English | Telugu
'నన్ను లేపేయడానికి ప్లాన్ వేసుకో'.. మల్లెమాల అధినేతకు ఆర్పీ సవాల్!
Updated : Jul 14, 2022
రోజా వెళ్లిపోవడంతో జబర్దస్త్ కామెడీ షో కళ తప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఈ షో పైనా, ఈ షోని నిర్వహిస్తున్న నిర్వాహకులైన మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత శ్యామ్ ప్రసాద్‌రెడ్డిపైనా కమెడియన్ కిరాక్ ఆర్పీ సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. 'ఇటీవల సుడిగాలి సుధీర్ కు అక్కడ గత నాలుగేళ్లుగా దారుణ అవమానాలు జరుగుతున్నాయని, ఆ కారణంగానే అతను ఆ షోని వీడాడు' అంటూ కిరాక్ ఆర్పీ సంచలన ఆరోపణలు చేయడం వాటిని హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ ఖండించడం తెలిసిందే. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిరాక్ ఆర్పీ ఏకంగా నిర్మాత ఎం.శ్యామ్ ప్రసాదరెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేయడం ఆసక్తికరంగా మారింది.
ఈ సందర్బంగా కమెడియన్ కిరాక్ ఆర్పీ నిర్మాత శ్యామ్ ప్రసాదరెడ్డిపై నిప్పులు చెరిగాడు. భారతదేశం గర్వంచదగ్గ నిర్మాత ఎం.ఎస్ రెడ్డి అని, ఆయన కడుపున పుట్టిన శ్యామ్ ప్రసాదరెడ్డికి తండ్రి అంటూ విలువలేదని వ్యక్తిగత విమర్శలు చేశాడు. ఈ సందర్భంగా ఆయనకు సవాల్ విసిరాడు. "నేమ్ ఫేమ్ కోసమో.. సంచలనం కోసమో నేను ఇలా మాట్లాడటం లేదు. నాకు కష్టం విలువ తెలుసు. నేను ఇండస్ట్రీలో ఎదగడానికి వచ్చి అన్నపూర్ణ హోటల్ లో బాత్రూంలు కడిగాను." అంటూ చెప్పుకొచ్చాడు.
"నేను ఇప్పుడు శ్యామ్ ప్రసాద్‌రెడ్డిగారికి సవాల్ చేసి చెబుతున్నా.. తొక్కేస్తారు అని అంటున్నారు కదా.. నేను సినిమా తీస్తే ఆపుకో.. వెబ్ సిరీస్ తీస్తే ఆపుకో.. నన్ను లేపేయడానికి ప్లాన్ వేసుకో.. మా ఇంట్లో బౌన్సర్ లు లేరు. ఎప్పుడైనా రా నన్ను చంపుకో... నేను చస్తే సమాధి నుంచే ప్రశ్నిస్తా. ఇండస్ట్రీలో నేను ఎవరినీ ప్రశ్నించలేదు, జబర్దస్త్ లో ఎవరిని ప్రశ్నించలేదు. కానీ శ్యామ్ ప్రసాదరెడ్డినే ప్రశ్నిస్తున్నా... నేను పర్సనల్ విషయాలు మాట్లాడటంలేదు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి పర్సనల్ లైఫ్ లోకి వెళ్లానా?.. బానిస బతుకులు.. బానిస బతుకుల గురించే మాట్లాడుతున్నా".. అంటూ ఫైర్ అయ్యాడు కిరాక్ ఆర్పీ.. అతని కామెంట్స్ ఇప్పుడు సెన్సేషనల్‌గా మారాయి.