English | Telugu

టమాటల కోసం కష్టపడుతున్న యాంకర్ రవి!

బుల్లితెర టీవీ యాంకర్స్ లో యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని పంచ్ లకి, మాటలకి ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువే ఉంది. రవి వేసే స్పాంటేనియస్ కామెడీకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. యూత్ కి బాగా కనెక్ట్ అయి ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తుంటాడు రవి.

బిగ్ బాస్-5 లో ఎంట్రీ ఇచ్చిన రవికి.. హౌస్ లో పాజిటివ్ ఇంప్రెషన్ కన్నా నెగెటివ్ ఇంప్రెషనే ఎక్కువ వచ్చింది‌. ఏం వచ్చిన ఫేమ్ అయితే వచ్చిందనే చెప్పాలి. రవి ఎంట్రీతో బిగ్ బాస్ విన్నర్ అతనే అని మొదట్లో అనిపించినా.. తను లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అతను బిహేవ్ చేసిన దానికి అదంతా తలకిందులై అనుకోకుండా రవి బయటికొచ్చేసాడు. తను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు జరిగిన ఫ్యామిలీ వీక్ లో.. రవి ఫ్యామిలీ వచ్చినప్పుడు ఎమోషనల్ గా సాగిన ఎపిసోడ్, మోస్ట్ ఎమోషనల్ ఇన్ బిగ్ బాస్ గా చెప్పుకోవచ్చు. రవి యాంకరింగ్ అంటేనే ఎనర్జిటిక్ గా ఉంటుంది. ప్రేక్షకులను తన మాటలతో ఉత్తేజపరుస్తాడు. రవి తన యూట్యూబ్,ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకులకు ఎప్పుడు దగ్గరగా ఉంటాడు. ఎవరైనా నెగెటివ్ కామెంట్లు చేస్తే ఘాటుగానే రిప్లై ఇస్తాడు.

అమెరికాలో ట్రావెలింగ్ వ్లాగ్, ఫుడ్ వ్లాగ్ అంటు బిజీగా గడిపిన యాంకర్ రవి ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటున్నాడు. కాగా ఇండియాకి వచ్చాక కూడా అదే జోరుని కొనసాగిస్తున్నాడు. ట్రెండింగ్ లో ఏది ఉంటే దానికి సంబంధించిన రీల్స్, వ్లాగ్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే తాజాగా రవి మార్కెట్ కి వెళ్లి మార్కెట్ మొత్తం తిరుగుతున్న ఒక వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. " నేను వెస్ట్ ఆఫ్రికాలోని నమీబియాలో ఉన్నాను.. భయంకరమైన వేడి నుండి ప్రాణాలతో ఎలా బయటపడాలో, నేను మీకు చూపించబోతున్నాను " అంటూ ఎండలో తిరుగుతూ ఒక ఆడియో క్లిప్ కి యాక్ట్ చేసి చూపించాడు. టమాటల ధర అధికంగా ఉండటంతో వాటి కోసం వెతుకుతున్నట్టుగా ఈ వీడియోకి సింక్ చేయడంతో.. నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. దీంతో మరోసారి యాంకర్ రవి చేసిన వీడియో ట్రెండింగ్ లోకి వచ్చింది. యాంకర్ రవి జీతెలుగులో ప్రసారం కానున్న ఒక కొత్త షోకి యాంకర్ గా చేస్తున్నట్టు, దానికి సంబంధించిన విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.