English | Telugu
నెటిజన్ల మతులు పోగొడుతున్న దీపిక గెంతులు!
Updated : Jul 14, 2022
దీపికా పిల్లి ఇటీవల బుల్లితెర మీద బాగా వినిపిస్తున్న పేరు. యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ, వెబ్ సిరీస్ లో నటిస్తూ పేరు తెచ్చుకున్న దీపికఇప్పుడు 'వాంటెడ్ పండుగాడ్' అనే మూవీలో సుడిగాలి సుధీర్ తో కలిసి నటించేసింది కూడా. ఇక ఇప్పుడు దీపిక ఒక హీరోయిన్ రేంజ్ కి వెళ్లిపోయేసరికి అందాల డోస్ పెంచేసింది. పొట్టి బట్టలు వేసి అందరిని అలరిస్తోంది. షోస్ లో ఇరగదీసే స్టెప్స్ వేసి అందరిలో హీట్ పుట్టిస్తోంది.
దీపికకు హీరోయిన్ అయ్యే అవకాశాలు ఇంకా ఎన్నో వస్తాయని దర్శకేంద్రుడు కితాబిచ్చారు కూడా. ఇక ఇప్పుడు దీపిక సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటోంది. మున్నార్ లో ఉంటూ అక్కడి నేచర్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తోంది. చుట్టూ కొండల్ని కోనల్ని చూస్తూ మైమరిచిపోతోంది. అక్కడ కురుస్తున్న వానలో తడుస్తూ వెదర్ డిమాండ్ చేస్తోంది కాబట్టి సూపర్ డాన్స్ చేస్తున్నాను అన్నట్టుగా ఒక కాప్షన్ పెట్టి "కురిసింది మేఘం మేఘం" హిందీ వెర్షన్ సాంగ్ కి ఐశ్వర్య రాయ్ వేసినట్టుగా స్టెప్పులేసి ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసుకుంది.
ఇప్పుడు ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫిదా ఐపోతున్నారు. టిక్ టాక్ ద్వారా ఎంతో మందిసోషల్ మీడియా స్టార్స్ ఇపోయారు. ఇది ఎంతో మందిలోని టాలెంట్ ని బయటికి తీసిన ఒక యాప్. దీపిక పిల్లి కూడా ఇలాగే పాపులర్ ఐన ఒక అమ్మాయి. ఆ క్రేజ్ తోనే ఈటీవీ వంటి సంస్థలో ఆఫర్ ని దక్కించుకుని పేరు సంపాదించుకుంది.