పులివెందులలో జగన్ అరాచకాల నుంచి ప్రజలు బయటపడుతున్నారు : సీఎం చంద్రబాబు

 

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయి. కాబట్టే 11 మంది నామినేషన్లు వేశారు. 30 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగరాశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఓటు వేశామనే స్లిప్పులు పెట్టారు. అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఆలోచించాలి. జగన్ అరాచకాల నుంచి పులివెందుల ప్రజలు ఇప్పుడే బయటపడుతున్నారు. ఈ విజయం పట్ల నేతలంతా స్పందించాలిని సీఎం చంద్రబాబు ఆదేశించారు.జగన్ అరాచకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారని చంద్రబాబు చెప్పారు. 

పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,035 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కకపోవడంతో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మరోవైపు  లతారెడ్డిని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అభినందించారు. చాలా అద్బుత విజయం సాధించారు. సంతోషంగా ఉంది. మీ విజయంతో పార్టీలో చాలా జోష్ ఇంకా ఎక్కువ కదా. అందరం తెలుగు దేశం పార్టీ ఫ్యామిలీ అని భువనేశ్వరి లతారెడ్డితో ఫోన్‌లో అన్నారు. స్వయంగా సీఎం భార్య ఫోన్ చేసి అభినందించడంతో లతారెడ్డి సంతోషంలో మునిగిపోయారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu