English | Telugu
కైలాష్తో ఆట మొదలు పెట్టిన యష్!
Updated : Jul 15, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న `ఎన్నెన్నో జన్మలబంధం` సీరియల్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగుతూ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తూ విజయవంతంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్ని ట్విస్ట్ లు, టర్న్ లతో విశేషంగా ఆకట్టుకుంటోంది. నిరంజన్, డెబ్జాని మోడక్ జంటగా నటిస్తున్న ఈ సీరియల్లో బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ప్రణయ్ హనుమండ్ల, బేబీ మిన్ను నైనిక, ఆనంద్, సుమిత్ర, రాజా శ్రీధర్ కీలక పాత్రధారులు.
కైలాష్.. వేద ఫొటోలు చూస్తున్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన యష్ అతన్ని ప్రశ్నించడం మొదలు పెడతాడు. "సారిక తెలుసా?" అంటాడు. దానికి కైలాష్ "తెలుసు" అంటాడు. వెంటనే మాట మార్చి "వేద పరిచయం చేసింది" అంటాడు. అదంతా విన్న యష్, "పెరట్లో మొలిచింది పిచ్చి మొక్క అని తెలిసినప్పుడు దాన్ని పీకి పారేయాల్సిందే" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో కైలాష్ లో భయం మొదలవుతుంది. 'యష్ ఏంటీ ఇలా మాట్లాడుతున్నాడు? సారిక గురించి తెలిసిపోయిందా?.. ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలి' అనుకుంటాడు.
వెంటనే డౌట్ క్లియర్ చేసుకోవడానికి సారికకు ఫోన్ చేస్తాడు. "మన విషయం గురించి ఎవరైనా అడిగారా? లేక నువ్వే చెప్పావా?" అని బెదిరిస్తాడు. నేను ఎవరితో చెప్పలేదని, నువ్వు చెప్పినట్టే చేస్తున్నానని సారిక ఏడుస్తూ చెబుతుంది. ఇదంతా చాటుగా వుండి విన్న యష్ కు రక్తం మరిగిపోతుంది. ఎలాగైనా వీడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వీడి ఆట కట్టించాలని ఆట మొదలు పెడతాడు. వాడు పక్కకి వెళ్లిపోగానే యష్ వెళ్లి ఫోన్ చెక్ చేస్తాడు. ఆ తరువాత కైలాష్ రూమ్ కి వెళ్లి తనని బెదిరించి బెదిరించనట్టుగా మాట్లాడి "నీ గురించి అందరూ తెలుసుకుంటారు. మా అక్క కూడా" అంటూ వెళ్లిపోతాడు. దీంతో కైలాష్ మరింతగా భయాందోళనకు గురవుతాడు. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.