English | Telugu
దర్శకేంద్రుడు మాట్లాడిన వేళ.. సిరి కల నెరవేరిన వేళ!
Updated : Jul 14, 2022
బిగ్ బాస్ ఫాలో అయ్యేవాళ్ళకు సిరి హన్మంత్ ఎవరో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ సిరి. ఆమె యూట్యూబ్ లో 'మేడం సర్.. మేడం అంతే, 'గందరగోపాళం', 'రాంలీలా' వంటి వెబ్ సిరీస్ లో నటించింది. అలాగే ఎవరి నువ్వు మోహిని, అగ్నిసాక్షి, సావిత్రమ్మ గారి అబ్బాయి వంటి సీరియల్స్ కూడా చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇటీవల సిరి నటించిన #బిఎఫ్ఎఫ్ వెబ్ సిరీస్ సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. ఆహా ఓటిటిపై ఈ వెబ్ సిరీస్ ప్రసారమయ్యింది.
ఈ స్టోరీ లైన్ విషయానికి వస్తే ఇద్దరమ్మాయిలు జాబ్ కోసం సిటీకి వస్తారు.అలా అనుకోకుండా ఫ్రెండ్స్ అవుతారు. ఇద్దరూ కలిసి ఒకే ఫ్లాట్ లో ఉంటూ లైఫ్ ని ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది అనేది స్టోరీ. సిరి హన్మంత్, రమ్య పసుపులేటి కలిసి నటించిన ఈ సీరీస్ కి మంచి మార్క్స్ పడ్డాయి.
ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ సక్సెస్ ఐన సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సిరికి కాల్ చేసి అభినందించారట. ఆయన స్వయంగా తనతో మాట్లాడ్డం కలవడం చేసేసరికి తన ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది. "ఈ రోజు నా కల నెరవేరింది. రాఘవేంద్రరావు గారు కాల్ చేసి నన్ను అప్రిషియేట్ చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మీరు నాకు చెప్పిన ఈ మాటలు ఎప్పటికీ మర్చిపోను" అంటూ ఆయనతో కలిసి దిగిన ఫోటోతో కలిపి తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసింది.