English | Telugu
బిగ్ బాస్ లో కప్పులు, పప్పుల లొల్లి.. క్లాస్ పీకిన నాగార్జున!
Updated : Nov 19, 2022
బిగ్ బాస్ లో శనివారం అంటేనే మస్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. హోస్ట్ గా నాగార్జున తన స్టైల్ లో అదరగొడుతున్నాడు. కంటెస్టెంట్స్ టెన్ మెంబర్స్ ఉంటే అందరిలోను టెన్షన్ ఉంది అంటూ వాళ్ళే చెప్పుకోగా, అనుకున్నట్టే అందరికి గట్టి క్లాస్ పీకాడు నాగార్జున.
"నువ్వు ఆడే ఆటతీరుకి, యూ డిజర్వ్ రేవంత్" అని మొదలుపెట్టగా, "కెప్టెన్సీ అనేది బాధ్యత.. కప్పుల విషయంలో నువ్వు అధికారం చూపిస్తున్నావ్" అని నాగార్జున అనగా, "నేను అలా అనలేదు సర్..సాప్ట్ గా చెప్పాను సర్" అని రేవంత్ అన్నాడు. "ఆ రోజున నువ్వు అధికారంతో మాట్లాడావ్. నీ చుట్టూ ఉన్నవాళ్ళకి అర్థం అయ్యేటట్లు చెప్పాలి. అవే లీడర్ లో ఉండాల్సిన లక్షణాలు" అని చెప్పాడు నాగార్జున. ఆ తర్వాత ఇనయాని పిలిచి "ఆ కప్ లు ఎందుకు అమ్మా? స్టోర్ రూం లోని కబోర్డ్ లో పెట్టెయ్" అని నాగార్జున అన్నాడు. ఇనయా మాట్లాడుతూ "నా కప్పు పగిలిపోయింది సర్. అందుకే సూర్య కప్ లో తాగుతున్నాను" అని చెప్పింది. "ఈ డిస్కషన్ అంతా ఎందుకు? ఈ కప్ ఎందుకు? ఆ కప్ కబోడ్ లో పెట్టేసి రా" అని నాగార్జున చెప్పగా, ఇనయా పెట్టేసి వచ్చింది.
ఆ తర్వాత "రేవంత్ ఎక్కువ పప్పులు తింటాడు. పప్పులు రేషన్ కిందకి రావు అని రాజ్ కి మీరు అలా చెప్పలేదు కదా" అని నాగార్జున ఆదిరెడ్డిని అడిగాడు. "తిన్నా ఏమీ కాదు. రేషన్ లో భాగం కాదు అని రేవంత్ అన్నాడు అని చెప్పాను సర్" అని ఆదిరెడ్డి అన్నాడు. అలా రేవంత్ అనలేదు అని క్లారిటీ ఇచ్చాడు నాగార్జున.