ముగిసిన మంచు లక్ష్మి ఈడీ విచారణ

 

దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్ కేసులో ఈడి విచారణ కొనసాగుతున్నది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసిన ప్రముఖులందరికీ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే దగ్గుపాటి రానా, విజయ్ దేవరకొండ , ప్రకాష్ రాజ్ లను ఈడి విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఈరోజు సినీనటి మంచు లక్ష్మి ని కూడా ఈడి విచారణ చేస్తు న్నారు. మంచు లక్ష్మి గేమింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లుగా అధికా రులు గుర్తించారు. ఈజీగా డబ్బు సంపాదించుకో వచ్చు అంటూ సోషల్ మీడియాలో మంచు లక్ష్మి ప్రమో షన్లు చేసినట్టుగా గుర్తించిన ఈ డి ఆమెకు నోటీసులు జారీ చేశారు. 

ఈ క్రమంలోనే మంచు లక్ష్మి ఈరోజు ఉదయం 11:30 గంటల ప్రాంతం లో ఈడి కార్యాల యానికి చేరుకు న్నారు. ఇంకా విచారణ కొనసా గుతున్నది. మంచు లక్ష్మి yolo 247 బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసిన ట్లుగా ఆరోపణలు నేపథ్యంలో అధికారులు వాటి ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీల వివ రాలు సేకరిస్తు న్నారు.. మంచు లక్ష్మిపై పలు ప్రశ్నల వర్షం కురిపిస్తు న్నారు. ఇదిలా ఉండగా మరోవైపు దేశ వ్యాప్తంగా ఉన్న పలు బెట్టింగ్ యాప్ సంస్థల కార్యాల యాల్లో ఈడి సోదాలు చేసింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, జైపూర్, మదురై తదితర 15 ప్రాంతాల్లో సోదాలు చేసి....అంతర్జాతీయ స్పోర్ట్స్, బెట్టింగ్ సంస్థ పరిమ్యాచ్ పేరుట అక్రమంగా బెట్టింగ్ నిర్వహిస్తు న్నట్లుగా ఈడి గుర్తించింది. 

దాదాపు 2000 కోట్ల లావాదేవీలు చోటు చేసుకున్నట్లుగా ఈడి ప్రాథమిక దర్యాప్తులో వెల్ల డైంది.దీంతో ఈడి దేశవ్యాప్తంగా బెట్టింగ్ ఆప్ కేసులో పలువురిని  విచారణ చేస్తుంది..  ఈ క్రమంలోనే 1XBET యాప్ ప్రమోట్ చేసినం దుకు క్రికెటర్ సురేష్ రైనాను అధికారులు ఢిల్లీలో విచారిస్తు న్నారు. ఇప్పటికీ రణధీర కపూర్, కపిల్ వర్మ, హుమా ఖురేషి, హీనా ఖాన్ లతోపాటు పలు వురు సెలబ్రిటీలకు సమన్లు జారీ చేసింది. అధికారులు క్రికెటర్ యువరాజ్ సింగ్,  హర్భజన్ సింగ్ , సినీ నటుడు సోను సూద్ లను త్వరలో విచారించనున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రకటనలో అనుమతించినందుకు ఫేస్బుక్ (మెటా) గూగుల్ సంస్థలకు కూడా ఈడి సమన్లు జారీ చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu