English | Telugu
చనిపోతున్నానంటూ స్వర్ణకి కాల్ చేసిన మేఘన లోకేష్
Updated : Nov 20, 2022
మేఘన లోకేష్ బుల్లితెర నటి. ఈమె ప్రస్తుతం 'కళ్యాణం కమనీయం' సీరియల్ లో నటిస్తోంది. అయితే ఇప్పుడు ఆమెకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్స్ కి షాకిచ్చింది.
టెక్నాలజీ బాగా డెవెలప్ అయ్యాక యూట్యూబ్ చానెల్స్ పెరిగాక ఎన్నో రకాల వీడియోస్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. షాకిచ్చే థంబ్ నెయిల్స్ తో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ని సంపాదిస్తున్నారు. ఇక ఇప్పుడు మేఘనాలోకేష్ కూడా అలాంటి పనే చేసింది. రోజూ కంటెంట్ దొరకదు కాబట్టి ఒక ప్రాంక్ వీడియో చేసి అందరినీ ఒక్క నిమిషం భయపెట్టేసింది.
మేఘన ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ కి కాల్ చేసింది.. వాళ్లలో కొందరి కాల్స్ బిజీ రాగా, మరి కొందరికి కనెక్ట్ కాలేదు. ఫైనల్లీ మేఘన ఫ్రెండ్, యాక్టర్ స్వర్ణ కాల్ బ్యాక్ చేశారు. ఈ క్రమంలో మేఘన.. "అక్కా ఇంట్లో ఎవరూ లేరు. నీరసంగా అనిపిస్తోంది. ఏం జరుగుతుందో తెలియట్లేదు, కళ్ళు తిరిగిపోతున్నాయి, నువ్వొచ్చేలోపు చచ్చిపోతానేమో" అని అమాయకంగా మాట్లాడేసరికి అవతల వైపు స్వర్ణ తెగ కంగారు పడిపోయింది. "ఇప్పుడు వచ్చేస్తా..లొకేషన్ షేర్ చెయ్యి.. కాల్ కట్ చేయొద్దు" అని భయపడిపోయి, ఏడ్చినంత పని చేసింది... చివర్లో.. ఇది ప్రాంక్ అని మేఘన చెప్పేసరికి అవతల వైపు స్వర్ణ ఫుల్ రిలాక్స్ అయిపోయింది.