English | Telugu

ఇలాంటి రొమాంటిక్ గేమ్స్ ఆపేస్తే మా ఊపిరి ఆగిపోతుంది!

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. "బావగారు బాగున్నారా" టైటిల్ తో ఈ ఎపిసోడ్ రన్ అయ్యింది. ఇక ఈ షోలోకి "అహ నా పెళ్ళంట" వెబ్ సిరీస్ నుంచి రాజ్ తరుణ్, శివాని ఎంట్రీ ఇచ్చారు.ఈ వారం షోలో ఒక వెరైటీ సెగ్మెంట్ ప్లాన్ చేశారు. ఈ సెగ్మెంట్ నిరొమాంటిక్ గా ప్లాన్ చేసింది ఇంద్రజ.

స్టేజి మీద ఒక ఉయ్యాలనుఏర్పాటు చేసి బావల్ని కూర్చోబెట్టి వాళ్ళ ఒళ్ళో మరదళ్ళు కూర్చుని ఊగుతూ పక్కన పెట్టిన బాల్స్ ని ఎదురుగా ఉండే టబ్ లో వేయాలి. ఇది సెగ్మెంట్ థీమ్. ఇక జెస్సి-అంకిత, ఆదర్శ్-అన్షు, శ్రీకర్ - నీలిమ, మహేష్-రమ్య, ఆది-శ్వేతవర్మ, నాటీ నరేష్-పవిత్ర, నూకరాజు-ఆసియా, ప్రవీణ్-సింధు, అజర్-మోనికా, పరదేశి-కావ్య.. ఇలా ఈ సెగ్మెంట్ లో ఆది-శ్వేతవర్మ విన్ అయ్యారు.

ఈ సెగ్మెంట్ గురించి ఆది మాట్లాడుతూ "శ్రీదేవి డ్రామా కంపెనీ ఎన్ని ఎపిసోడ్స్ చేసానో తెలీదు కానీ..కుర్చీలాట ఎపిసోడ్, ఈ ఉయ్యాల ఎపిసోడ్ మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చాయి. రాబోయే వారాల్లో ఇలాంటి సెగ్మెంట్స్ పెట్టాలి అని కోరుకుంటున్నా. ఇలాంటి గేమ్ లు అస్సలు ఆపొద్దు..గేమ్ లు ఆపేస్తే మా ఊపిరి ఆగిపోతుంది"అన్నాడు.

ఇక ఫైనల్ గా రాజ్ తరుణ్- శివాని వచ్చారు కానీ పక్క పక్కన కూర్చునేసరికి ఇంద్రజ అదేంటి "మా షో చూసారు కదా పక్క పక్కన కూర్చున్నారేంటి" అనేసరికి "ఏమిటి మీరు రాజశేఖర్ గారి అంకుశం మళ్ళీ చూద్దాం అనుకుంటున్నారా" అని ఆది కౌంటర్ వేసేసరికి అందరూ నవ్వేశారు. ఫైనల్ గా రాజ్ తరుణ్- శివాని ఎక్కువ బాల్స్ వేసి ఆది-శ్వేతవర్మ ని బీటౌట్ చేసింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.