English | Telugu
తిలోత్తమ వల్ల నయని, విశాల్ వేరు కాబోతున్నారా?
Updated : Jul 14, 2022
ఆషికా గోపాల్, చందూగౌడ ప్రధాన జంటగా నటిస్తోన్న సీరియల్ `త్రినయని`. గత కొన్ని వారాలుగా జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఆసక్తికర మలుపులు, ట్వీస్ట్ లతో సాగుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రైమ్ టైమ్ లో ప్రసారం అవుతూ మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంటూ విజయవంతంగా ప్రసారం అవుతోంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సీరియల్ ని రూపొందించారు. ఇతరపాత్రల్లో పవిత్ర జయరామ్, నిహారిక హర్షు, భావనా రెడ్డి, విష్ణుప్రియ, ద్వారకేష్ నాయుడు, సురేష్ చంద్ర, అనిల్ చౌదరి, శ్రీసత్య తదితరులు నటించారు.
కసి కారణంగా ఆస్తులన్నీ పోగొట్టుకున్న తిలోత్తమ ఫ్యామిలీ అంతా విశాల్ - నయని ఇంట చేరతారు. కొత్త ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు హోమం చేయించాలని నయని ఏర్పాట్లు చేయిస్తుంది. అంతా కొత్త బట్టలు కట్టుకుని రెడీ అయిపోతారు. ఇదే సమయంలో నయనికి ఇంట్లో చేయబోతున్న హోమం కోసం తెచ్చిన ఇటుకల వల్ల విశాల్ కు ప్రమాదం వుందని తెలుస్తుంది. దీంతో పూజ జరుగుతుంటే ఆ ఇటుకల్ని పైన పెట్టిస్తుంది. ఇదే సమయంలో నయని చెల్లెలు సుమన ద్వారా నయనికి వున్న వరం గురించిన రహస్యాన్ని తిలోత్తమ తెలుసుకుంటుంది.
దీని ఆధారంగా నయనిని విశాల్ కు దూరం చేయాలని పథకం వేస్తుంది. విశాల్ పై ఇటుక పడుతుంటే తెలిగా అతన్ని తప్పించి తనకు గాయం అయ్యేలా చేసుకుంటుంది. దీంతో షాక్ కు గురైన విశాల్.. తిలోత్తమని హాస్పిటల్ కి తీసుకెళతాడు. అక్కడ బెడ్ పై అచేతనంగా పడివున్నట్టుగా యాక్టింగ్ మొదలు పెట్టిన తిలోత్తమ.. నయనిని టార్గెట్ చేస్తుంది. విశాల్ ముందు అడ్డంగా ఇరికించి తనపై అసహనాన్ని ప్రదర్శించేలా చేస్తుంది. ఉన్నట్టుండి విశాల్.. తిలోత్తమ కారణంగా తనపై అరవడంతో నయని చొచ్చుకుంటుంది. ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అంతా వెళ్లాక కసి, వల్లభతో తన అసలు కుట్రని బయటపెడుతుంది తిలోత్తమ. ఆ తరువాత ఏం జరిగింది?.. అన్నం ముద్దతో తిలోత్తమకు దిష్టితీస్తూ నయని ఏమని హెచ్చరించింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.