English | Telugu

'ఆయన ఎంతో మంచి వ్యక్తి'.. డైరెక్టర్ మృతికి అనసూయ నివాళి


తెలుగు ఇండస్ట్రీలో ఒక అమేజింగ్ డైరెక్టర్‌ మదన్ ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మరణంపై యాంకర్ అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. "నేను జర్నలిస్ట్ గా నటించిన "గాయత్రి" చిత్రానికి ఆయన డైరెక్టర్. సహనం, అర్థం చేసుకునే గుణం ఉన్న మంచి వ్యక్తి ఆయన. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి"... అని అనసూయ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

మదన్ లాస్ట్ మూవీ గాయత్రీ. ఈ మూవీలో అనసూయ కీ రోల్ లో నటించారు. ఇంకా ఈయన గతంలో 'ఆ నలుగురు' చిత్రానికి మదన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. "పెళ్ళైన కొత్తలో, గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, గరం"వంటి చిత్రాలకు డైరెక్టర్ గా, రైటర్ గా పనిచేశారు. ఆయన మృతికి ఇండస్ట్రీ పెద్దలు , అభిమానులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.