English | Telugu

హౌస్ మేట్స్ చెప్పిన బాటమ్-ఫైవ్, టాప్-ఫైవ్ ఎవరు?

బిగ్ బాస్ హౌస్ లో పది మంది కంటెస్టెంట్స్ లో ఎవరు టాప్-ఫైవ్ లో ఉంటారు. ఎవరు బాటమ్-ఫైవ్ లో ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో నాగార్జున హౌస్ మేట్స్ ని ఒక్కొక్కరిని సీక్రెట్ రూం కి పిలిచి ఎవరు బాటమ్-ఫైవ్, టాప్-ఫైవ్ లో ఉంటారో చెప్పమన్నాడు.

దీంతో హౌస్ మేట్స్ అందరు తమ అభిప్రాయాలు తెలుపుతూ వచ్చారు. "మెరీనా, రాజ్, కీర్తి, రోహిత్, ఇనయా బాటమ్-ఫైవ్ లో ఉంటారని నేను అనుకుంటున్నాను" అని రేవంత్ చెప్పాడు. ఆ తర్వాత శ్రీసత్య మాట్లాడుతూ " మెరీనా, కీర్తి, ఇనయా, రాజ్, రోహిత్ బాటమ్-ఫైవ్ లో ఉంటారు. మిగిలిన వాళ్ళు టాప్ లో ఉంటారు" అని చెప్పింది. ఆ తర్వాత రోహిత్ "శ్రీహాన్, కీర్తి, ఇనయా, మెరీనా, రాజ్ బాటమ్-ఫైవ్ లో ఉంటారు" చెప్పాడు. శ్రీహాన్ మాట్లాడుతూ " రోహిత్, మెరీనా, కీర్తి, రాజ్, ఆదిరెడ్డి బాటమ్-ఫైవ్ లో ఉంటారు" అని చెప్పాడు.

ఫైమా మాట్లాడుతూ " ఇనయా, కీర్తి, మెరీనా, రోహిత్ బాటమ్ లో ఉంటారు. మిగిలిన వాళ్ళు టాప్-ఫైవ్ లో ఉంటారు" అని చెప్పింది. రాజ్ మాట్లాడుతూ " ఆదిరెడ్డి, ఇనయా, శ్రీహాన్, మెరీనా, రోహిత్ బాటమ్- ఫైవ్ లో ఉంటారు. మిగిలిన వాళ్ళు టాప్- ఫైవ్ అని చెప్పాడు. ఇప్పటివరకు హౌస్ లో జరిగిన టాస్క్ లలో ఆటతీరు, మాటతీరు పరంగా ఒక్కో కంటెస్టెంట్ తమ అభిప్రాయాలు తెలిపారు. కాగా మెజారిటి సభ్యులు రాజ్, కీర్తి, ఇనయా, మెరీనా, రోహిత్ బాటమ్-ఫై లో ఉంటారని చెప్పారు. ఇక టాప్-ఫైవ్ లో రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య ఆదిరెడ్డి ఉంటారు అని చెప్పుకొచ్చారు.