English | Telugu
శేషు ఫామిలీ మెంబెర్స్‌ని మా ఆఫీస్ లో పనిచేయమనండి!
Updated : Jul 14, 2022
ఇటీవల ఎటు చూసిన బుల్లితెర మీద మల్లెమాల, జబర్దస్త్.. ఇవే హాట్ టాపిక్స్. ఇక ఈ రెండు అంశాలకు సంబంధించి కిరాక్ ఆర్పీ ఎన్నో కామెంట్స్ చేసాడు. దానికి ఆటో రాంప్రసాద్, ఆది కౌంటర్ అటాక్స్ ఇచ్చారు. అదిరే అభి కూడా మాట్లాడాడు. ఇక ఇప్పుడు షేకింగ్ శేషు లైన్ లోకి వచ్చేసి ఆర్పీ బండారం బయటపెట్టాడు. "అసలు నీ అనుభవం ఎంత.. అంత పెద్ద మనుషుల్ని, లైఫ్ ఇచ్చిన స్టేజిని నానా మాటలు అనడానికి" అంటూ విరుచుకుపడ్డాడు. "డైరెక్టర్ ని కావాలంటూ మూవీ స్టార్ట్ చేసావ్. మూవీ ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే 20 లక్షలు ఖర్చుపెట్టావు. ఈ విషయం గురించి ప్రొడ్యూసర్ నిలదీసేసరికి తోక ముడిచావ్." అంటూ ఫైర్ అయ్యాడు. ఇక ఈ విషయం గురించి ఆర్పీ మీద కంప్లైంట్ కూడా ఫైల్ చేసినట్లు చెప్పాడు.
శేషు కామెంట్స్ కి ఆర్పీ స్పందించాడు. "స్టోరీ లైన్ నచ్చేసరికి అరుణాచలం గారు మూవీని ప్రొడ్యూస్ చేస్తాం అన్నారు. నాగబాబు గారు, చక్రవర్తి గారు కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అనుకోని పరిస్థితుల కారణంగా మూవీ మిడిల్ డ్రాప్ అయ్యింది" అన్నాడు ఆర్పీ. "అంతా ఓకే అనుకున్నాకే ఆఫీస్ తీసుకున్నా. ఐనా జబర్దస్త్ లో నేను స్కిట్స్ వేసే టైంకి శేషు అక్కడ లేడు. జబర్దస్త్ పై రెండు మూడు సార్లు మాత్రమే అతన్ని కలిసాను" అన్నాడు. "మరి శేషుకి నా విషయంలో వేలు పెట్టి కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏమిటి?" అని ప్రశ్నించాడు.
"శ్యాంప్రసాద్ రెడ్డికి తొత్తు కాబట్టి శేషు అలా మాట్లాడుతున్నాడు" అంటూ విరుచుకుపడ్డాడు. "మూవీ స్టార్ట్ చేసాక ఎంతోమంది వస్తారు కాబట్టి ఆఫీస్ తీసుకున్నా.. శేషుకు నచ్చకపోతే ఆయన ఇల్లు ఇస్తే అక్కడే ఆఫీస్ పెట్టుకుంటా. వాళ్ళ ఫామిలీ మెంబెర్స్ ని మా ఆఫీస్ లో పనిచేయమనండి" అంటూ ఆర్పీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు జబర్దస్త్ లోపల ఏం జరుగుతోంది. ఇన్నేళ్ల నుంచి మౌనంగా ఉన్న కమెడియన్స్ ఒక్కొక్కరుగా ఎందుకు ఇలా మాటల యుద్ధాలకు దిగుతున్నారు. శ్యాంప్రసాద్ రెడ్డిని ఆర్పీ ఎందుకు అంతలా టార్గెట్ చేసాడు? అసలు దీని వెనుక జరుగుతున్న కుట్ర ఏమిటి.. ఆర్పీ వెనక ఉన్నది ఎవరు?.. అనే ప్రశ్నలు ఇండస్ట్రీ మొత్తం వినిపిస్తున్నాయి.