English | Telugu
ఆది మీద జడ్జి ఇంద్రజ ప్రశంసల వర్షం...నెగటివ్ టాక్ కి ఫుల్ స్టాప్!
Updated : Nov 21, 2022
శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఈ వారం మంచి కలర్ ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. ఐతే ఆది మీద జడ్జి ఇంద్రజ ప్రశంసల వర్షం కురిపించింది.
ఇక ఈ వారం బావగారు బాగున్నారా సెగ్మెంట్ చూస్తే అవే ఆది రొటీన్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ వినిపించాయి . "ఆది గారు చేసే స్కిట్ ఎంతో ఫన్నీగా ఉంటుంది..ఆది స్కిట్స్ చాలా బాగుంటాయి. అందరికీ సమానంగా పంచులు పంచుతాడు. ఆది టీమ్ లో ఉండే అందరికీ సమానంగా డైలాగ్స్ ఉంటాయి. ప్రతీ ఒక్కరూ ఆదితో పని చేయడానికి ఇష్టపడతారు.." అంది ఇంద్రజ.
ఇక తర్వాత శ్వేతా వర్మని, సీరియల్ యాక్టర్ శ్రీకర్ ని కూడా అడిగింది ఆది స్కిట్ గురించి వాళ్ళు కూడా పొగిడేసరికి " ఆది స్కిట్ ఎలా ఉండాలో అలాగే ఉంటుంది" అని ఆకాశానికి ఎత్తేసింది. ఈమధ్య స్కిట్స్ లో వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ ని పర్సనల్ రిలేషన్స్ ని మిక్స్ చేసి మరీ స్కిట్స్ వేస్తున్నారు, పంచులు పేలుస్తున్నారు. ఆది మీద వస్తున్న నెగటివ్ టాక్ కి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఇంద్రజ ఇలా ఆదిని పొగిడి ఆకాశానికి ఎత్తే పని పెట్టుకున్నట్టున్నారని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.