కొత్త పేట ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం
posted on Aug 14, 2025 6:34AM

కొత్తపేట ఎమ్మెల్యే, తెలుగుదేశం నాయకుడు బండారు సత్యానందరావు కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో బుధవారం (ఆగస్టు 13) ఆలమూరులో జరిగిన రైతు సంబరాలకు విచ్చేసిన ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. వేలాదిగా తరలివచ్చిన రైతుల మధ్యన ఆయన ఎడ్ల బండి ఎక్కి నినాదాలు చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఎడ్లబండికి బండికి కట్టిన బెలూన్లు పేలాయి. దీంతో ఎద్దులు ఒక్కసారిగా బెదిరి కదిలాయి.
దీంతో ఆ బండి మీద ఉన్న ఎమ్మెల్యే సహా రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, కోనసీమ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు చిలువూరి సతీష్ రాజు తదితరులు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో చిలువూరి సతీష్ కు కాలు ఫ్యాక్చర్ అయ్యింది. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్యే కూడా స్వల్పంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదం తరువాత కూడా ఆయన రైతు సంబరాల్లో పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. రాగా ప్రమాద వార్త తెలుసుకున్న మంత్రులు నారా లోకేష్, అచ్చెంనాయుడు
ప్రమాద వార్త తెలిసిన వెంటనే విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చంనాయుడు ఫోన్లో ఎమ్మెల్యే బండారును పరామర్శించారు.