English | Telugu
ఆది ఒక స్కిట్ కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడో తెలిస్తే షాకవ్వాల్సిందే
Updated : Nov 21, 2022
ఈ వారం ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీలో యూట్యూబర్స్ క్రియేట్ చేసిన థంబ్ నెయిల్స్ కి కూడా ఒక ప్లేస్ ఇచ్చేసరికి ఈ షో రేటింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఆదిని టార్గెట్ చేసే ఒక థంబ్ నెయిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది " ఆది జబర్దస్త్ లో ఒక స్కిట్ కి ఎన్ని లక్షలు తీసుకుంటాడో మీకు తెలుసా ? అనేదే ఆ థంబ్ నెయిల్. ఇక ఆదిని స్టేజి మీదకు పిలిచి అడిగింది రష్మీ..ఆది కాస్త ఎక్కువగానే ఓవర్ యాక్షన్ చేసి "మా షోలో కూడా చాలామందికి ఈ డౌట్ వచ్చింది.
ఐతే ఇప్పటి వరకు నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రమే చెప్తున్నాను..ఒక స్కిట్ కోసం మా టీమ్ మెంబర్స్ చాలా కష్టపడతారు..మంచి డైలాగ్స్ రాయాలి, మంచి పంచులు ఆలోచించాలి...ఇంత చేస్తున్నప్పుడు మరి ఎక్కువే తీసుకోవాలి కదా అని చేత్తో ఇంత తీసుకుంటున్నాం" అని ఫన్నీ గా చెప్పేసరికి అందరూ నవ్వేశారు. ఇక మధ్యలో సీరియల్ నటుడు ఐన శ్రీకర్ మాట్లాడుతూ " ఆది తన స్కిట్ కోసం తీసుకునే లక్ష కన్నా స్కిట్ తరువాత ఉండే తన లక్ష్యం గురించి ఎక్కువగా పాకులాడతాడు" అని కౌంటర్ డైలాగ్ వేసేసరికి అందరూ నవ్వేశారు. ఈ ఫేక్ థంబ్ నెయిల్స్ చూసి ఆడియన్స్ కూడా అదే అనే భ్రమలో ఉంటారు కానీ కాదు అని చెప్పడానికే ఇలాంటి సెగ్మెంట్ పెట్టాం అని చెప్పి ఈ షోని ఎండ్ చేసింది రష్మీ.