English | Telugu

వేణుకి రెండుసార్లు హ్యాండ్ ఇచ్చిన పూరి!

'స్వయంవరం' మూవీ అంటే చాలు వేణు గుర్తొస్తాడు. కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు. హనుమాన్ జంక్షన్, చెప్పవే చిరుగాలి, చిరునవ్వుతో, పెళ్ళాం ఊరెళితే, కల్యాణ రాముడు వంటి మూవీస్ లో యాక్ట్ చేసాడు వేణు. ఐతే తర్వాత సినిమాలు చేయడం చాలా తగ్గించేసాడు. ఇక ఇప్పుడు రవితేజ మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ'లో నటిస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ కి సిద్ధమౌతోంది. ఇందులో సీఐ మురళి రోల్ లో నటిస్తున్నాడు.

దీంతో వేణు ఈ మూవీ ప్రమోషన్స్ అనేవి స్టార్ట్ చేసేసాడు. 'ఆలీతో సరదాగా' షోకి వచ్చి ఎన్నో విషయాలను అలీతో షేర్ చేసుకున్నాడు.ఒకప్పుడు డైరెక్టర్స్ కి ప్రామిసింగ్ హీరోలా మంచి హిట్స్ ఐతే అందించాడు. ఇప్పుడు వేణు కెరీర్ లో ఏమంత మంచి హిట్స్ పడడం లేదు. ఇప్పుడు చేసిన ఈ మూవీ తనకు ఎంత అదృష్టాన్ని తెస్తుందో చూడాలి అన్నాడు. ఇక వేణు తన హైట్ 6 అడుగుల 3 అంగుళాలు అని చెప్పాడు. ఐతే ఈ షో కి వెళ్ళమని వాళ్ళ అమ్మ చెప్పేసరికి తాను వచ్చానని చెప్పుకొచ్చాడు.

చదువుకునే వయసులో కంబైన్డ్ స్టడీస్ పేరుతో ఫ్రెండ్ ఇంటికి వెళ్లి అక్కడ చదువుకోకుండా ఎక్కువగా సినిమాలు చూసేవాడిన‌ని ఆనాటి రోజుల్ని గుర్తుచేసుకున్నాడు. ఇక ఈ విషయం ఇంట్లో తెలిసిపోయేసరికి వాళ్ళ నాన్న బెల్టు తెగేవరకు చితక్కొట్టేశారని చెప్పాడు. అలాగే తన వరకు వచ్చి మిస్ ఐన ఆఫర్స్ గురించి కూడా చెప్పాడు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ మొదట 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' మూవీ కథను తనకు చెప్పారట. ఏమయ్యిందో ఏమో కానీ చివరికి ఈ మూవీలో రవితేజని హీరోగా పెట్టుకున్నారు.

తర్వాత 'దేశముదురు' చిత్రంలో టీవీ యాంకర్ రోల్ నాకైతే బాగుంటుందని కథ మొత్తం చెప్పారు. కానీ సినిమాను మాత్రం తనతో చేయలేదని చెప్పాడు. ఈ రెండు విషయాల్లో చాలా బాధపడ్డాడట వేణు. మచిలీపట్టణం మాజీ ఎంపీ మాగంటి అంకినీడుకు తొట్టెంపూడి వేణు మేనల్లుడు అవుతాడు. ఇక భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అంశం గురించి కూడా ఈ షోలో చెప్పాడు వేణు. ఈ ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది.