English | Telugu
ఫైమాకు రింగ్‌తో ప్రపోజ్ చేసి ప్రవీణ్!
Updated : Jul 15, 2022
జబర్దస్త్ కామెడీ షోలో బుల్లెట్ భాస్కర్ తో కలిసి ఫైమా చేసే హంగామా అంతా ఇంతా కాదు. తనదైన మార్కు హాస్యంతో ఆకట్టుకుంటూ హాస్యప్రియుల్ని తన స్కిట్ లతో నవ్విస్తూ మంచి పేరు తెచ్చుకుంది ఫైమా. ఇక తన తరహాలోనే కామెడీ టైమింగ్ తో స్పాట్ లో పంచ్ లేస్తూ తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు పటాస్ ప్రవీణ్. వీళ్లిద్దరూ కలిసి `శ్రీదేవి డ్రామా కంపెనీ`లోనూ తమదైన కామెడీ స్కిట్ లతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా పటాస్ ప్రవీణ్, ఫైమా ఎమోషనల్ అయ్యారు.
`శ్రీదేవి డ్రామా కంపెనీ` స్టేజ్ సాక్షిగా ఫైమాపై తనకున్న ప్రేమని పటాస్ ప్రవీణ్ బయట పెట్టాడు. ఫైమా వేలికి ఉంగరం తొడిగిన పటాస్ ప్రవీణ్ లవ్ ప్రపోజ్ చేయడం ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఫైమా తనకు ఎందుకు నచ్చిందో చెప్పుకొచ్చాడు. `మనకంటూ ఓ సొంత ఇల్లు వుండాలి. నేను అందులోనే చనిపోవాలి` అని ఫైమా వాళ్ల అమ్మ తనని కోరింది. ఆవిడ కోరికని ఫైమా తీర్చింది`అని వివరించాడు ప్రవీణ్. దీంతో ఫైమా భావోద్వేగానికి లోనైంది. ఆ తరువాత `ఫైమా మీ అమ్మకు చెప్పు అల్లుడొస్తున్నాడని` అంటూ పటాస్ ప్రవీణ్ పంచ్ వేయడంతో ఫైమా నవ్వేసింది.
అయితే నిజంగానే ప్రవీణ్ .. ఫైమాకు ప్రపోజ్ చేశాడా? లేక స్కిట్ లో భాగంగానే ఇలా చేశాడా అన్నది తెలియాలంటే ఆదివారం మధ్యాహ్నం 1:00 గంటకు ప్రసారం కానున్న `శ్రీదేవి డ్రామా కంపెనీ` చూడాల్సిందే. ఈ వారం స్పెషల్ స్కిట్ ని ప్లాన్ చేశారు. సంఘవి, ప్రగతి గెస్ట్ లుగా ఈ షోలో పాల్గొన్నారు. తాజాగా విడుదలైన ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది. సంఘవితో హైపర్ ఆది ఆడుకోవాలని చూడటం.. అదే సమయంలో మీకు రెండిస్తే బాగుంటుందని సంఘవి రివర్స్ పంచ్ వేయడం నవ్వులు పూయిస్తోంది.