English | Telugu

బాగా నటిస్తున్నావ్ శ్రీహాన్.. నాగార్జున ఫైర్!

బిగ్ బాస్ లో జరిగే ఎంటర్టైన్మెంట్ సోమవారం నుండి శుక్రవారం ఒక ఎత్తు అయితే శనివారం, ఆదివారం జరిగేది మరొక ఎత్తు. ఎందుకంటే నాగార్జున శనివారం వచ్చి కంటెస్టెంట్స్ చేసిన తప్పులు అన్ని చెప్తూ వివరిస్తాడు.

అయితే నిన్నటి ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చి హౌస్ మేట్స్ కి గట్టి క్లాస్ పీకాడు. శ్రీహాన్ ని టార్గెట్ చేస్తూ ప్రతీ విషయం గురించి అడిగి బయటకు రప్పిస్తూ, ఎపిసోడ్ మొత్తం శ్రీహాన్ కి తను చేసిన తప్పు తెలిసేలా చెప్తూ వచ్చాడు నాగార్జున.

"గతవారం నువ్వు కీర్తి భట్ ని ఏం అన్నావ్. వంట నేర్చుకో అన్నావ్. మరి శ్రీసత్య ని అలా అనలేదు ఎందుకు? నీ ఫ్రెండ్ అనా?" అని నాగార్జున అడిగాడు. "అలా ఏం అనలేదు సర్! నాకు ఎవరైనా ఒకే" అని శ్రీహాన్ అన్నాడు. అయితే శ్రీహాన్ ఏం అన్నాడో వీడియో బైట్ చూపించాడు నాగార్జున. దీంతో తన తప్పు తాను తెలుసుకొని సారీ చెప్పాడు. ఆ తర్వాత నాగార్జున "బాగా నటిస్తున్నావ్ శ్రీహాన్.. సోమవారం నుండి శుక్రవారం వరకు ఒకలా నటిస్తున్నావ్. శనివారం, ఆదివారం నా ముందు ఒకలా నటిస్తున్నావ్. నటనలో నువ్వు తురుము.. తోపు" అని అన్నాడు. దీంతో శ్రీహాన్ ఆశ్చర్యపోతూ "సర్ మీరు పొగుడుతున్నారో? తిడుతున్నారో? అర్థం కావట్లేదు సర్" అని అన్నాడు. "కీర్తి దీనికి సమాధానం చెప్తుంది" అని నాగార్జున అనగా, తను కూడా ఇదే చెప్పింది.