సబితా ఇంద్రారెడ్డికి బిగ్ షాక్..ఎందుకంటే?

 

మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి  సీబీఐ అధికారులు షాక్ ఇచ్చారు.. ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు  నిర్దోషిగా ప్రకటించింది. సిబిఐ కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ.. సీబీఐ అధికారులు హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేసింది..  సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ఆమెపై విచారణకు ఆదేశించాలని హైకోర్టుని కోరింది.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది..ఓఎంసీ కేసులో సబితను నిర్దోషిగా ప్రకటించడాన్ని   హైకోర్టు లో సీబీఐ సవాల్ చేసింది.. సబితతోపాటు మాజీ ఐఎస్ఐ అధికారి కృపానందంపైనా కూడా సీబీఐ పిటిషన్‌ వేసింది.

 సిబిఐ వేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.. కేసు విచారణ వాయిదా వేసింది..ఓఎంసీ కేసులో సబిత, కృపానందంలను గతంలో నిర్దోషులు గా ప్రకటించిన సీబీఐ కోర్టు..గాలి జనార్దన్‌రెడ్డి సహా ఇతర నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ సీబీఐ కోర్టు గతంలోనే తీర్పించింది..  ఇప్పటికే ఐఏఎస్ శ్రీలక్ష్మి పాత్రపై మళ్లీ విచారణ జరపాలని గతంలో హైకోర్టు ఆదేశం జారీ చేసింది.. ఇప్పుడు సబిత, కృపానందం ల కేసు పైన హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu