English | Telugu

ఆదిరెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున!

నిన్నటి బిగ్ బాస్-6 ఎపిసోడ్‌లో నాగార్జున ఒక్కో కంటెస్టెంట్ కి వారు చేసిన మిస్టేక్స్ ని చెప్తూ ఫుల్ ఫైర్ అయ్యాడు. దాంట్లో భాగంగా ఆదిరెడ్డికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. "హౌస్ మేట్స్ మీరు చాలా బాగా ఆడుతున్నారు. కానీ ఆట అయ్యాక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. బలం ఉండొచ్చు..నాకే ఆ బలం ఉంది అని అనుకోవడం తప్పు" అని నాగార్జున, రేవంత్ తో చెప్పాడు. ఆ తర్వాత హౌస్ మేట్స్ కి "మీ శక్తిని ఆటలో ప్రదర్శించండి. మాటలో కాదు" అని చెప్పాడు. ఆ తర్వాత ఆదిరెడ్డితో నాగార్జున మాట్లాడుతూ "ఆది..ఎందుకు మాటి మాటికి గేట్లు తీయండి. నేను వెళ్ళిపోతా అని అంటున్నావ్. నువ్వు సరిగ్గా ఆడకుంటే ఆడియన్సే గేట్లు తీసుకొని వచ్చి నిన్ను తీసుకెళ్తారు" అని ఫైర్ అయ్యాడు.

శ్రీసత్య కోసం శ్రీహాన్ త్యాగం చేసాడు అని ఆదిరెడ్డి అన్నాడు.మీ ఇష్టం అని రేవంత్ అన్నాడు. "అమ్మాయిలు వీక్ కాబట్టి వాళ్ళ మీద గెలవచ్చు అని రేవంత్ చెప్పలేదు" అని నాగార్జున అనగా, "కానీ నాకు ఆ సెన్స్ లో అనిపించింది" అని ఆదిరెడ్డి అన్నాడు. "బిగ్ బాస్ ఆట ఇచ్చినప్పుడు ఆట ఆడాలని ఇనయా అంది. అయినా కూడా నువ్వు ఆడలేదు ఎందుకు? అంటే బిగ్ బాస్ యూజ్ లెస్ టాస్క్ లు ఇస్తున్నాడా? నీ దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంటే, ఒక జెన్యూన్ కంటెస్టెంట్ ని ఆపేవాడివి కదా? నువ్వే ఆట ఆడిస్తున్నావ్ అనుకుంటున్నావా?" అని నాగార్జున ఆదిరెడ్డితో అన్నాడు. "నాకు అవసరం లేదు సర్" అని ఆదిరెడ్డి చెప్పాడు.

"ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంటే ఎవరినైనా సేవ్ చేయోచ్చు. నువ్వు ఏం అయినా తోపా? తురుమా? ఎప్పుడు గేమ్ లో లూప్ లు వెతికితే ఏం ఉండదు. తుప్పాస్ వర్షన్ లా ఉంది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వేస్టా? అంటే బిగ్ బాస్ పెట్టే టాస్క్ లు అన్నీ వేస్టా? అసలు గేమ్ ని గేమ్ లా ఆడాలి. గేమ్ రూల్స్ చెప్పుకుంటూ, ఆడకుండా పక్కకి ఉండటం తెలివితేటలా?" అని నాగార్జున ఫైర్ అయ్యాడు.