వచ్చే ఎన్నికల్లో జగన్ పోటీ అనుమానమే అంటున్న పయ్యావుల

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలు లేవనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  వివిధ కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ కు శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని గతంలో ఒక ఇంటర్వ్యూలో మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అనుమానం వ్యక్తంచేశారు.  అది వాస్తవ రూపం దాల్చే అవకాశం బలంగా కనిపిస్తోంది.  రాష్ట్ర ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ మాటలు దీని బలం చేకూర్చే విధంగా ఉన్నాయి.

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై విలేకరుల సమావేశంలో చంద్రబాబు పై మాట్లాడిన జగన్మోహనరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన కేశవ్ వచ్చే ఎన్నికల్లో జగన్ పోటీకి అర్హత ఉంటుందా అనే బాంబు పేల్చారు.  ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం గతంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలపై పక్కా ఆధారాలతో కేసులు నమోదు చేస్తోంది. ప్రధానంగా లిక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ ను అరెస్ట్ చేయడానికి పెద్ద ప్లాన్ వేసినట్లుగా సమాచారం. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై విలేకరులతో మాట్లాడిన జగన్, చంద్రబాబుకు జీవితంలో ఇవే చివరి ఎన్నికలు అవుతాయనీ,  చనిపోయాక నరకానికి పోతారని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేశవ్ చంద్రబాబు మరో పదేళ్లు రాజకీయాల్లో కీలకంగా, క్రియాశీలంగా  ఉంటారని చెప్పారు. ఇదే సమయంలో జగన్ వచ్చే ఎన్నికల్లో పోటీచేయడానికి అర్హత ఉంటుందా అంటూ వ్యాఖ్యానించారు.

అంటే త్వరలోనే జగన్ ను అరెస్టు  చేసి శిక్ష పడేవిధంగా చర్యలు ఉంటాయని నర్మగర్భంగా చెప్పారు. దీంతో జగన్ పట్ల కూటమి ప్రభుత్వం పెద్ద ప్లాన్ తోనే ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతల  విషయంలో ప్రభుత్వం కేసుల నమోదుకు ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొందరు నేతలు అరెస్ట్ ల భయంతో కొంతకాలం పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తమను ఎప్పడు అరెస్టు చేస్తారోనని భయంతో వణికిపోతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu