English | Telugu
సముద్రపు ఒడ్డున తన్మయత్వంలో మునిగితేలుతున్న రష్మి
Updated : Nov 20, 2022
బుల్లితెర స్టార్ యాంకర్ రష్మి గురించి పరిచయం అక్కరలేదు. ఓ వైపు టీవీ షోలు, మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇటీవల 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేసింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు బిజీ షెడ్యూల్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకుని మాల్దీవ్స్ కి వెళ్లి చిల్ అవుతూ మంచి హాట్ హాట్ ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేస్తూ అందరినీ మైమరిపిస్తోంది. ఈ లోకాన్ని మరిచిపోయి తన్మయత్వంలో ఊగిపోతోంది రష్మీ.
ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.6 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సముద్రపు వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్న ఒక వీడియోను షేర్ చేసింది. ఇక కొంతమంది ఈమెను తెగ పొగిడేస్తున్నారు. "మీరు బీచ్ కి వెళ్లినా కూడా ఫుల్ డ్రెస్ వేసుకున్నారు కొందరు మాత్రం మరీ ఘోరంగా బికినీలు వేస్తారు", "ఇలా బీచ్ కి వెళ్లి దుప్పటి కప్పుకుని ఫోటోలు పెట్టింది ప్రపంచంలో నువ్వే" అని కామెంట్స్ చేస్తున్నారు. 'గుంటూరు టాకీస్' మూవీతో రష్మీ కనువిందు చేసింది. తర్వాత తన నటనను, మాటలను చాలా ప్రొఫెషనల్ గా తీర్చిదిద్దుకుని మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.