English | Telugu
సుధీర్ ఎప్పుడూ నా మనసుకు దగ్గరగానే ఉంటాడు!
Updated : Jul 15, 2022
జబర్దస్త్ అనేది స్టార్ట్ అయ్యాక బుల్లితెర జోడీల పేరుతో కొన్ని జంటలు పిచ్చ ఫేమస్ అయ్యాయి. ఇద్దరి మధ్య ఏం ఉందో, ఏం లేదో అనే విషయాన్ని పక్కన పెడితే వాళ్ళ కెమిస్ట్రీ స్మాల్ స్క్రీన్ మీద పండేసరికి ఆడియన్స్ కూడా వాళ్ళను ఆరాధించడం మొదలుపెట్టారు. ఈ జోడీల్లో ఎవరైనా మిస్ ఐతే మాత్రం వాళ్లకు వీళ్ళు అస్సలు సరిపోలేదు అంటూ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. అలా స్క్రీన్ మీద ఫేమస్ ఐన జంటల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు సుధీర్-రష్మీ జంట. తర్వాత ఫైమా-ప్రవీణ్, తర్వాత వర్ష-ఇమ్మానుయేల్. వీళ్లంతా అభిమానులు ఇష్టపడే జంటలు.
కాగా రానున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోని ఒక రొమాంటిక్ షోగా మార్చేశారు.ఇందులో ఫైమా, ప్రవీణ్ పెళ్లి బట్టల్లో స్టేజి మీదకు వస్తారు. "ఐ లవ్ యు ఫైమా.. నువ్ ఒప్పుకుంటే ఈ రింగ్ నీ చేతికి పెడతాను" అంటూ రింగ్ పెడతాడు ప్రవీణ్.. ఆ ఇద్దరి మధ్య ఎప్పటినుంచో లవ్ ట్రాక్ నడుస్తోంది. వీటికి సంబంధించి ఎన్నో వీడియోస్ వైరల్ అయ్యాయి కూడా.
"ఫైమా జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చాక వాళ్ళ అమ్మ అడిగిన కోరిక ఒక్కటే.. 'ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి నేను అందులోనే చనిపోవాలి' అని. వాళ్ళ అమ్మ కోరికను ఫైమా నెరవేర్చింది. అందుకే నాకు ఫైమా అంటే చాలా ఇష్టం" అని చెప్పాడు ప్రవీణ్. "ఫైమా! మీ అమ్మకు చెప్పు అల్లుడొస్తున్నాడని" అని చెప్పాడు ప్రవీణ్.
గతంలో ఒక ఎపిసోడ్ లో వర్ష కూడా ఇమ్మానుయేల్ తో ఇదే మాట చెప్పింది. ఇదంతా చూసిన రష్మీ ఒక్కసారిగా ఎమోషన్ అయ్యింది. ఈ విషయంపై రష్మీ మీద హైపర్ ఆది జోక్స్ వేశాడు. "నువ్వేమన్నా మిస్ అవుతున్నావా.. నేను దూరం నుంచి నిన్ను చూశా. నువ్ కొంచెం ఎమోషనల్ ఐనట్టు కనిపించింది. అందుకే అడుగుతున్నా" అన్నాడు ఆది. అంతే..రష్మీ ఏం చెప్పాలో తెలీక సైలెంట్ ఐపోయింది. ఎందుకంటే ఇటీవల సుధీర్, రష్మీ ఎక్కడ జంటగా కనిపించట్లేదు. ఇద్దరు విడిపోయి చాలా నెలలౌతోంది.
"మనసులకు, దూరానికి ఎలాంటి సంబంధం ఉండదు. అవి ఎక్కడ ఉన్నా కలిసే ఉంటాయి" అని క్లారిటీ ఇచ్చింది రష్మీ. ఐతే ఇప్పుడు ఈ డైలాగ్ తో రష్మీకి సుధీర్ అంటే ఇష్టమేనేమో అనే విషయం పై చర్చ జరుగుతోంది. అలాగే ఈ రొమాంటిక్ ఎపిసోడ్ లో సుధీర్, రష్మీ జోడీని చాలా మిస్ అవుతున్నాం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.