లు. ఆ భారం ఎక్కువగా మోకాళ్ల మీద ఉంటుంది. అందుకే ఒక వయసు దాటగానే మోకాళ్లు నొప్పులు రావడం,  లేక ఇతర మోకాళ్ల సంబంధ సమస్యలు రావడం జరుగుతుంది.  అయితే మోకాళ్లను సంవత్సరాల తరబడి ఎలాంటి సమస్యలు చట్టు ముట్టకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ పాటించాలి. ఇవన్నీ లైప్ స్టైల్ అలవాట్లలో భాగమే.. అవేంటో తెలుసుకుంటే..

బరువు..

కొంచెం అదనపు బరువు ఉన్నా అది  మోకాళ్లపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రతి అడుగుతో  శరీర బరువుకు నాలుగు రెట్లు ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం వల్ల ఈ ఒత్తిడి తగ్గుతుంది.  దీర్ఘకాలిక గాయం అయ్యే అవకాశాలు తగ్గుతాయి.

మూవ్ మెంట్..

తరచుగా కదలికలు చేయడం వల్ల  మోకాళ్లను సరళంగా ఉంచుకోవచ్చు. అంతేకాదు  కీళ్ళు కూడా  మంచి స్థితిలో ఉంటాయి. నడక, ఈత, సైక్లింగ్ లేదా యోగా వంటి తక్కువ ప్రభావ వ్యాయామాలు మోకాళ్లకు సున్నితంగా  ఉంటాయి. మోకాళ్ల మీద ఒత్తిడి ఉండదు.  కానీ మోకాళ్లను  బలంగా మారుస్తాయి.

కండరాల సపోర్ట్..

దృఢమైన కాళ్ళ కండరాలు, ముఖ్యంగా  హామ్ స్ట్రింగ్స్,  క్వాడ్స్,  మోకాళ్ల నుండి ఒత్తిడిని తగ్గిస్తాయి.  వ్యాయామ నియమావళిలో బాడీ వెయిట్ స్క్వాట్‌లు, లెగ్ రైజ్‌లను చేర్చడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.  ఇవన్నీ చేసేటప్పుడు గాయం కాకుండ ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలి.

మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలు బిగుతుగా ఉండటం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయి. ప్రతిరోజూ స్ట్రెచింగ్స్, ముఖ్యంగా  తొడలు, పిక్కలు,  తుంటిని వదులుగా,  స్ట్రయిట్ గా   ఉంచుతుంది. వ్యాయామం తర్వాత లేదా  రోజు చివరిలో వేగవంతమైన స్ట్రెచింగ్ ను  డైలీ రొటీన్ లో భాగం చేసుకోవాలి.

షూస్..

 నడవడం లేదా వ్యాయామం చేయడం వంటివి చేసేటప్పుడు  మంచి ఆర్చ్ సపోర్ట్,  కుషనింగ్ ఉన్న బూట్లు ధరించాలి. బాగు్నాయి కదా అని పాత షూస్ ను వర్కౌట్స్ కు సరిపడకపోయినా వేసుకుంటే ఆ తరువాత నష్టాలు ఎదురుచూడాల్సి రావచ్చు. మరొక విషయం ఏమిటంటే.. ఎక్కువసేపు హీల్స్ ధరించకూడదు.

ఫోజ్ మార్చుకోవాలి..

ఫోజ్ ను భంగిమ అని కూడా  అంటారు.  సరైన భంగిమ కాకుండా వ్యాయామం చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు ఫోజ్ లు పెడుతుంటే అది   వీపును గాయపరచడమే కాకుండా,  మోకాలి అమరికను కూడా దెబ్బతీస్తుంది. నిటారుగా నిలబడాలి, నిటారుగా కూర్చోవాలి. అలాగే వ్యాయామం అయినా వాకింగ్ అయినా, యోగా అయినా వాటికి తగిన విధంగా శరీరాన్ని బ్యాలన్స్ చేయాలి. అలాగే  బరువులు ఎత్తేటప్పుడు కూడా ఫోజ్ చూసుకోవాలి.

                       *రూపశ్రీ.

 

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu