English | Telugu
ఐసీయూలో ఆర్య.. అను ఏమైంది?
Updated : Jul 14, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. గత కొన్ని వారాలుగా జీ తెలుగులో ప్రసారం అవుతూ చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతున్న ఈ సీరియల్ ని మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందింయారు. శ్రీరామ్ వెంకట్, వర్ష హెచ్ కె జంటగా నటించారు. ఇతర పాత్రల్లో బెంగళూరు పద్మ, జయలలిత, విశ్వమోహన్, రాం జగన్, రాధాకృష్ణ, జ్యోతిరెడ్డి, కరణ్, అనుషా సంతోష్, సందీప్, మధుశ్రీ తదితరులు నటించారు.
మలేసియా హనిమూన్ టూర్ విషాదంగా మారుతుంది. హనీమూన్ కోసం మలేసియా వెళ్లిన ఆర్య - అను తిరిగి హైదరాబాద్ వస్తుంటారు. వీళ్లు ప్రయాణిస్తున్న ఫ్లైట్ ప్రమాదానికి గురవుతుంది. సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగడంతో ఫ్లైట్ కాస్తా సముద్రంలో పడిపోతుంది. ఈ వార్త విన్న అను ప్యామిలీ తీవ్ర భయాందోళనకు గురవుతారు. టీవీలో ఈ వార్త చూస్తూనే అను తండ్రి సుబ్బు హార్ట్ స్ట్రోక్ కు గురికావడంతో ఆయనని బస్తీ వాసులు ఆసుపత్రికి తరలిస్తారు.
ఇక ఆర్య ఇంట్లో పరిస్థితి కూడా ఇదే తరహాలో వుంటుంది. ఆర్య - అను లు ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైందని తెలియడంతో ఆర్య తల్లి తీవ్ర అస్వస్థతకు లోనవుతుంది. ఇదే అదనుగా మాన్సి తల్లి మాటలతో ఆర్య ఫ్యామిలీని చిత్రవద చేస్తూ వుంటుంది. ఆర్య - అను తిరిగిరాని లోకాలుకు వెళ్లిపోయారని, వారు బ్రతికి రావడం కల్ల అని ముసలి కన్నీరు కారుస్తూ వేధిస్తూ వుంటుంది. అదే సమయంలో ఇంటికి వచ్చిన జెండే మాన్సీ తల్లి షీలా నోరు మూయిస్తాడు. ఆర్య - అను బ్రతికే ఛాన్స్ వుందంటాడు. కట్ చేస్తే ఐసీయూలో అర్య .. తలకు కట్లతో లేచి అను అంటూ అరుస్తాడు. వెంటనే ఆర్య దగ్గరికి వచ్చిన జెండే అనుకు ఏమీ కాలేదంటాడు. కానీ ఆర్య నమ్మడు.. ఇంతకీ అను ఏమైంది? ఎక్కడుంది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.