అసెంబ్లీకి గైర్హాజరై.. ప్రజాస్వామ్యం గురించి కబుర్లేంటి.. జగన్ పై అయ్యన్న ఫైర్

ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పే మీరు అసలు అసెంబ్లీకి వస్తారో రారో క్లారిటీ ఇవ్వండంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్ పై ఫైర్ అయ్యారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారా? రారా క్లారిటీ ఇవ్వాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల తీరు వల్ల ప్రశ్నలు మురిగిపోతున్నాయని మండి పడ్డారు.   ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి.. ముందు ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని  సూటిగా ప్రశ్నించారు.

మాజీ ముఖ్యమంత్రి, ఆయన పార్టీ సభ్యులు ప్రజాస్వామ్య దేవాలయం లాంటి అసెంబ్లీకి ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు.  జగన్ హయాంలో అసెంబ్లీలోని ప్రింటర్లలాగత ఐదేళ్లలో అసెంబ్లీలోని ప్రింటర్లు తుప్పు పట్టినట్టే సభ కూడా తుప్పు పట్టింది. జగన్ ఐదేళ్ల హయాంలో అసెంబ్లీ కేవలం 75 పనిదినాలు మాత్రమే నడిచిందన్న ఆయన తెలుగుదేశం కూటమి హయాంలో ఇప్పటికే  31 రోజులు సమావేశాలు జరిగాయన్నారు. ఈ నెల 17 లేదా 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలన్న కనీస స్ఫృహ లేని వైసీపీ అధినేత జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అయ్యన్న పాత్రుడు విమర్శించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu