English | Telugu

గీతూ గురించి ఒక స్టూడెంట్ ఆన్సర్ షీట్ లో రాసిన ఒపీనియన్ వైరల్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో గీతు రాయల్ ఒక తుపాను అని చెప్పొచ్చు. ఆమె ఆట తీరుపై ఎవరి అభిప్రాయం వారిది. టాప్-5లో ఉంటుందనుకున్నారు చాలామంది. కానీ ఆమె మధ్యలోనే ఇంటికి వచ్చేయడం చాలామందికి షాకిచ్చింది. ఇక ఎలిమేషన్ టైములో ఆమె ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఇంటర్వ్యూలు చేసిన తీరు చూస్తే కొంచెం అతిగా అనిపించినా చాలామంది మనసుల్ని ఆమె కదిలించింది. బిగ్ బాస్ హౌస్ పై ఆమె చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ అయ్యాయి. ఐతే గీతూ ఇప్పుడు తన మిత్రుడు, తనకు బాగా ఇష్టమైన వ్యక్తి ఐన ఆది రెడ్డి అలియాస్ ఉడల్ మామను సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తోంది. ఇక ఇప్పుడు గీతూకి సంబంధించి ఒక న్యూస్ సోషమీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. రీసెంట్ గా ఆమె తన ఇన్ స్టాలో ఒక స్టోరీ పెట్టింది. ఎవరో స్టూడెంట్‌ తన ఇంగ్లీషు అసైన్‌మెంట్‌లో.. "తనను ఇన్‌స్పైర్ చేసిన మహిళ ఎవరు..?ఎందుకు" అనే ప్రశ్నకు ఆ స్టూడెంట్ గీతూ గురించి రాశారు.

"ఆమె చాలా శక్తివంతమైన మహిళ, ధైర్యవంతురాలు, ఎవరి మీదా ఆధారపడదు..ఎవరేం అనుకున్నా తన అభిప్రాయాలను బయట పెట్టేస్తుంది" అని చెప్తూ ఇలా ఆమెలోని ఎన్నో క్వాలిటీస్ ని వివరిస్తూ ఆ ఆన్సర్ షీట్ లో ఆ స్టూడెంట్ పేర్కొన్నారు. " తప్పు తనవైపు లేకపోతే దేని గురించి భయపడదు. సమస్యలు ఎదురైనప్పుడు పారిపోకుండా.. తనపై నమ్మకంతో ఉంటారని" పేర్కొంది. దీంతో ఆ అసైన్‌మెంట్‌ ఆన్సర్ షీట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది గీతూ.. అది చూసి తనపై అభిమానులు చూపుతున్న ప్రేమకు పిచ్చెక్కిపోతోందని వెల్లడించింది.