English | Telugu

జంతువుల్లా ప్రవర్తించాలి...

హంసానందిని కాన్సర్ ఫైటర్ గా అందరికీ తెలిసిన నటి. "లౌక్యం" మూవీతో టాలీవుడ్‌కు పరిచయమై ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. రాజమౌళి మూవీ "ఈగ" తో ఓ రేంజీలో పాపులారిటీ తెచ్చుకుంది. పవన్‌తో "అత్తారింటికి దారేది" చిత్రంలో అదిరిపోయే స్టెప్పులతో తెలుగు ఆడియన్స్ ని బాగా అలరించింది. హీరోయిన్‌గా కాకపోయినా స్పెషల్ సాంగ్స్ తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న హంసానందిని క్యాన్సర్ వ్యాధి బారిన పడి ప్రస్తుతం కోలుకుని మళ్ళీ కం బ్యాక్ ఇచ్చింది. అలాంటి హంసానందిని రీసెంట్ గా వెకేషన్ కి వెళ్లినట్టు తెలుస్తోంది.

అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసిన హంసానందిని తన స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టింది. "సముద్రంలో కానీ బీచ్ లో కానీ జంతువులు ఎలాంటి వేస్ట్ ని వదిలేయవు. ఒక్క మనుషులే అలా చెత్తను వదిలి వెళ్తారు. మనుషుల్లా కాదు జంతువుల్లా ప్రవర్తించాలి" అనే కాప్షన్ పెట్టింది. అలాగే చందమామని ఫోటో తీసి ఆ చంద్రుడికి తనదైన స్టైల్లో వర్ణింస్తూ పోస్ట్ పెట్టింది. "తనను ఫోన్ లో బంధించడాన్ని చంద్రుడు అస్సలు ఇష్టపడడు. కానీ ఎందుకో తెలీదు అందరూ చంద్రుడిని చూడగానే మైమరిచిపోతారు ..మన ఎదురుగానే ఉంటాడు, మనల్ని ఆకర్షిస్తూ ఉంటాడు...కానీ అతన్ని మనం చేరుకోలేనంత దూరంలో ఉంటాడు" అని రొమాంటిక్ కాప్షన్ పెట్టింది. హంసానందిని ప్రస్తుతం తన మైండ్ ని, బాడీని ఇలా ప్రకృతిలో విహరిస్తూ రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. హంసానందిని వంశీ డైరెక్షన్ లో వచ్చిన 'అనుమానస్పదం' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మిర్చి, భాయ్, రామయ్య వస్తావయ్యా వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. కొంత కాలం క్రితం కేరళ మున్నార్ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరించింది హంస. ఇక ఇన్స్టాగ్రామ్ లో స్వాన్ స్టోరీస్ పేరుతో తన ఆలోచలను షేర్ చేసుకుంటూ ఉంటుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.