మూసీ వరద ముప్పు.. అధికారులు అప్రమత్తం
posted on Aug 14, 2025 10:13AM

ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీకి వరద పోటెత్తుతోంది. అలాగే హిమాయత్ సాగర్ కు అన్ని గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ నది ప్రవాహం ఉధృతంగా ఉంది. అధికారులు అప్రమత్తమై మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. మూసీనదికి ఆనుకొని ఉన్న కాలనీ వాసులందరూ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు చేశారు.
లోతట్టు ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. వరద పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరో 24 గంటల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే స్కూళ్లకు హాఫ్ డే సెలవు ప్రకటించారు.