English | Telugu
బాలయ్య ఇక ఆగే పనే లేదు!
Updated : Jul 15, 2022
'అన్‌స్టాపబుల్' షో బాలయ్య బాబు రేంజ్‌ని వేరే లెవెల్‌కి తీసుకెళ్లింది. ఈ షో ద్వారా ఆయన ఓటిటిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఫేమస్ సెలబ్రిటీస్ పరిచయాలతో సీజన్ 1 సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో సీజన్ సెకండ్ ఎప్పుడెప్పుడా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. సెకండ్ సీజన్‌లో అద్దిరిపోయే సెలబ్రిటీస్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు బాలయ్య. ఆహా ఓటిటిపై ప్రసారమైన ఈ సీజన్ అంచనాలకు మించి సక్సెస్‌ని అందుకుంది. ఇక ఫైనల్‌గా మహేష్ బాబుతో సీజన్ వన్‌ని ఎండ్ చేశారు నిర్వాహకులు. ఇప్పుడు సీజన్ 2 వంతు వచ్చేసింది.
ఐతే సీజన్ 2ని మేకర్స్ ఆగస్ట్ రెండో వారంలో స్టార్ట్ చేయబోతున్నట్టుగా ఒక టాక్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. బాలయ్య జనరల్ షోలా కాకుండా, అందరిలా రొటీన్ ప్రశ్నలు అడగకుండా సంథింగ్ స్పెషల్ గా అడుగుతూ ఉంటారు. కాంట్రవర్సీ టాపిక్స్ మీద ఎన్నో రకాల సందేహాలను కూడా అడుగుతుండేసరికి ఈ ప్రోగ్రాంకి మంచి రేటింగ్ అనేది వచ్చింది. సీజన్ 1కి మించేలా మంచి ఎంటర్టైన్మెంట్‌తో సీజన్ 2ని తీసుకురాబోతున్నారట. ఈ షోకి ఫస్ట్ ఎపిసోడ్ గెస్టుగా మెగాస్టార్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఆఫీషియల్ న్యూస్ త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. బాలయ్య అభిమానులు, ఆడియన్స్ అంతా ఈ షో కోసం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు.